జై ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తుంటే అతని ఫోన్ మోగుతుంది.కాల్ లిఫ్ట్ చెయ్యగానే అవతలి వ్యక్తి, కంగారుగా, ఏదో కొంపలు మునిగిపోయిన వాడిలా, ఇంకా చెప్పాలంటే జయ్ కంటే ఎక్కువ టెన్షన్‌గా “రేయ్..హలో..రేయ్ జయ్.. ఎక్కడున్నావ్ రా?”అని అడిగాడు.
“అబ్బా..వీడొక్కడు.”అని మనసులో అనుకుంటూ కొంచం చిరాకుగా, “రేయ్..సత్య.. మెంటల్…వినిపిస్తుంది కానీ నీ ఓవర్ యాక్షన్ ఆపు బే..”అని కొంచం అన్నాడు జై.
“నీకు వినిపిస్తుందని నాకు ఎలా తెలుస్తుంది రా. నువ్వు మాట్లాడితేనే కదా తెలిసేది.”అని జవాబుగా అన్నాడు సత్య.
“నీ ఎదవ ఇంటెలిజెంట్స్ ఆపు.. నీ పిచ్చి మాటలు వినే ఓపిక లేదు కానీ..”అని జై అంటుండగానే సత్య వెటకారంగా అతన్ని మధ్యలోనే ఆపేసి “రేయ్ పిచ్చి నాకు కాదు.. నువ్వు కనపడక మీనా పిచ్చిది అవుతుంది.” అన్నాడు సత్య..