New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా మనసుని తాకే 💘 స్వరమా – 1

నా మనసుని తాకే 💘 స్వరమా – 1

నా మనసుని తాకే 💘 స్వరమా 

 

 

అదొక అరుదయిన.కళ్యాన మండపం.పచ్చటి

తోరణాలు.తో.బంతి చామంతి గులాబి తులిప్స్

ఇలా అందమయిన.అరుదయిన పుష్పాలతో

 

మెరిసి పోతుంది ఆ ప్రదేశమంతా. ఎటు చూసినా కాస్ట్లీ అరేంజ్మెంట్స్.పెద్ద పెద్ద బిజినెస్ మేన్ లు 

విఐపిలతో.. కిక్కిరిసిపోయింది పెళ్లి పందిరి 

 

 

అంతకంతకు పెరుగుతూ వస్తున్న బంధువులు స్నేహితులు.ఆ ఏర్పాట్లు చూసి.వాళ్ళల్లో వాళ్ళే 

గుసగుసలాడుకుంటున్నారు………….

 

ఎంత పుణ్యం చేసుకుంటే వస్తుంది ఇలాంటి 

సంబంధం, ఎంతైనా.. కరుణాకర్.అదృష్ఠం

వంతుడు.. లేక పోతే అంత పెద్దింటి వాళ్ళు 

కోరి వచ్చారంటే.మాటల… అని . కొందరు మరి..కొందరు ఏమొ.. వాళ్ళ కెందుకు ఇలాంటి 

అదృష్టం కలిసి రాలేదు అని వాళ్ళ మనసుల్లో 

 

అసూయ ని ఈర్ష్య ని వెళ్ల గక్కుతున్నారు……

 

 

ఇంతలో అమ్మ పెళ్లి కుమార్తె ను తీసుకురండి 

అన్న పంతులు గారి పిలుపు కి. అమ్మాయి ని తీసుకురావడానికి వెళ్లారు కొంతమంది పెద్దవాళ్ళు 

ఆడ పిల్లలు…………..

 

 

పెళ్ళి కూతురి గది లో… ఒక అమ్మాయి లంగా ని కొంచెం పైకంతా.పట్ఠుకుని తన బారు జడ ని

ముందుకు వేసి వోణి ని మెడచుట్టూ……

హారం లా వేసి.. చెంగు చెంగున ఎగురుతూ 

వస్తుంది.అలా వస్తున్నపుడు.. తన కాళ్ళకున్న

 

అందమైన మువ్వల పట్టీలు ఘల్లు ఘల్లు మంటూ 

హృద్యంగా సవ్వడి చేస్తున్నాయ్……….

 

పెళ్లి కూతుర్ని ముస్తాబు చేస్తున్న… కొందరు.

అమ్మ లక్కలు….

 

ఆ అమ్మాయి ని .. చూసి .అన్నీ సక్రమంగా…

ఉన్నాయొ లేదో అని ఒకటి కి పదిసార్లు.

చూసుకుంటూ సర్దుకుంటున్న …. సుశీల గారి తో.

 

ఏవమ్మా… సుశీల  మాకు తెలిసి  కరణం 

అన్నయ్య ..పెళ్లి చేసేది. మి.పెద్దమ్మాయి 

నవ్య కొక్కరదానికే.. కచ్చితంగా ఇ చిన్నది

ఎవడ్నొకడ్ని.. తీసుకొచ్చి వీడే నా మొగుడు అని

 

 

గుమ్మం ముందు నిలబడుతుంది చూడు….

అంటే ఆ మాటకి అక్కడున్న వాళ్లంతా 

ఒకేసారి గొళ్ళున నవ్వుతారు పెళ్లి కూతురు తో సహా 

 

 

సుశీల కూడా వాళ్ళ తో పాటు నవ్వుతుంటే.

ఎదురుగా ఉన్న అమ్మాయి విసురుగా జడ ను

వెనక్కి వేసి మూతిని ముద్దు గా ముడిచి తన 

పెద్ద పెద్ద కళ్ళ ని మరి కాస్త పెద్దవి చేసి…..

