New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నీ కోసం – 1
నీ కోసం 3 min read

నీ కోసం – 1

ఉదయం 5:30 గంటలు…

 

ఆ ఇంట్లో సూర్యుడు ఉదయించకముందే అరుపులు మొదలయ్యాయి.

 

“వివిధా..! ఇంకా లేవలేదా? ఇంట్లో పనులన్నీ నేనే చేయాలా?”

 

ఆ గట్టిపిలుపు వినగానే వివిధ ఒక్కసారిగా కళ్లు తెరిచింది.

గడియారం వైపు చూసింది.

ఇంకా అయిదున్నరే అయ్యింది.

అయినా తన తల్లి రమ్యకు అది ఆలస్యంగానే అనిపించింది.

 

“వస్తున్నా అమ్మ…” అని చెప్పి మంచం మీద నుంచి దిగింది.

చిన్న గదిలో ఉన్న అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని చూసుకుంది.

ఇరవై మూడు సంవత్సరాల వయసు.

అందం ఉంది.

అమాయకత్వం ఉంది.

 

 

కానీ ఆమె కళ్లలో మాత్రం ఎప్పుడూ కనిపించేది ఒక బాధ.

చిన్నప్పటి నుంచి ప్రేమ కోసం ఎదురుచూసిన బాధ.

 

 

తండ్రి చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఆమెకు తల్లి ఉన్నా… తల్లిప్రేమ మాత్రం లేదు.

 

వివిధ వంటగదిలోకి వెళ్లి పనులు మొదలుపెట్టింది.

 

 

టీ తయారు చేసింది.

ఇల్లు ఊడ్చింది.

బట్టలు ఉతికింది.

అన్నీ పూర్తయ్యేసరికి ఉదయం ఎనిమిది గంటలు అయ్యింది.

 

 

రమ్య మాత్రం ఇవి ఏమీ పట్టకుండా చక్కగా సోఫాలో కూర్చుని ఫోన్ మాట్లాడుతోంది.

 

 

“అవును పంతులు గారు… మా అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. మీరు ఒకసారి వచ్చి చూడండి…”

 

 

ఆ మాటలు విని వివిధ అడుగులు ఆగిపోయాయి.

“అమ్మ… ఎవరితో మాట్లాడుతున్నావు?”నా గురించి ఎందుకు…

 

 

రమ్య ఫోన్ కట్ చేసి కోపంగా చూసింది.

“నీకెందుకు?”అంటే నా మాటలు దొంగ చాటుగా వింటున్నావా నువ్వు…

 

 

“అలా కాదు అమ్మ… నేను ఎందుకు అలా చేస్తాను..ఎవరు వస్తున్నారు అని…”

 

 

“చాలా ప్రశ్నలు వేసావ్వ్… ఇంక ఎక్కువ మాట్లాడకు… ముందు నేను చెప్పినట్టు చేస్తే చాలు.”

 

 

ఆ మాటలతో వివిధ మౌనంగా ఏమీ మాట్లాడకుండా తలదించుకుంది.

 

 

కొద్దిసేపటి తర్వాత…

 

వివిధ తన ఫైల్ తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది.

ఈరోజు ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది.

 

 

ఈ ఉద్యోగం తనకు చాలా అవసరం.

తన కాళ్ల మీద తాను నిలబడాలని చాలా రోజుల నుంచి కల.

 

 

బస్ స్టాప్ వైపు నడుస్తూ వెళ్తోంది.

అప్పుడే ఆమె ఫోన్ మోగింది.

అది తన బెస్ట్ ఫ్రెండ్ నేహా.

“హలో…”

“వివిధ… ఇంటర్వ్యూకి బయలుదేరావా?”

 

 

“అవును.”

 

 

“టెన్షన్ పడకు. నీకే జాబ్ వస్తుంది.”

 

 

వివిధ ఆ మాటకి చిన్నగా నవ్వింది.

“చూద్దాం.”

 

 

ఆమె అలా ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటడం మొదలుపెట్టింది.

 

 

అయితే…ఇంతలో 

ఆమెకు తెలియకుండా ఒక కారు వేగంగా దూసుకొస్తోంది.

 

 

అది చూసి చుట్టుపక్కల వాళ్లు అరిచారు.

“అమ్మాయి..! జాగ్రత్త..!”

వివిధ ఒక్కసారిగా తల తిప్పింది.

