ఎపిసోడ్ 100
సూర్యని నులి వెచ్చని కిరణం ముఖం పై పడగానే కళ్ళు తెరిచిన స్వప్నిక ఎదురుగా వాల్ క్లాక్ చూసి ఒక్కసారి ఉలిక్కి పడింది..
హమ్మో పదవుతుంది..ఇంకో గంటలో ఆర్థో డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఉందని గబుక్కున లేవబోయింది..
పైన బరువుగా అంతా నా సొంతం అన్న లెవల్లో ఆమెపై ఓ కాలూ,ఓ చెయ్యి వేసిన విజె బిందాస్ గా నిద్ర బోతూ కనిపంచాడు..
“లేవకు..స్వప్నీ..పడుకో..” అని ఆమెను మరింత దగ్గరికి లాక్కుని పడుకున్నాడు విజె..
కొద్దిసేపు అలాగే పడుకుని విజె గాఢ నిద్రలోకి జారుకున్న తరువాత స్వప్నిక