పెళ్లి చూపులు -6
“హా ఏంటి లేకపోతే..!” అని మహాలక్ష్మి చేతిని వదిలి రెండు చేతులు కట్టుకొని సీరియస్గా కూతురు వైపు చూసింది భారతి..
“ఆ లేకపోతే ఏముంది ఏమీ లేదు గ్యాప్ వచ్చింది అంతే నేనేమీ గ్యాప్ ఇవ్వలేదు నువ్వు చెప్పిన మాట వినాలి. తప్పదు కదా లేకపోతే చీపురు విరిగిపోతుంది.
పాపం చీపురు ఎంత బాధ పడుతుందో ఒక సంవత్సరం పాటు ఇళ్లంతా నీట్ గా క్లీన్ చేసేది నీ చేతుల్లో పడి ఒక్క రోజులోనే విరిగిపోతుంది పాపం కదా” అని అమాయకంగా ఫేస్ పెట్టి చీపురు మీద జాలి చూపిస్తూ అన్నది మహాలక్ష్మి…
“అంటే ఏంటి ఇప్పుడు నీ ఉద్దేశం” అని భారతి నడుం మీద రెండు చేతులు పెట్టుకొని “ఎలాగైనా సరే నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకొని జాతరకు వెళతావ్, ఆ తర్వాత నేను చీపురుతో కొడతాను అని ముందే కొట్టొద్దు అని హింట్ ఇస్తున్నావా..? లేకపోతే నీ మనసులో వేరే ఏదైనా ఉద్దేశం ఉందా..?” అని డౌట్ గా కళ్ళు చిన్నవి చేసి అడిగింది భారతి
“అమ్మ అమ్మ నా మీద ఎంత నమ్మకమే నీకు,