ఎపిసోడ్ 9 ఆ యాంకర్ నవ్వుతూ.. “ఇప్పుడు మన డైనమిక్ లేడీ, ఎందరో ఆడవాళ్ళకు రోల్ మోడల్ మన మల్లికా మూర్తి మేడం గారిని స్టేజ్ పైకి రావల్సిందిగా కోరుతున్నాను అని ఎనౌన్స్ చేసింది. ఒక్క సారి ఆ హాలంతా చప్పట్లతో నిండిపోయింది. మల్లికా మేడం హుందాగా డయాస్ పైకి వెళ్ళింది. మైక్ పట్టుకున్న మల్లికా మేడం చిన్నగా నవ్వింది. “ఇంత అందంగా ఉన్నావ్, అద్భుతంగా మాట్లాడుతున్నావ్. ఇంకా నేనెందుకమ్మా”అని అడిగింది మల్లికా మేడం. దాని…