అర్జున్ ఫారిన్ లో చదువుకుంటూనే ఇండియాలో కంపెనీ పెట్టి అతను అక్కడి నుంచి అన్ని మానిటర్ చేస్తూ ఉన్నాడు….
సో శ్రావణి పెళ్లి అయిపోయిన తర్వాత అఫీషియల్ గా తను సీఈఓ ఇంట్రడ్యూస్ అవుదామని అనుకున్నాడు కానీ ఇంట్లో పెద్ద గొడవ అయ్యేసరికి అతనికి ఇరిటేషన్ గా ఉన్నా కూడా బిజినెస్ పక్కన పెట్టలేక తన యూజువల్ ప్లాన్ తో ముందుకు వచ్చేసాడు….
తను సీఈఓగా ఇంట్రడ్యూస్ అవడంతో కంపెనీలో చాలామంది అమ్మాయిలకి డ్రీం బాయ్ అయిపోయాడు….
***************
ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అతని క్యాబిన్ దగ్గరికి మేనేజర్ సర్… కొత్త రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఇంటర్వ్యూకి క్యాండిడేట్స్ని మీరే దగ్గరుండి షార్ట్ లిస్టు చేస్తానన్నారు కదా అంటూ ఒక లిస్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు….
ఎస్ అంటూ మేనేజర్ చేతిలో ఉన్న సిస్టం తీసుకొని క్యాండిడేట్స్ లిస్ట్ చూస్తూ ఉండగా సంయుక్త ప్రొఫైల్ పైకి వెళ్ళిపోవడంతో ఒక్క క్షణం ఆగిపోయి ప్రొఫైల్ మళ్ళీ చెక్ చేసి సంయుక్త కనిపించడంతో ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి కాగా అతని పెదవులు ఒక రకమైన మిస్టీరియస్ స్మైల్ ఇచ్చాయి…