New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా మనసుని తాకే 💘 స్వరమా – 2

నా మనసుని తాకే 💘 స్వరమా – 2

 

నా మనసుని తాకే 💘 స్వరమా 

 

 

దానివన్నీ. వట్టి నాటకాలు దాని గురించి తెలిసి కూడా.మీరెలా నమ్మారు దాన్ని………

 

అక్కడ ఉన్న వాళ్ళందరూ మధుర ని ఆశ్చర్యంగా చూస్తున్నారు.. ఇదంతా అబద్ధమా అని. 

 

మధుర చిన్న చిరునవ్వుతో చెవులు పట్టుకుంటూ పైకి లేస్తుంది…

 

వాళ్ళందరూ మధుర కి ఏం కాలేదని లోపల సంతోషంగా ఉన్న బయటికి మాత్రం కోపం నటిస్తున్నారు……

 

మధుర వాళ్ళ ముందుకొచ్చి. సారీ అందరికీ వెరీ సారీ ప్లీజ్ ప్లీజ్ నాతో మాట్లాడరా…

 

మిమ్మల్ని అందరినీ… నవ్వించాలని ఇలా చేశాను.

అందరూ మధుర వైపు చూస్తున్నారు. మరి మీ కళ్ళల్లో నీళ్లు నేను చూడలేను కదా అందుకనే మిమ్మల్ని బాధ పెట్టాను కదా. క్షమిస్తారానన్ను

 

మధుర ఏంటా.పిచ్చి మాటలు.. ఇంత చిన్న విషయానికి ..అంత పెద్ద మాట. అవసరమా. 

 

మధుర అందర్నీ హత్తుకొని.. నిజంగా. మిమ్మల్ని 

బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు ..

 

నేను అలా మాట్లాడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం అనుకున్నాను. అంతేకానీ నేను మీ మనసుల్ని బాధ పెట్టాలని కాదు……

 

అందరూ మధురని  పట్టుకుని. ఛఛ. మా మధుర బంగారం. ఎలాంటిదో మాకు తెలియదా..

 

నువ్వు మమ్మల్ని క్షమించమనటం ఏంటి తల్లి

మా మధుర ఏం చేసినా మాకు  ఇష్టమే..

 

 

మా మధుర అల్లరి పిల్లే కానీ ఎవరి మనసుని నొప్పించే రకం కాదని . మా కన్నా బాగా ఎవరికి తెలుసు బంగారం …………….

 

 

అని మధుర ని అందరూ హత్తుకొని.. సరే సరే 

లే బంగారం చూడు ఓణీ అది 

 

ఎలా చుట్టేసుకున్నావొ వెళ్లి రెడీ అవ్వు ఆ జుట్టు అది చూడు చెదిరిపోయింది.. నువ్వెలా ఉన్నా పుత్తడి బొమ్మలానే.ఉంటావనుకో..

 

 

అక్క పెళ్లిలో అందరికన్నా ఇంకా అందంగా కనబడాలి నువ్వు. వెల్లు వెల్లు టైం అయిపోతుంది కదా

 

అని మధుర ని తొందర పెడతారు వాళ్ళందరూ. 

 

ఏవమ్మా సుశీల ఎంతసేపు నీ పెద్ద కూతురి ముస్తాబేనా . మా మధురమ్మని కూడా. కాస్త పట్టించుకో…

 

హా అలా చెప్పండి చూడండి నాకు ఎలాంటి డ్రెస్ తీశారో నేను చక్కగా చీర కట్టుకుంటాను అంటే 

 

వద్దని ఏదో మోడల్ లంగా వోని అంట ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అంట.. తీసుకొచ్చి నా మొహాన కొట్టారు

 

అరే నాకు అది వద్దంటే ఎవరు వినిపించుకుంటే గా 

ఇప్పుడు ఇది ఎలా కట్టుకోవాలో సరిగ్గా రావడం లేదు నాకు…..

 

ఆహా బాగానే ఉంది విడ్డూరం ఇది చెప్పడం మీరు వినడం సరిపోయారు…

 

పెళ్లి కావాల్సిన పిల్లను  మానేసి దీన్ని ముస్తాబు చేస్తూ కూర్చోవాలనేను…..

 

చిన్నపిల్లవి నీకెందుకే చీరలవి అని అది తీస్తే.. ఎలా మాట్లాడుతుందో చూసారా….