 

 

కారు చాలా దగ్గరకు వచ్చేసింది.

భయంతో అక్కడే నిలబడిపోయింది.

 

 

అప్పుడే…

ఎవరో ఒకరు ఆమె చేతిని బలంగా పట్టుకుని తమవైపు లాగారు.

ఆ కారు వేగంగా వాళ్ల పక్కనుంచి వెళ్లిపోయింది.

 

 

ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే ప్రమాదం జరిగిపోయేది.

భయంతో కళ్లు మూసుకున్న వివిధ కొద్దిసేపటి తర్వాత మెల్లగా కళ్లు తెరిచింది.

తన ఎదుట ఒక యువకుడు నిలబడి ఉన్నాడు.

 

 

సాధారణ దుస్తులు.

నీలిరంగు షర్ట్.

చేతికి పాత వాచ్.

ముఖంపై ప్రశాంతమైన చిరునవ్వు.

 

 

మీరు బాగున్నారా?అని అడిగాడు.ఏదయినా తగిలిందా..

 

 

వివిధ ఇంకా షాక్‌లోనే ఉంది.

“అ… అవును.”బాగున్నా..

 

 

“రోడ్డు దాటేటప్పుడు ఫోన్ మాట్లాడకండి.”చాలా ప్రమాదం..

 

 

అని అంటున్నా అతని స్వరంలో కోపం లేదు.

చిన్నపాటి శ్రద్ధ మాత్రమే ఉంది.

 

 

“థ్యాంక్యూ…” అంది వివిధ.సమయానికి వచ్చారు..

 

“పర్లేదు.”

అని చెప్పి అతడు వెళ్లిపోవడం మొదలుపెట్టాడు.

 

 

ఎందుకో…

వివిధ అతడిని అలా వెళ్లిపోనివ్వాలనిపించలేదు.

 

“ఒక్క నిమిషం…”

 

అతడు వెనక్కి తిరిగాడు.

 

“మీ పేరు?”

అని అడిగింది.

 

 

అతడు క్షణం పాటు ఆమెను చూసి చిరునవ్వు నవ్వాడు.

“సాకేత్.”

 

 

“నా పేరు వివిధ.”

 

“సంతోషం.”

 

అంతే.

మళ్లీ తిరిగి నడవడం మొదలుపెట్టాడు.

 

 

వెళుతున్న అతని వైపు వివిధ ఆశ్చర్యంగా చూసింది.

 

 

ఇప్పటి వరకు తనను కలిసిన అబ్బాయిలు అయితే మాట్లాడటానికి ప్రయత్నించేవారు.

కానీ ఈ వ్యక్తి మాత్రం…

పేరు చెప్పి వెళ్లిపోయాడు.అని అనుకుంటూ ఆమె అక్కడ నుండి వెళ్ళిపోయింది.

 

 

అదే సమయంలో…

 

సాకేత్ బస్ స్టాప్ దగ్గరకు చేరుకున్నాడు.

అక్కడ ఉన్న బెంచ్‌పై కూర్చున్నాడు.

అతని ముఖంలో చిన్న నవ్వు కనిపించింది.

“వివిధ…”

అని మెల్లగా తనలో తాను అనుకున్నాడు.

 

 

ఆమె పేరు తనకు మొదటిసారి వినిపించినా…

ఎందుకో ఆ పేరు తన మనసులో ముద్రపడిపోయింది.

అది కేవలం ఒక అనుకోని పరిచయం మాత్రమే అని అతనికి అనిపించింది.

 

 

కానీ…

విధి మాత్రం మరో కథ రాస్తోంది.

ఆ ఇద్దరికీ తెలియకుండా…

వారి జీవితాలు నెమ్మదిగా ఒకే దారిలో నడవబోతున్నాయి.

 

తర్వాత భాగంలో….

ఇంటర్వ్యూలో ఎదురైన ఆశ్చర్యం

వివిధ ఇంటర్వ్యూకి వెళ్లిన తర్వాత అక్కడ ఊహించని విధంగా మళ్లీ సాకేత్ కనిపిస్తాడు. కానీ అతను అక్కడ ఎందుకు ఉన్నాడు? ఇద్దరి మధ్య రెండో పరిచయం ఎలా జరుగుతుంది? అది తదుపరి భాగంలో…!

 

 

చూద్దాం తర్వాత భాగంలో ఏమి జరుగుతుంది…

 

Mk…