New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 5

పెళ్లి చూపులు – 5

పెళ్లి చూపులు -5

 

 

అబ్బా ఏంటో ఈ పాత పరిచయాలు, స్నేహం అంటే ఇదేరా అనే టైటిల్ పెట్టాలేమో వీళ్ళిద్దరి కోసం అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు అని అసహనంగా అనుకున్నాడు వైష్ణవ్ ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఫీల్ అవుతూ,,

 

“హమ్మయ్య ఇప్పటికే గుర్తుపట్టావా? మీ ఇంటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది” అని అన్నారు విజయేంద్ర.

 

ఆ మాటకి కొంచెం ఇబ్బందిగా ఇన్ సెక్యూర్ గా అవును అని గట్టిగా సమాధానం చెప్పలేక “ఏదో మీ అభిమానం” అని చిన్నగా అన్నారు భార్గవ్ గారు.. 

 

ఈయన చాలా మంచివారు లాగా ఉన్నారు ఖచ్చితంగా నా కూతురికి ఈ సంబంధం కుదిరితే బాగుండు. అప్పుడు నా కూతురు జీవితం బాగుంటుంది చూస్తుంటే అబ్బాయి కూడా చాలా బాగున్నాడు అని మనసులో అనుకుంది భారతి..

 

భార్గవ్ గారు విజయేంద్ర గారు ఇద్దరూ పక్కన ఉన్న వాళ్ళని కూడా మరిచిపోయి కాలేజీ విషయాలు సరదాగా చెప్పుకున్నారు. 

 

అమ్మో వీళ్ళు ఏంటి ఇంటర్మీడియట్ లో ఎప్పుడో జరిగిన పాత చింతకాయ పచ్చడి విషయాలు అన్నీ ఇప్పుడు మాట్లాడుకుంటూ వచ్చిన కార్యక్రమం మర్చిపోయారా..? త్వరగా ఇది అయిపోతే ఇక్కడి నుంచి బయటపడటం మంచిది అని మనసులో అనుకున్నాడు వైష్ణవ్..

 

వరూధినికైతే చాలా అసహనంగా ఉంది. 

 

భారతి ఇబ్బందిగా తన భర్త భుజం మీద చేతిని వేసింది. 

 

అప్పుడు వాళ్ళ మాటల  నుంచి బయటకు వచ్చిన భార్గవ్ గారు తన భార్య వైపు చూడటంతో ఆమె కళ్ళల్లో ఉన్న ఫీలింగ్ ఏంటో అర్థమై “అయ్యో విజయేంద్ర మీతో మాటల్లో పడిపోయి మీరు వచ్చిన విషయమే మర్చిపోయాను” అని అన్నాడు. 

 

“అవును. మనం ఎప్పుడో ఇంటర్మీడియట్లో చదువుకున్నాం ఆ తర్వాత కలిసిందే లేదు నువ్వు ఇక్కడే ఉండి వ్యవసాయం చేస్తున్నావా..? బిజినెస్ అంటూ బయటకు వెళ్లలేదా..?” అని అడిగాడు విజయేంద్ర..

 

” నాకు బిజినెస్ చేయాలి అని ఫస్ట్ లో అనిపించింది కానీ ఇక్కడ ఈ పల్లెటూర్లో ఉండి వ్యవసాయం చేయడం నచ్చింది అందుకే ఇక్కడే ఉండిపోయాను, బిజినెస్ గురించి ఆలోచన మర్చిపోయాను” అని అన్నారు భార్గవ్..

 

“అన్నయ్య గారు మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను అమ్మాయిని తీసుకొని వస్తాను” అని అక్కడి నుంచి సిరి మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళింది భారతి. 

 

ఆ పెళ్లిచూపులు నుంచి తప్పించుకుని ఎలా బయటకు వెళ్లాలా అని ఆలోచిస్తూ డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని ఉన్న మహాలక్ష్మికి తన తల్లి తన రూమ్ లోపలికి వచ్చింది కూడా తెలియలేదు..

 

“హమ్మయ్య రెడీ అయిపోయావా ఇంకా రెడీ అవ్వలేదేమో ఈ పెళ్లి చూపులు నాకు వద్దు అంటూ గోల చేస్తావేమో అని భయపడ్డాను, పర్లేదు రెడీ అయ్యావ్ ఇక వెళ్దామా కిందకి” అని అడిగింది భారతి..

