అర్జున్ ఒక్కసారిగా శ్వాస తీసుకుని వదిలి.
వైదేహి నేను ఇప్పుడు మాట్లాడబోయే విషయం నీ జీవితానికి అభిమన్యు జీవితానికి సంబంధించిన విషయం బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అంటూ అభిమన్య గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు.
అభిమన్యు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నను అత్త మామను ఇంకా తన మరదలిని ఒక యాక్సిడెంట్లో తన కళ్ళముందే కోల్పోయాడు.
ఆ చిన్న వయసులో తన కళ్ళ ముందు జరిగిన ఆ సంఘటన అభి ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నాడు.
ఆ యాక్సిడెంట్ కేవలం ప్రమాదం మాత్రమే కాదు ఎవరూ కావాలని చేసింది కానీ అది ఎవరు చేశారు అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు.
అభికి కూడా వాళ్ల నుంచి ప్రమాదం ఉంది.
అభి కుటుంబం తన కళ్ళ ముందే అందరూ చనిపోవడం వాడు ఇప్పటికి తట్టుకోలేడు.
అందుకే అప్పటినుంచి నవ్వటమే మర్చిపోయాడు. బ్రతికున్న బొమ్మల జీవిస్తున్నాడు ఏలాంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ వాడు క్యారీ చేయలేడు.
ఆ సంఘటన అభి కి గుర్తు వచ్చినప్పుడల్లా నరకాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆ ప్రెజర్ అభి బ్రెయిన్ మీద పడుతుంది.