New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 74

పెళ్లి చూపులు – 74

పెళ్లి చూపులు -74

 

 

“సిరిని కలవడానికి వెళ్లి సిరిని కలవకుండా రమ్యను కలిసి వచ్చావా..?” అని ఆ గిఫ్ట్ని పాకెట్లో పెట్టుకుంటూ అడిగాడు రవి.. “అంటే ఇది పల్లెటూరు కదా అందుకే కలవలేకపోయాను అక్కడ ఒక అంకుల్ చూసే చూపులకి నేను తప్పు చేసిన ఫీలింగ్ కలిగింది అందుకే కలవకుండా వచ్చేసాను” అని అన్నాడు వైష్ణవ్..

 

“రేపు ఉదయం నువ్వు వెళ్లి ఎంతసేపు వాళ్ళతో మాట్లాడినా ప్రాబ్లం ఉండదు. కానీ నైట్ చూసావా ఊరంతా దాదాపు లైట్ ఆపేసింది.. ఈ టైం లో వెళ్తే దొంగ అనుకుంటారు లేదంటే అనుమానంగా అయినా చూస్తారు అందుకే నేను వద్దు అని చెప్పాను కానీ నువ్వు వినకుండా వెళ్ళిపోయావు” అని అన్నాడు రవి..

 

“సరే నాకు నిద్ర వస్తుంది పడుకోవడానికి రూమ్ అని వైష్ణవ్ అడుగుతుంటే, 

“ఇక్కడ సపరేట్గా నీకు రూమ్ అని చూపించలేను డాబా మీదకు వెళ్దాం. చల్లటి గాలివీస్తుంది” అని చాప దిండు తీసుకొని వైష్ణవ్ తో కలిసి రవి కూడా డాబా మీదకు వెళ్ళిపోయి అక్కడ ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ నిద్రపోయారు…

 

మరుసటి రోజు ఉదయం సూర్యుని కిరణాలు వెలుగు వైష్ణవ్ మీద పడటంతో అప్పుడు నిద్ర లేచాడు. అప్పటికే పక్కన రవి లేడు. ఇంటిలో పెళ్లి పనులు  చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఊరిలో ఉన్న అందరూ అక్కడే ఉండి ప్రతి ఒక్కరు కూడా తలా ఒక చెయ్యి వేసి పెళ్లి పనుల్లో హెల్ప్ చేస్తున్నారు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue