“మరిది గారిని కూడా తొందరగా రమ్మని చెప్పు కస్తూరి.” అని అంది ఇద్దరికి బ్రేక్ ఫాస్ట్ వడ్డిస్తూ కౌసల్య.
“మీ మరిది గారు ఏమీ పని మీద వెళ్లలేదు కొడుకుకి సంబంధం కుదురుతుంది అంటే ఈయన పెళ్ళికొడుకుగా రెడీ అవ్వడానికి కటింగ్ షాప్ కి వెళ్ళాడు కటింగ్ చేయించుకోవడానికి.” అని అంది చట్నీ ప్లేట్లలో పెడుతూ కస్తూరి.
“హ..” అని నవ్వుతూ బ్రేక్ఫాస్ట్ చేయడం మొదలుపెట్టింది కౌసల్య.
వేద రెడీ అవుతున్న తండ్రిని చూసి..”నాన్నా నేను కాలేజ్ కి వెళ్తున్నాను.” అని అంది.