 

గబగబా నడుచుకుంటూ వస్తుంది వాళ్ళ దగ్గరికి 

వాళ్ల దగ్గరకొచ్చి నిలబడి . కోపంగా పెట్టాను అనుకుని ముద్దుగా ముడిచిన మొహం తో 

 

హహహ . అయిపోయాయ మీ నవ్వులు….

నా మొహం లో ఏమైనా కోతులాడుతున్నాయా? ఎందుకలా నవ్వుతున్నారు…. 

 

ఏం లక్ష్మత్త నన్ను ఇంటికి ఎక్కడ.తెచ్చుకోవాల్సి వస్తుందని… చిన్నపిల్లనని.కూడా చూడకుండా  నన్ను అన్ని మాటలంటావా…. రేపటి నుంచి మీ ఇంటికి కాఫీ తాగడానికి రాను చూడు. అని వేలు చూపెట్టి బెదిరిస్తుంది……

 

నువ్వు కావాలనే ఇలా అన్నావు కదూ. నేను ఎక్కడ నీ కొడుకుని తన్నుకు పోతానో అని భయం నీకు 

 

మీరందరూ.. నా మీద చూపించే ప్రేమంతా అబద్ధమే కదా…. తెలుసు నాకు.  చూసుకోండి రేపటి నుంచి మీ అందరి ఇంట్లో చేసే బజ్జీలు పచ్చళ్ళు మీ చెట్టు జామకాయలు.. ఏవి ఏవి అవసరం లేదు నాకు 

 

అని మూతి తిప్పుతూ చేతులు కట్టుకుని అటు తిరిగి నిల్చుంటుంది……

 

 

పసిపిల్లలాంటి. స్వచ్ఛమైన మనసు. అందర్నీ తనవాళ్లు అనుకునే తన కల్మషం లేని.మనసు ఎప్పుడు అందరిల్లల్లో  ఒక మనిషిలా కలిసిపోయె తన స్వభావం అంటే చాలా ఇష్టం అక్కడున్న వాళ్ళకి……. 

 

 

 

తను అలా మీ ఇంటికి రాను మీతో మాట్లాడను. అంటుంటే వాళ్ళ అన్నది సరదాకయినా. వాళ్ల మాటలతో తనని బాధ … పెట్టినందుకు. అక్కడున్న వాళ్ళందరి. మనసు చివుక్కుమంది…..

 

 

 

పెళ్లి కూతురికి చేస్తున్న ముస్తాబున పక్కకు వదిలేసి 

అందరూ అమ్మాయి చుట్టూ చేరిపోయి గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతున్నారు……..

 

 

ఏంటి కోపం వచ్చిందా మా బంగారు తల్లికి.. అలిగిందా మామీద మాట్లాడదా. అయితే ఇక మాతో 

మా బంగారం మాతో మాట్లాడకుండా ఉండగలదా .

అయితే… అంటారు….. 

 

కూతురంటే.ఎనలేని అభిమానం.వున్న వాళ్ళ ని.

వాళ్లతో అంతే ప్రేమగా మసులుకొనే . కూతుర్ని.

మురిపెంగా చూస్తున్నారు సుశీల గారు..

తన చిట్టి చెల్లి అలక చూసి నవ్వుతూ నించుంది.నవ్య…..

 

 

దానికి ఆ అమ్మాయి ఎందుకు ఉండలేను కచ్చితంగా ఉంటాను. ఇప్పుడేగా అన్నారు.. నేను గయ్యాలి దాన్నని… మంచిదాన్ని కాదని. ఇంకెలా మాట్లాడుతాను..మీతో.. ఇక మాట్లాడను మీతో 

 

 

అంటుంది బుంగమూతి తో…

 

తను వాళ్ళని ఆట పట్టించడానికి అన్నా 

ఆ మాటను కూడా తట్టుకోలేకున్నారు వాళ్ళు 

ఆ..అమ్మయి.అలా అనగానే అందరి కళ్ళల్లో చిరుతడి………..