 

రాకాసి … 

 

చూశారా దానికి ఏమో బోలెడన్ని డబ్బులు పెట్టి కొత్త చీర కొన్నారు.. ఎంత బరువుగా ఉందో. 

 

నాకు మాత్రం నీకెందుకు చిన్న పిల్లవి అని చిన్న ఓనితో సరిపెట్టేసారు..

 

ఏవొమ్మా సుశీలమ్మ నేనేం చిన్నపిల్లను కాదు……

 

 

ఇది మోసం కాదా అడుగత్తా ఊరికే ఉంటావేం..

 

పిన్ని నువ్వు కూడా ఇది మోసమా కాదా .. చెప్పండి 

 

 

అవును తల్లి నిజమే కానీ ఏం పర్వాలేదు. నీ పెళ్ళికి ఇంతకన్నా బరువైనది. ధర ఎక్కువైనా చీరనే తీసుకుందువు గాని….

 

 

అప్పుడు చెబుదాం వాళ్ల సంగతి . ఇప్పటికైతే సరిపెట్టుకో బంగారం…సరేనా……

 

సరే మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను..

 

హా సుశీల గుర్తుపెట్టుకో నా పెళ్ళికి ఇంతకంటే వెయ్యిరెట్లు ఖరీదైనది బరువైనది తీసుకుంటాను ఏమనుకున్నావో…..

 

 

ఏవే.. నా కడుపున పుట్టి నన్నే పేరు పెట్టి పిలుస్తావా రాను రాను అల్లరి ఎక్కువైందే నీకు..

 

మరి నీకు ఎలాగో మా నాన్న అంటే భయం లేదు నేనైనా భయపెట్టకపోతే ఎలా..???

 

వాళ్ళిద్దరీ వాదనని అందరూ నవ్వుతూ చూస్తున్నారు 

 

 

గుమ్మం దగ్గర కూడా నవ్వులు వినిపించేసరికి అటువైపుగా చూసారందరు……………….

 

 

 

మొదటినుంచి మధుర చేసే అల్లరిని తన మాటలను తన అల్లరి గొడవల్ని చూస్తూనే ఉన్నారు 

 

పెళ్ళికొడుకు అమ్మగారు కొందరు బంధువులు

 

సుశీల గారు ముందుకు వెళుతూ వదిన గారు ఎంత సేపు అయింది వచ్చి. బయటనే నిలబడి పోయారు రండి లోపలికి అని తీసుకొచ్చారు వాళ్ళని 

 

 

ఆవిడ వెనకాల వచ్చినా బంధువులందరూ 

 

మేము వచ్చి చాలాసేపే అయింది అమ్మ 

 

నీ చిన్న కూతురు మాటల్ని అల్లరిని చూస్తూ ఉండిపోయాం. అంటారు ….

 

పెళ్లి కొడుకు అమ్మ గారు.మధుర ముందుకొచ్చి

 

చెంప పైన చెయ్యి వేసి..తన మొహం వైపు.చూస్తున్నారు……

 

ఎంత చలాకి అయిన.పిల్ల..ఇంత మంది మనసుల్ని గెల్చుకుందంటే తిన మనసు ఎంత మంచిది నా కన్నాకి ఈ అమ్మాయి అయితే చక్కగా ఇమిడిపోతుంది 

 

అని చిన్న చిరునవ్వుతో చూస్తున్నారు మధురని 

 

ఏంటత్తయ్య  ఏమైంది అని ఆవిడనే చిరునవ్వుతో  అడుగుతుంది  మధుర

 

ఆవిడ మనసులో తన ఇంటికి తెచ్చుకోవాలి అనుకుందో లేదో 

 

మధుర అత్తయ్య అనేసరికి ఎక్కడో ఆశ చిగురించిందావిడకి 

 

పెళ్లికూతురు కోసమని రెండు చీరలు తెచ్చారు అందులో గ్రీన్ కలర్ బ్లౌజ్ కి అదే కలర్ అంచుతో ఉన్న యల్లో కలర్ సారీ 

 

మధుర చేతిలో పెడుతూ దీన్ని కట్టుకో తల్లి నీకు చాలా బాగుంటుంది అనంటే 

 

వెంటనే సుశీల గారు మధుర ఆహా పర్వాలేదు వదిన గారు వద్దత్తయ్య నేను రెడీ అయిపోయాను గా అయినా అవి అక్క కోసం తెచ్చారుగా ఇప్పుడు వద్దు అంటుంది మధుర 

 

