New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వే నా ప్రపంచం. – 4

నువ్వే నా ప్రపంచం. – 4

హటాత్తుగా ఊడి పడ్డ ఆ వ్యక్తి వైపు తిరిగారు అందరు. అప్పుడే అతన్ని చూసిన లీడర్, కోపంగా పైకి లేస్తూ “రేయ్ ఎవడు రా నువ్వు?”అని అడిగాడు..

 

 ఒక్కొక్క అడుగు ముందుకు వస్తూ 

 “నేను ఎవరైతే నీకెందుకు అన్న? ముందు ఈమెని వదిలిపెట్టండి.”అని బేస్ వాయిస్తో చెప్పాడు అతను.  

 

 

  ఆ మాటకు లీడర్ చిన్నగా నవ్వి

 “రేయ్ చిన్న..ఇది నీ ఆఫీస్ గొడవ కాదు.. ఇందులో పెద్ద పెద్దవాళ్ళు ఇంవోల్వ్ అయి ఉన్నారు. కాబట్టి పో, పక్కకి పోయి ఆడుకోమ్మ..”అని వెటకారం చేస్తునట్టుగా అన్నాడు.

 

 

దానికి నవ్వుతూ “నాకు ఏదైనా ఒకటే అన్న.. 

 అయినా నువ్వు చెప్పావ్ కాబట్టి పోతా..అలాగే వెళ్ళిపోతా. కానీ వెళ్ళేటప్పుడు ఈమెను కూడా తీసుకొనే పోతా..”అని అన్నాడు అతను.

 

 

   “చెప్తుంటే నీకు కాదా.. మెంటలా నీకు. అడ్డు తప్పుకో” అంటూ, అతన్ని కొట్టడానికి చెయ్యి ఎత్తాడు ఆ లీడర్. 

 

  కానీ వెంటనే స్పందించిన వ్యక్తి ఆ లీడర్ చెయ్యిని గట్టిగా పట్టి వెనక్కి తిప్పి విరిచాడు.

 

 దాంతో ఆ లీడర్ “అమ్మా…”అని గట్టిగా అరిచాడు. అతనికి నొప్పితో పాటు కొంత దూరనా నిలబడిన తన అనుచరులని చూడగానే కోపం తన్నుకి వచ్చింది..

 

  వాళ్ళ వైపు చూసి,”రేయ్ చవటల్లారా ఎం చేస్తున్నారా? ఇక్కడేమైనా సినిమా షూటింగ్ నడుస్తుందా..రండి..చితక బాదండి వీణ్ణి.”అని అరిచాడు లీడర్. 

 

    ఆ మాటలు వినడమే ఆలస్యం అతని మీద విరుచుకుపడ్డారు నలుగురు.. జోరున వర్షపు చినుకులు తల మీద నుండి జారీ కిందపడుతుంటే అతను వాటిని తుడుచుకొని కోపంగా వాళ్ళ వైపు చూసి, తన ఎదురుగా ఉన్న వ్యక్తికి బలంగా ఒకటిచ్చాడు. అంతే వాడు నొప్పితో గిలగిలా కొట్టుకుంటూ అక్కడే కుప్పకూలాడు. అది చూసిన మిగిలిన ముగ్గురు చేతిలో కత్తులు పట్టుకొని అతని మీదకు వచ్చారు.

 

   అతను చాలా తెలివిగా వాళ్ళ అటాక్ నుండి తప్పించుకొని వెనక్కి వెళ్ళాడు.ముందు ఆ ముగ్గురు, వాళ్లకి ఎదురుగా అతను.. భుజాన ఉన్న బ్యాగ్’ని సరిచేసుకొని గంభీరంగా వాళ్ళ వైపు చూసాడు. అతని కన్నుల్లో ఇప్పుడు చిరుతలాంటి ధైర్యం కనిపిస్తుంది. జుట్టు నుండి కారుతున్న వర్షపు నీటిని విదిలించుకోవడానికి తలని కొంచెం అటు, ఇటు అనడంతో అప్పుడే మెరిసిన మెరుపులో అతను మనిషిలా కాదు ఒక సూపర్ హీరోల అనిపించాడు..కత్తులని ముందుకు పోనిస్తూ అతని మీదకు దూసుకుపోయారు ముగ్గురు.. 

 

  అది చూసి కంగారుగా “ఓహ్..కేర్ఫుల్..” అని అలెర్ట్ చేసింది మహిత.

 

      అతను ఏ మాత్రం భయపడకుండా, 

కూల్ గా స్టైల్’గా, తన మీదకు వచ్చిన ఆ ముగ్గురి కథను ముగించాడు. ఇంతలో అందరి కంటే ముందు కిందపడిన వాడు పైకి లేచి, వెనుక నుండి వెళ్ళి, అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే పక్కన ఉన్న వాళ్ళ లీడర్ కిందపడిన కత్తిని పట్టుకొని అతని వైపు పరిగెత్తాడు.

 

  అది చూసిన మహిత “హే..నో…”అంటూ అతని వైపు పరుగెత్తింది.కానీ అప్పటికే ఆ లీడర్ అతన్ని చేరుకుని, పెద్దగా అరుస్తూ చేతిలోని కత్తిని ఆ అబ్బాయి వైపు పోనిచ్చాడు.

