పెళ్లి చూపులు -73
“హలో బాస్ ఈ టైంలో ఎక్కడికి..?” అని రవి అంటున్నా కూడా,
వైష్ణవ్ “థాంక్యూ సిరిని కలపడానికి మంచి ఐడియా ఇచ్చినందుకు” అని స్టెప్స్ దిగుతుంటే,
” ఈ టైంలో నా ఇది పల్లెటూరు సిటీ కాదు” అని రవి చెప్తున్న మాటలు గాలిలోనే కలిసిపోయి అప్పటికే వైష్ణవ్ ఆ ఇంటిని దాటి ముందుకు వెళ్లిపోయాడు…
వెళ్తున్న వైష్ణవ్ ని పైనుండి చూస్తూ ఉన్న రవి,, సిరి మాట్లాడకపోవటంతో ఈ వైష్ణవ్ కి ఏమీ అర్థం కావడం లేదు, ఇప్పుడు మాట్లాడొచ్చు అని నేను చెబితే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు..
ఇది సిటీ అనుకుంటున్నాడేమో పల్లెటూరు అని అర్థం కావడం లేదు. అక్కడకు వెళ్లి సైలెంట్ గా తిరిగి వచ్చేస్తాడు అని సిరి మీద వైష్ణవ్ కి ఎంత ప్రేమ ఉంది అనేది అతడు సిరి కోసం పరితప్పిస్తున్న విధానంలోనే అర్థమవడంతో వాళ్ల ప్రేమకే మురిసిపోతూ చిన్నగా నవ్వుకుంటూ కిందకు వెళ్లిపోయాడు రవి…
వైష్ణవ్ విడిది ఇంటికి వెళ్లడం అయితే వెళ్ళడు ఆ ఇంటి లోపలికి వెళ్లి సిరిని ఎలా కలవాలో అర్థం కాక ఇంటి బయట అటు ఇటు తిరుగుతూ తెచ్చాడుతూ ఉన్నాడు…