 

తన తల్లి చేతిని పెట్టుకుని “అమ్మ ఇప్పుడు ఇవన్నీ అవసరమా!  పక్క ఊరిలో జాతర జరుగుతుందే నేను వెళ్లి సరదాగా ఎంజాయ్ చేసి వస్తాను” అని చిన్న పిల్లల కళ్ళు చిన్నవి చేసి తన తల్లి గడ్డం పట్టుకుని బ్రతిమలాడింది మహాలక్ష్మీ…

 

“కొట్టానంటే మూతి పళ్ళు రాలిపోతాయి అక్కడ పెళ్లి వాళ్ళు వచ్చి కూర్చొని ఉంటే నువ్వు జాతరకు వెళ్తాను అంటావా, ఈ పెళ్లిచూపులలో నువ్వు అబ్బాయికి నచ్చలేదు అంటే అప్పుడు నీకు నేను జాతర ఎలా ఉంటుందో చూపిస్తాను” అని వేలు చూపిస్తూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది.

 

“ఛీ ఈ అమ్మ ఎప్పుడు ఇంతే నా ఎంజాయ్మెంట్ కి అడ్డు వస్తుంది. హ్యాపీగా వెళ్లి జాతర చూద్దాం అనుకుంటే ఈ పెళ్లిచూపులు ఒకటి అయినా ఈ వచ్చే వాడికి ఈ రోజే దొరికిందా..?” అని మనసులో అనుకుంటూ అసహనంగా ఫీల్ అయింది.

 

“ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావ్ కొంపతీసి పెళ్లి చూపుల నుంచి తప్పించుకోవాలని ప్లాన్ వేసావా..? అలా చేస్తే  మన ఇంటి వెనక ఉన్న బర్రెల దొడ్లో బర్రెల పక్కన కట్టేస్తాను” అని తన కూతురి మీద ఉన్న పూర్తి నమ్మకంతో అన్నది భారతి..

 

“అమ్మ ఏంటే అలా మాట్లాడతావ్, బర్రె పక్కన నన్ను కట్టేస్తావా నేను నీ కూతుర్నే మరీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నావ్ ఏంటి..?” అని రాని ఏడుపుని వస్తున్నట్లుగా ఓవర్ యాక్టింగ్ చేస్తూ అన్నది మహాలక్ష్మి..

 

“చాలు చాలు ఆపు నువ్వు నీ ఓవరాక్షన్ నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా..? నువ్వు పుట్టిన దగ్గరనుంచి నీ ఈ ఓవరాక్షన్స్ చూస్తూ ఉన్ననే ఇంకా నువ్వు నా ముందు ఇలాంటి ఓవరాక్షన్స్ చేసి అమాయకురాలు అని ప్రూవ్ చేసుకోవాలి అనే నీ ప్రయత్నాలు ఆపి బయటకు వెళ్దాం పదా” అని అన్నది భారతి..

 

“ఈ తల్లులు ఎప్పుడు కూతురిని అర్థం చేసుకోరు” అని కాలుని నేల మీద గట్టిగా కొట్టింది.. 

 

తన కూతురి ఫ్రస్టేషన్ ని చూసి భారతి మనసులో నవ్వుకుంది. కానీ ఆ నవ్వుకున్నంత సేపు పట్టలేదు ఆ మనసులోనే కూతురు జీవితం ఏమైపోతుందో అనే బాధ కమ్ముకుంది 

 

“ఏంటి ఇంకా అలానే నిలబడ్డావ్ పదా వెళ్దామంటూ” మహాలక్ష్మి చేతిని పట్టుకుంది భారతి..

 

“సరే అమ్మ ఏం చేస్తాం నువ్వు చెప్పిన మాట వినక తప్పుతుందా..? ఎంతైనా నువ్వు నన్ను కన్న తల్లివి కదా నీ మాట వినాలి. లేకపోతే…” అని మాట ఆపేసింది మహాలక్ష్మి.

 

“హా ఏంటి లేకపోతే..!” అని మహాలక్ష్మి చేతిని వదిలి రెండు చేతులు కట్టుకొని సీరియస్గా కూతురు వైపు చూసింది భారతి..

 

ఇంకా ఉంది.

 

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్.