New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వే నా ప్రపంచం. – 5

నువ్వే నా ప్రపంచం. – 5

మహిత కడుపులో కత్తితో అటాక్ చేసాడు రౌడీ. అది చూసిన అబ్బాయి, ఆ రౌడీగాని మక్కిలు ఇరగొట్టాడు. 

 

  ఇంతలో మహిత కండిషన్ సీరియస్ అవ్వడంతో ఫాస్ట్’గా ఆమె కోసం వచ్చాడు. “థాంక్స్..”అని మెల్లగా వణుకుతున్న పెదాలతో ఇంకా ఏదో చెప్పాలని ట్రై చెస్తుంది కానీ ఆ మాటలు బయటకు రాకముందే ఆమె కళ్ళు మూతపడ్డాయి.

 

  ఆమె పడిపోయిన దగ్గర రాయి లాంటిది ఉండటంతో ఆమె తల నుండి రక్తం రావడం స్టార్ట్ ఐయింది.

 

    “నో.. హే, కళ్ళు తెరువు. ఓపెన్ యువర్ అయిస్.కళ్ళు తెరువు.”అని భయంగా మహిత బుగ్గల మీద చేతితో తట్టాడు. 

కానీ మహిత దగ్గర నుండి ఎలాంటి రియాక్షన్ రాలేదు.. అది చూసిన అతని గుండె వేగం పెరిగింది.. 

 

   “ఓహ్..నో.ఇప్పుడు…ఇప్పుడెలా?”అని టెన్షన్’గా అటు, ఇటు చూసాడు కాని అంత వర్షంలో ఇవ్వరు కనిపించడం లేదు..

 

 

 

******

 

 

   ఇది ఇలా ఉండగా, మరో వైపు… 

 సిటీలోని నేత్ర హాస్పిటల్ లో…బయట హోరున వర్షం పడుతుంటే ఆ వర్షపు బిందువులు ధారలుగా కిటికీ అద్దాల మీదుగా జారుతున్నాయి. 

 

 

  “ఏంటో ఈ వర్షం,,ఈ రాత్రంతా ఆగేలా కనిపించడం లేదు..”అంటూ పేషేంట్ గది నుండి బయటకు వచ్చింది నర్స్ జియా. 

 

 

     ఇంతలో ఒక్కసారిగా ఆమె చెవుల్లోకి ‘నర్స్..’ అనే పిలుపు దూసుకుపోయింది. అది పిలుపు అనడం కంటే అరుపు అనడం బెటర్. ఆ అరుపుతో ఉలిక్కిపడి అటు వైపు చూసింది నర్స్ జియా..

 

  అటుగా చూసిన ఆమెకి ఆగిన అంబులెన్సులో నుండి రక్తపు మరకలతో దిగిన ఒక కుర్రాడు కనిపించాడు. అతని ముఖంలో కంగారు కనిపిస్తుంది..అతని చేతులు రక్తంతో తడిసిపోయాయి. 

 

   దాంతో నైట్ డ్యూటీలో ఉన్న, కాంపౌండర్స్ ను పెద్దగా పిలుస్తూ, వేగంగా అటు వైపు పరుగెత్తింది జియా.. రెండు నిమిషాల్లోనే స్ట్రెచర్ రావడంతో, అంబులెన్స్ లో నుండి దెబ్బలు తగిలిన మహితని స్ట్రెచర్ పైకి చేర్చారు.

 

 

 

  నిశ్చలంగా పడున్నా మహిత వైపు బాధగా ఆమె వైపు చూస్తున్నాడు అతను.. 

 

 

  క్షణాల్లో ఆమెను ఎమర్జెన్సీ వార్డుకి షిఫ్ట్ చేశారు. ఆ కుర్రాడు కూడా వాళ్ళ వెనుకే వెళుతూ ఉండటంతో “మీరు ఇక్కడే ఉండండి.”అని చెప్పి, ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్లింది జియా. 

 

 

   అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. బయట హోరున వర్షం కురుస్తుంది.

 ఉరుములు మెరుపులతో వాతావరణం అంతా చాల భయంకరంగా మారింది. అతని షర్ట్ పైన ఏర్పడిన ఎర్రని రక్తపు మరకలు కొన్ని క్షణాల క్రితం జరిగిన ప్రతి సంఘటనని గుర్తు చేస్తున్నాయి..

 

    నాలుగు గంటల క్రితం అతను ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? 

అతను సాయం చెయ్యాలనుకున్నాడు కానీ దాని వల్ల ఇప్పుడు ఒక అమ్మాయి ప్రాణాలకు ముప్పు వచ్చింది.