 

   నెక్స్ట్ సెకండ్ బాధ కలిసిన ఒక అరుపు అక్కడ మారుమ్రోగింది. ఆ వర్షపు చినుకుల్లో ఆ కేక ప్రతిధ్వనించింది.కానీ ఆ కేక అబ్బాయిది కాదు మహితది..ఆ లీడర్ చేతిలోని కత్తి అతన్ని గుచ్చుకోవడానికి ఒక్క సెకన్ ముందు మహిత వెళ్లి ఆ ఇద్దరి మధ్యలో నిలబడింది.

 దాంతో అతనికి తాకాల్సిన ఆ కత్తి మహిత కడుపులోకి దూసుకుపోయింది. 

 

  వెంటనే మహిత కడుపు నుండి రక్తం బయటకు చిమ్మింది.  

 

  “అమ్మ..”అని మహిత నొప్పితో అరుస్తూ ఆ కత్తిని పట్టుకుంది. ఆమె చేతులు అంతా రక్తంతో ఎర్రబడ్డాయి. 

 

 అది చూసి పిశాచి నవ్వు నవ్వుతూ 

 “నిన్ను తీసుకెళ్దాం అనుకున్నా..కానీ నీ బాడీని తీసుకెళ్తా..”అంటూ ఆ కత్తి బయటకు లాగి రెండోసారి దింపాడు.

 

 ఆమె తనని తాను కాపాడుకోవడానికి ఆ కత్తిని చేతులతో పట్టుకోవడానికి ట్రై చేసింది. కానీ ఆ కత్తి ఆమె చేతులని కూడా చీల్చుకుంటూ ముందుకి వెళ్ళింది. ఈసారి దిగిన ఆ కత్తి పోటుకి ఆమె శరీరం అంతా ఒక్క క్షణం శివర్ అయ్యింది. 

 

  నొప్పి తట్టుకోలేక ఆమె పెట్టిన కేక ఆ వర్షపు చినుకులని చీల్చుకుంటూ ఆకాశ వీధుల్లోకి దూసుకుపోయింది. అది చూసి ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. 

 

  కానీ ఆ లీడర్ మాత్రం దయ్యం నవ్వినట్టుగా “హ్హ..హ్హా..”అని నవ్వుతున్నాడు. 

 

  ఇంతలో షాక్ నుండి తేరుకున్న ఆ వ్యక్తి కోపంతో, వేగంగా వచ్చి ఆ లీడర్ ముఖం మీదా కసితీరా ఒకటిచ్చాడు. అంతే! ఆ క్షణం వాడు గాల్లో బంతిలా గిరిటీలు కొడుతూ వెళ్లి అంత దూరాన ఎగిరి పడ్డాడు..వాడు పడిన ఫోర్స్ కి అక్కడున్న వర్షం నీళ్లు అంత ఎత్తుకు పైకి లేచాయి. 

 

  అయినా కానీ కోపం చల్లారక వాని మీదకు దూకి “దమ్ముంటే ఇప్పుడు రారా..రా బె..లే..” అంటూ వాని ముఖం మీద కూర్చొని పిడి గుద్దులు గుద్దుతున్నాడు.

 

  అతను చేస్తున్న బీభస్తానికి వాని ముఖం అంతా చిట్లి పచ్చడైంది. ఎర్రని రక్తంతో వాని తల, కళ్ళు, ముక్కు, నోరు అంతా తడిసిపోగా ప్రాణ భయంతో “వద్దు..వద్దు..వ… వదిలేయ్..మళ్ళీ..” అంటూ చేతులెత్తి మొక్కాడు. 

 

     ఇంతలో ఆ అబ్బాయి చూపు కొంచం దూరాన నేలపైన పడున్న అమ్మాయి మీదకు మళ్లింది. ఆమె చుట్టూ పక్కల నుండి ప్రవహిస్తున్న వర్షపు నీరు, నీరులా కాకుండా ఎర్రగా రక్తంలా పారుతుంది.. 

 

    ఆమె చూస్తే కేవలం కడుపు నుండే కాదు ఆమె తల దగ్గర నుండి కూడా రక్తం ధారగా పోతున్నట్టుగా అనిపిస్తుంది. కంగారుగా వాని మీద నుండి లేచి పిడికిలి బిగించి, ఉన్న బలాన్ని అంతా ఆ పిడికిలిలోకి తెచ్చుకొని కోపంగా “ఇంకోసారి ఏ అమ్మాయి మీద నీ చూపు పడిందో..చంపేస్తా..”అంటూ మరోటి వడ్డించాడు.

 

   అంతే వాడు ఇక లేచి మాట్లాడలేక ‘హ్…హ్..’అంటూ పెద్దగా శ్వాస తీసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. 

 

   ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా అక్కడి నుండి ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అప్పటికే ఆమె కన్నులు సగం వరకు మూతపడుతూంటే “థాంక్స్..”అని మెల్లగా వణుకుతున్న పెదాలతో ఇంకా ఏదో చెప్పాలని ట్రై చెస్తుంది కానీ ఆ మాటలు బయటకు రాకముందే ఆమె కళ్ళు మూతపడ్డాయి. 

 

బహుశా ఆమె పడిన చోట ఏదో రాయి ఉన్నట్టు ఉంది..దాని వల్ల తలకు దెబ్బ తగిలి, ఆమె తల నుండి కూడా రక్తం కారుతుంది..