 

 

అంతగా వాళ్ళ మనసులకి దగ్గర అయింది తను 

ఎప్పుడు అత్త పిన్ని అమ్మమ్మ అక్క అంటూ ఇంట్లో వాళ్ళలో ఒక మనిషిలా తిరుగుతూ ఉంటుంది…

 

 

ఒక్కొక్కసారి చిన్న పిల్లల. ఒక్కొక్కసారి పెద్దదానిలా 

వాళ్లకేదైనా కష్టమొస్తే. ఎలాంటి సాయం అయినా చేసే. వాళ్ళింట్లో ఒక కూతురుగా ఒక కోడలుగా ఒక చెల్లెలుగా. ప్రత్యేకమైన స్థానం తనది..

 

తను . చూపించే అల్లరిని..అలకలని.. ఇష్టంగా భరిస్తారు వాళ్ళందరూ… వాళ్లందరికీ.అంతిష్ఠం.తనంటే

 

తనలా అనగానే మౌనంగా మారిపోయిన 

వాళ్ల నీ.చూసి… ఆ అమ్మాయి తల.మీద.

చిన్న గా మొట్ఠి……. ఏంటా.మాటలు

 

తెలిసి తెలియకుండా నోటి కి ఏదొస్తే అది అనేయడమే……..

 

రాను రాను మొండి దానిలా తయారవుతున్నావ్ నువ్వు.అని తిడుతుంది వాళ్ళమ్మ…

 

ఆ అమ్మాయ్.అబ్బ అని  తలమీద రుద్దుకుంటూ 

ఎందుకమ్మా కొట్టావ్ అని.వాళ్ళ వైపు తిరిగే

సరికి…. అప్పటి వరకు నవ్వుతూ!!తుళ్ళతూ వున్న వాళ్ళ 

 

మొహాలు.. వెలవెల పోవడం తో .. దానికి  

తను అన్న ఆ చిన్న మాటే కారణం అని తెలిసీ…

బాధగా అనిపించింది తనకి….

 

 

నేనన్న అంత చిన్న మాట వీళ్ళ ని ఇంత బాధపెట్టింద

అని అనుకోగానే.. తనపై వాళ్ళ కున్న ప్రేమ కి..

 

కళ్ళు చెమ్మగిల్లాయి తనకి… వెంటనే అమ్మా అని అంటూ కింద కూర్చుండి పోయింది తను……

 

అంతే అక్కడున్నవాళ్ళందరూ.. అమ్మా …మధుర

అంటూ ఒక్క పెట్టున అక్కడ కి చేరిపోయి..

ఏమైంది తల్లి .ఎందుకలా అరిచావ్..

 

ఏం జరిగింది.. బంగారం.వొంట్లోబాలేద..

హాస్పిటల్ కు వెళ్దామ చెప్పమ్మా.

 

 

అని కంగారు పడి పోతూ.సుశీల పిల్లకి ఏమైందో

చూడకుండా అలా.. రాయి లా నిలబడ్డావేంటి

ఎంతల అల్లాడి పోతుంది చూడు.

 

తొందరగా హాస్పిటల్ కి తీసుకెళ్లాలి రా అంటూ 

కంగారు.పడి పోతుంటే..

 

సుశీల.నవ్య.బళ్ళున గట్ఠిగా నవ్వుతారు….

 

 

నవ్వుతున్న వాళ్ళని విచిత్రంగా చూస్తుంటే…

 

 

దాని మొహం అది మిమ్మల్ని తెలివిగా బోల్తా కొట్టించింది… దానికి ఏం అవ్వలేదు.

 

దానివన్నీ వొట్టి నాటకాలు.దానిగురించి తెలిసి 

కూడా మీరెలా నమ్మారు.దాన్ని.అంటారు.

 

మధుర.అమ్మ అక్క….

 

°°°°°°°°°°°°°°°°°°°°

TO Be continued 💗