“ఇప్పుడు మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారా..!” అని అంది శైలు శ్రీపాదని చూస్తూ.
“హ… ఏంటి..?” అని అన్నాడు శైలుని చూస్తూ ఏమీ అర్థం కాక శ్రీపాద.
“అంటే వెనకకి ముందుకి ఇక్కడే కారును తిప్పుతున్నారు కదా..! డౌట్ వచ్చింది.” అని అంది శైలు అమాయకంగా ముఖం పెట్టి.
“సైలెంట్ సెటైర్ వేయడంలో నీ తర్వాతే ఎవరైనా..” అని ఇంకా తల్లిదండ్రి దాని కోసం బయటకి రారు అని కారుని గేటు బయటకు తీశాడు శ్రీపాద నిరాశగా.