 

  ఇదంతా గుర్తు చేసుకుంటూ తన భుజాన ఉన్న బ్యాగ్’ని తీసి “హమ్మ.. ఈ అమ్మాయికి ఏమి కాకూడదు దేవుడా.. ప్లీజ్..”అని మనసులోనే ప్రార్థిస్తూ పక్కనే ఉన్న కుర్చీలో పెట్టి తల వెనక్కి వాల్చాడు అతను.. 

 

   హాస్పిటల్లో హడావిడి మొదలైంది. పెద్ద డాక్టర్స్ ఇద్దరు ఆ అమ్మాయి గదిలోకి వెళ్లారు. నర్సులు హడావిడిగా ఒక గది నుండి ఇంకో గదిలోకి పరుగు తీస్తున్నారు..అక్కడే కూర్చోని ఇదంతా చూస్తున్నాడు ఆ అబ్బాయి. లోపల నుండి మిషన్స్ సౌండ్స్ అలాగే డాక్టర్స్ మాటలు అంతంత మాత్రంగా వినిపిస్తున్నాయి. ఇంతలో అతని బ్యాగ్ కొద్దిగా కదులుతున్నట్టుగా అనిపించింది. మొబైల్ వైబ్రేట్ అవుతుందని గమనించి, వెంటనే బ్యాగ్ ఓపెన్ చేసి ఫోన్ తీస్తాడు..వస్తున్న కాల్ లిఫ్ట్ చేసి, “హా చెప్పండి అంకుల్?”అన్నాడు అతను..

 

 

 అటు వైపు నుండి ఒక యాభై సంవత్సరాల వ్యక్తి గొంతు వినిపించింది “బాబు ఎలా ఉన్నావ్?”అని..

 

 

“బాగున్నా..చెప్పండి?”అని సీద విషయానికి వచ్చాడు. 

 

 

   “అదే రేపు ఎనిమిదో తారీఖు..”అని అతను అనడమే ఆలస్యం,అతన్ని మధ్యలోనే ఆపేస్తూ 

“హా. గుర్తుంది అంకుల్…నైట్ లోపు అయిపోతుంది.మీరు టెన్షన్ పడకండి.” అని చెప్పాడు. 

 

  ఇంతసేపు అతని మనసంతా బాధతో, ఆందోళనగా నిండినట్టుగా అనిపించింది. 

కానీ ఇప్పుడు మాత్రం అతని గొంతులో కోపం, ఒక వంతు ఆవేశం కనిపిస్తుంది. అతని గొంతులో వచ్చిన మార్పుని అర్ధం చేసుకున్న అవతలి వ్యక్తి, కొంచెం అతన్ని సముదాయిస్తున్నట్టుగా “అది..నాకు తెలుసు బాబు..మీ మీద నమ్మకం ఉంది.కానీ గుర్తు చెయ్యడం నా బాధ్యత..అంతే.తప్పుగా అనుకోకండి. ఉంటాను.”అన్నాడు అతను.

 

   “నాకర్ధమైంది అంకుల్. ఐ కన్ అండర్’స్టాండ్.. యు డోంట్ వరీ..”అని చెప్పి కాల్ కట్ చేశాడు. 

 

   అప్పుడు తన ఫోన్ స్క్రీన్ పై సెట్ అయ్యి ఉన్న ఫ్యామిలీ ఫోటో పై అతని దృష్టి నిలిచిపోయింది. దాన్ని చూడగానే ఒక్క క్షణం అతని కన్నుల్లో బాధ కనిపించింది. కానీ మరుక్షణం అతని కళ్ళు కోపంతో ఎర్రబడుతుండగా, “నిన్ను వదిలిపెట్టను.. గుర్తుపెట్టుకో..”అని కోపంగా అన్నాడు.

 

  ఇంతలో గదిలో నుండి బయటకు వచ్చింది నర్స్ జియా.. వస్తూనే “హలో..హలో మిస్టర్.” అని పిలవడంతో, అతను ఆలోచనల నుండి బయటకు వస్తూ “హా..హా..చెప్పండి మేడం.?”అన్నాడు అతను. 

 

 చేతిలోని పాడ్ పైన పెన్ పెడుతూ “మీ పేరు?”అని అడిగింది. 

 

  “జై .”అని సమాధానం ఇచ్చాడు అతను. 

 

  “ఆ అమ్మాయి ఎవరు?….” అని అడిగింది నర్స్. ఆ మాటకి ఏం చెప్పాలో అర్ధం కాకా బిత్తిరి చూపులు చూసాడు అతను.