స్నేహ కి ఆర్యన్ మీద చాలా కోపం వస్తుంది…. ఇన్ని రోజులు చాలా పీస్ ఫుల్ గా ఉంది ఆర్యన్ ని చూడకుండా… బట్…. మళ్ళీ ఈ రోజు మళ్ళీ కలవలసి వస్తుంటే… కోపం తన్నుకోస్తుంది స్నేహ కి.
పోనీ…. వదిలేదామా అంటే….. ఆ ఉచిత మనీ… తనకు అవసరం లేదు… కేవలం.. తన కష్టారజితం మాత్రమే తను ఆశిస్తుంది…. కానీ…. ఇలా కాదు…. అందుకే ఆ మనీ ని తిరిగి ఇచ్చేయాలి అని…. ఆర్యన్ కోసం కోసం…. లిఫ్ట్ లో తన ఫ్లోర్ కి వెళ్ళింది.
లిఫ్ట్ ఓపెన్ కాగానే…. గుండె దడ మొదలయింది స్నేహ కి ఆ ఫ్లోర్ ని చూడగానే….. ఈయన నాతో బాగా ఆడుకుంటున్నాడు….. అసలు ఎం అనుకుంటున్నారు నా గురించి…. నేను మనిషిని అనుకుంటున్నారా… లేక వస్తువు అని ఆహ్ అని కోపంగా అనుకుంటూ…. మెల్లిగా ఆడుహులో అడుగు వేసుకుంటూ…. డోర్ ని నాక్ చేసింది స్నేహ.
ఆ ఫ్లోర్ కి ఎవరికీ ఎంట్రీ లేదు కదా…. బట్ స్నేహ పాపా కి ఎంట్రీ ఉంది… ఎంతైనా భార్య కదా.