ఇదే కదా తను వినాలి అనుకుంది.. అందుకే కదా రెచ్చగొట్టింది. వెంటనే తనలో పూర్తిగా ఐక్యం చేసుకుంటూ ఆ రాత్రిని ఎదురుగా ఉన్న రతీ దేవిని పూర్తిగా ఆస్వాదించాడు శ్రీపాద.
మనసా వాచా కర్మణా పూర్తిగా అతను నా వాడు అనుకున్న తర్వాతే శ్రీపాద చెయ్యి పట్టుకున్న శైలు, తన దగ్గర ఏమీ లేదు పూర్తిగా అతనికే అర్పించాను అన్నట్టుగా శ్రీపాదలో కలిసిపోయింది ఇష్టంగా.. ఇప్పటికి ఇలా కొన్ని లక్షల కలయికలు జరిగి ఉండొచ్చు తమ మధ్య కానీ ప్రతి కలయిక మొదటి లాగానే ఉంటుంది..అది ఎందుకో తనకి అర్థం కాలేదు.
ఉదయం లేచి శౌర్య మెసేజ్ చూసిన వేద హ్యాపీ మార్నింగ్ అని మెసేజ్ చేసి కాలేజ్ కి రెడీ అవుతూ ఉంది.
అప్పటికే డ్యూటీలో ఉన్న శౌర్య మెసేజ్ చూసి లవ్ సింబల్ ఇచ్చి ఎదురుగా ఉన్న ఫైల్స్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాడు.