“ఏంటే ఆలోచిస్తున్నావ్ అంటే సమాధానం చెప్పకుండా ఆ బల్లి గుడ్లు ఏసుకొని చూస్తావేందే..” అని అన్నాడు శ్రీపాద.
“మనం కూడా ఒక పాపనో బాబునో కంటే బాగుంటుంది కదా..!” అని అంది శ్రీపాద గుండె మీద తన చేతి వేలితో రాస్తూ శైలు.
“ఎవరికి బాగుంటుంది..?” అని అడిగాడు శైలు కళ్ళల్లోకి చూస్తూ శ్రీపాద.. అంటే హాస్పటల్లో శైలుకి అమ్మ చెప్పింది ఇదేనా అనే ఆలోచనతో.
“ఎవరికి అంటే..! మనకే.” అని అంది శైలు.