“శైలుకి పుట్టినప్పటినుంచి ఆరోగ్యం తక్కువ, మీ అమ్మ దాన్ని చూసుకునే క్రమంలో ఆరోగ్యంగా ఉన్న నిన్ను ఇంకా పెళ్లి కానీ నా దగ్గర వదిలిపెట్టింది.. అమ్మమ్మ తాతయ్య సహాయంతో నిన్ను నేను పెంచాను.
నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు నా వయసు 16 కూడా నిండలేదు, తెలిసి తెలియని నా ప్రపంచంలో నువ్వే అన్ని అయ్యావు.. నీతో పాటు నేను కూడా పెరిగాను రా..
అదే చిన్నతనం అమాయకత్వంలో నువ్వు నన్ను అమ్మ అమ్మ అని పిలుస్తుంటే మీ అమ్మ మనసు విలవిలలాడిపోయేది.. నిన్ను నేను బలవంతంగా అమ్మ అనే పిలుపు నుంచి పిన్ని అనే పిలుపుకి మార్చాను.. కారణమేదైనా కావచ్చు లహరికంటే కూడా నిన్నే నేను ఎక్కువ ప్రేమగా పెంచాను.” అని అంది కస్తూరి.
ఒక్క క్షణం కస్తూరి మాటలకి గతంలోకి వెళ్లిన కౌసల్య కన్నీరుతో తలదించుకుంది.
“నాకు తెలుసు పిన్ని.” అని అన్నాడు కస్తూరిని కౌగిలించుకొని కన్నీళ్లు కారుస్తూ శౌర్య.