టెస్ట్ చేసి హార్ట్ ఎటాక్ అని చెప్పిన డాక్టర్స్ రెండు స్టంట్స్ వెయ్యాలని ఆపరేషన్ స్టార్ట్ చేస్తే,బయట ఏదో ఆలోచనలో ఉన్న వంశికకి ఓదార్పుగా భుజాన్ని ఆసరా ఇచ్చిన రఘు గారు ఏమైందని సౌమ్యంగా అడుగారు.
అక్కడ విన్న మాటలన్నీ పొల్లుపోకుండా చెప్పిన వంశిక అతను వదిలేసి వెళ్ళిపోతే దానికి నన్నేందుకు బాబాయ్ అందరూ బాధ్యుల్ని చేస్తున్నారు.
నిన్న నాన్న కూడా నేనే ఏదో చేసానని నన్నే అన్నారు. పంతొమ్మిదేళ్లు పెంచిన కూతురి మీద ఆయన పెంపకం మీద అంత నమ్మకం లేకపోయిందా ఆయనకి.
ఇందాక కింద పడేప్పుడు కూడా ఆయన చూపులో నీవల్లే ఇదంతా అన్న భావం నాకు స్పష్టంగా కనిపించింది బాబాయ్.
భరించలేకపోతున్నా ఇదంతా నేను.అసలు వీటన్నిటికీ కారణం అయిన అతన్ని జీవితంలో క్షమించలేను బాబాయ్.ఎలాగైనా అతడ్ని నా కళ్ళ ముందుకు తీసుకురా. ఎందుకిలా చేసాడోనని కాలర్ పట్టుకొని మరీ అడుగుతా బాబాయ్.
ఒక్క క్షణం కూడా ఉండలేకపోతాడు రఘు గారు అక్కడ. బాధతో వెళ్లిపోయాడనుకున్న వంశిక మౌనంగా అక్కడున్న చైర్ లో కూలబడితే సమాచారాన్నంతా ఒకరికి చేరవేసిన ఇంకొకరు నెమ్మదిగా అక్కడ నుండి జారుకున్నాడు.