మధుర వద్దు అనేసరికి ఆవిడ మొహం చిన్నబోయింది అది గమనించిన మధుర అది కాదత్తయ్య. అలా పెళ్లికూతురు కోసం మీ సాంప్రదాయలా ప్రకారం తీసుకున్న శారీలు కదా నేను కట్టుకోకూడదు ఏమో అని అలా అన్నాను అంతే తప్పుగా అనుకోవద్దు అంటుంది మధుర

 

మధుర అలా అనగానే ఆవిడ లేదు తల్లి ఇవి మామూలుగా తీసుకున్న చీరలే నా పెద్ద కోడలికి 

ఈ చీరలకి ఏం సంబంధం లేదు. ఇప్పుడైనా కట్టుకుంటావా అని అంటుంది 

 

మధుర సుశీల గారి వైపు వాళ్ళ అక్క వైపు చూసి వాళ్ళు తీసుకోమన్నట్టు కళ్ళు ఆర్పడంతో సరేనని తీసుకుంటుంది

 

ఆహహా నిన్ను నేనే స్వయంగా తయారు చేస్తాను అని అంటారావిడ  ఎందుకు వదినగారు మీకు శ్రమ అది రెడీ అవుతుంది లేండి దానికి అలవాటే చీరలు కట్టుకోవడం వచ్చుదానికి అంటుంది సుశీల 

 

హుమ్మ్  ఏం నేను కట్టకూడదా సుశీల 

 

సుశీల ఏదో అనుబోతె అక్కడున్న వాళ్లు మీరెందుకు కట్టకూడదమ్మా ఎంతైనా మధురమ్మ కూడా మీకు  కోడలు వరసేగా నిరభ్యంతరంగా కట్టొచ్చు అంటుంది అందులో మధుర కి పిన్ని వరసయ్యే ఆవిడ 

 

ఆవిడ ఉత్సాహంగా మధుర చేతిలో చీర అందుకుని మధురను తనతో పాటు తీసుకెళ్లిపోతుంది 

 

మధుర మొహమాటం కొద్ది ఆవిడని వద్దు అనలేక వాళ్ళ అమ్మ అక్కలు వైపు చూస్తూ లోపలికి వెళ్తుంది

 

సుశీల గారు అదేంటి నవ్య మీ అత్తయ్య గారు అంత పెద్దింటి ఆవిడయ్యుండి మధురకి చీర కట్టడం ఏంటి 

ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో అబ్బాయి వాళ్ళ నాన్నమ్మ అందరూ ఈ విషయం తెలిస్తే ఏమంటారో 

 

అంతలా ముచ్చట పడుతున్న ఆవిడని వద్దు అంటే ఏమనుకుంటారో అని ఆపలేకపోయాను సమస్య ఏమి రాదు కదా అంటారు కొంచెం భయంగా 

 

అబ్బా అమ్మ ఎవరు ఏమీ అనుకోరు ఆవిడ మధుర మాటలకి మధురని ఇష్టపడినట్టున్నారు అందుకే అంతలా ఆవిడే తయారు చేస్తానని పట్టుపట్టారు

 

అందులో తప్పేంటి చెప్పు ఎవరైనా ఏమైనా అంటే అప్పుడు చూద్దాంలే అంటుంది నవ్య 

 

అక్కడున్న వాళ్లు హా హా మరి మా మధురమ్మ అంటే 

ఏమనుకున్నావ్ సుశీల ఎవరైనా సరే  ఇష్టపడాల్సిందే అని నవ్వుతూ సరే సరే పెళ్ళికూతుర్ని తీసుకురమ్మని చాలా సమయం అయ్యింది  అంటారు అందరు 

 

ఈలోపు మధుర ని రెడీ చేసి  తృప్తి గా చూసుకుంటారు రూప దేవి గారు  పసుపు ఆకుపచ్చ కలిసి ఉన్న ఆ చీరలో ఆభరనాలు ఏం లేక పోయిన కొత్త పెళ్లి కూతురిలా ముద్దు గా ఉంది మధుర  నిజంగా నా కొడుకు ఒప్పుకుంటే నిన్ను నా ఇంటి కోడలిని చేసుకోవాలని ఉంది తల్లి 

 

కాని వాడు పెళ్లంటే నే మండిపడుతున్నాడు ఆ దేవుడు చల్లగా చూసి వాడు ఒప్పుకుంటే వాడికి తగిన సీతమ్మ వి నువ్వేతల్లి అసలు సంతోషమేలేని వాడి జీవితంలో నీ రాక హరివిల్లు లా రంగులు పూయించాలి ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని వేడుకుంటున్నాను 

