అనన్య చేతిలో ఫోన్ అలాగే ఉండిపోయింది.
తెలియని నంబర్ నుంచి వచ్చిన మెసేజ్‌ని మళ్లీ మళ్లీ చదువుతోంది.
Unknown: మీరు ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నించకండి. అది మీకు మంచిది కాదు.
“ఎవరు అయి ఉంటారు?” అని మనసులో అనుకుంది.
వెంటనే సూర్యకి మెసేజ్ చేసింది.
Ananya: సూర్య, మన ప్రాజెక్ట్ గురించి ఎవరికైనా బయట తెలిసే అవకాశం ఉందా?
Surya: ఎందుకలా అడుగుతున్నావు?
Ananya: నాకు ఒక తెలియని నంబర్ నుంచి హెచ్చరిక మెసేజ్ వచ్చింది.
కొన్ని క్షణాల తర్వాత సూర్య నుంచి కాల్ వచ్చింది.
“అనన్యా, నువ్వు ఆ మెసేజ్‌ని డిలీట్ చేయకు. రేపు ఆఫీస్‌కి వచ్చాక అర్జున్ సర్‌కి చూపిద్దాం.”
“సరే సూర్య.”