ఎపిసోడ్ 99
స్వప్నిక విజయ్ ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు ఉండి కళ్ళు మూసుకున్న ఇద్దరి ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే స్వప్నిక ఫోన్ రింగయ్యింది.
ఇద్దరు ఉలిక్కిపడి ఒకరిని ఒకరు చూసుకున్నారు. తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం..
స్వప్నిక వీజె కౌగిలి నుండి విడిపోయి..రింగవుతున్న తన ఫోను దగ్గరికి వచ్చి చూడగా స్క్రీన్ మీద అత్తయ్య అని పేరు కనిపించింది. ఒక్కసారి ఎలర్ట్ అయి ఫోన్ లిఫ్ట్ చేసిన స్వప్నిక..
“హాయ్, అత్తయ్య బాగున్నారా? ఏంటి ఇప్పుడు ఫోన్ చేసారు? అంతా ఓకే కదా?” అని కంగారుగా అడిగింది స్వప్నిక..
“అంతా బాగే.. మా ఇంటికి వచ్చేది ఉందా? లేదా? అక్కడే మీ ఇంట్లోనే ఉండిపోతావా?” అని సీరియస్ గా అడిగింది రవళి..