 

ఆంటీ ఆంటీ ఏం ఆలోచిస్తున్నారు మనల్ని రమ్మంటున్నారు వెళ్దామా 

 

రూప గారు తేరుకుని హుమ్మ్ అత్తయ్య అనే పిలువు తల్లి అంటారు 

 

కొన్ని క్షణాలు ఆవిడవైపే చూసి సరే అంటుంది మధుర 

 

ముందుకు కదులుతున్న మధుర చేయి పట్టుకుని ఆపి ఆవిడ మెడలో గోల్డ్ చైన్ తీసి మధుర మెడలో వేస్తారు మధుర ఆవిడ వైపు అయోమయంగా చూస్తూ ఇది నాకెందుకు అత్తయ్య అంటుంది వేసిన చైన్ తిసేయ్యబోతు

 

వద్దు తల్లి నీకా చైను ముచ్చటగా ఉంది అలాగే ఉండనీ 

 

వద్దత్తయ్య మీరు ప్రేమ గానే ఇచ్చినా చూసిన వాళ్ళు అలా అనుకోరు అందుకే నేనిలాగే ఉంటాను ఇలాంటి వన్నీ వేసుకుని ఆడంబరం గా తిరగాలనీ నేనెప్పుడు 

ఆశ పడలేదు పడను కూడ 

 

ఉన్నదానితోనే తృప్తి పడటం సర్దుకుపోవటమే ఇష్టం నాకు 

 

మీరు ప్రేమతో ఇచ్చిన ఈ చీర చాలు నాకు ఇదే చాలా ఎక్కువ ఇలా అన్నందుకు మీరేం బాధపడొద్దు అని సున్నితంగా ఆ చైన్ తీసి ఆవిడ మెడలో వేసేస్తుందావిడ 

 

ఆవిడ మనసులో మరో మెట్టెక్కేసింది మధుర రూపం లోనే కాదు గుణం లో కూడా మేలిమి బంగారం తల్లి నువ్వు అంటుంది 

 

మధుర బదులుగా చిన్న నవ్వు తో  వెళ్దాం రండి అంటుంది   అలా

 

ఇద్దరూ బయటకొచ్చాక

 

మధుర ని ముచ్చటగా చూస్తున్నారు అందరూ సుశీల గారు మెటికలు విరిచి ఎంత ముద్దుగా ఉన్నావే మధు అంటారు 

 

నవ్య తన చెల్లిని అంత అందంగా తయారు చేసిన వాళ్ళత్తయ్యనీ నవ్వుతూ చూసి చాలాబాగా రెడీ చేసారత్తయ్య అంటుంది 

 

రూప గారు నాదేం ఉంది నవ్య మధుర ముందే పుత్తడి బొమ్మ ఆ బొమ్మకి కొంచెం మెరుగులద్దాను అంతే 

 

మరో సారి పంతులు గారి పిలుపు అమ్మాయి ని త్వరగా తీసుకుని రండమ్మా అని

 

 

నవ్య ని రూప గారు సుశీల గారు మిగిలిన వాళ్ళు మండపం దగ్గర కి తీసుకువెళ్తుంటే మధుర 

 

అమ్మా మీరు వెళ్తుండండీ వస్తాను అంటుంది 

 

సుశీల గారు ఎక్కడికీ అని నోరు తెరిచే లోపలే

 

నువ్వు కూడా మాతో పాటే రామ్మ ఇక్కడేం చేస్తావ్ 

కంగారుగా అంటారు రూపం గారు 

 

అందరీ మొహం లో ఆశ్చర్యం ఈవిడేంటి 

 

మధుర ని ఓ క్షణం కూడా వదలడం లేదు అని

 

అవేవి ఆవిడకి అవసరం లేదు కేవలం మధుర ని వదిలిపెట్టాలనుకోవటం లేదు వదిలేస్తే ఎక్కడ చేజారిపోతుందేమో అన్నట్టు తనని ఆవిడ తోనే ఉంచుకోవాలని ఆరాటపడుతున్నారు

 

ఆవిడ ఇంక బలంగా నిశ్చయించుకున్నారు మధురనే 

వాళ్ల చిన్నోడికి కాబోయే భార్య ని

 

నవ్య సుశీల గారికి వింత గా ఉంది ఆవిడ ప్రవర్తన 

 

 

°′°°°°°°°°°°°°°°°°°°°°°

 

టు బి కంటిన్యూ 💖