New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 75

పెళ్లి చూపులు – 75

పెళ్లి చూపులు -75

 

“లాస్ట్ ది ఇంకా ఇంపార్టెంట్ ది ఇదిగో ఇలానే సిరి అలిగి మాట్లాడకుండా దూరంగా ఉంటే మరల లిప్ కిస్ పెట్టి తనతో గొడవ పడాలి అని రాసుకుంది. అది పెళ్లయిన తర్వాత అని నాతో చెప్పింది అంటే అప్పుడు లైఫ్ బాగుంటుంది అని చెప్పింది.

 

ఇక నువ్వు తనతో ఎలా ఉంటావు తనతో ఎలా మాట్లాడుతావు అనేది నీ ఇష్టం. కానీ ఇదిగో నేను చెప్పినది అన్ని ఇక్కడ మాత్రం నువ్వు చేయేదు ప్లీజ్..‌ ఎందుకంటే ఇది నా పెళ్లి. నువ్వు ఇలాంటివి ఏమైనా సిరి తో చేసినా కూడా పల్లెటూరు కాబట్టి సిరి ని తప్పుగా అనుకుంటారు.

అంతకుమించి ఇవన్నీ నీకు చెప్పినందుకు సిరి నాతో మాట్లాడకపోవచ్చు అందుకే నువ్వు ఇక్కడి నుంచి తనని కొంచెం దూరంగా తీసుకొని వెళ్లి ఎవరూ లేని ప్లేస్ లో మీ ఇద్దరూ కొట్టుకుంటారో తిట్టుకుంటారో ముద్దులే పెట్టుకుంటారో మీ ఇష్టం” అని చుట్టూ చూస్తూ ఎవరైనా వింటున్నారా అని భయం భయంగానే చెప్పింది.

 

తను చెప్పే మాటలు అందరూ వినదగినవి కాదు కదా వింటే కచ్చితంగా తను వైష్ణవ్ తో అలా మాట్లాడుతుంది తన కోసమే అన్నట్లుగా అనుకుంటారు. అది కూడా పెళ్లి సాయంత్రం పెట్టుకొని ఇలా ఒక అబ్బాయి తో మాట్లాడుతున్నారు అంటే తన క్యారెక్టర్ ని కూడా బ్యాడ్ చేస్తారు అని తెలుసు అది కాకుండా అది పల్లెటూరు కావడంతో తను జాగ్రత్తగా తన ఉంటూ అలా మాట్లాడింది. 

 

అంతా విన్న వైష్ణవి “సరే సరే నేను సిరి తో మాట్లాడి తనని కన్విన్స్ చేసుకుంటాను కానీ నువ్వు ఎందుకు ఇలా దిక్కులు చూస్తూ ఇబ్బంది పడుతున్నావ్” అని అయోమయంగా అడిగాడు వైష్ణవ్..

 

అబ్బా అది తల కొట్టుకుంటూ” ఇది ఏమైనా సిటీ అనుకుంటున్నావా మనం ఏం మాట్లాడుకున్నా ఎలా చేసినా కూడా ఎవరూ పట్టించుకోరు. చూసిన కూడా వాళ్ళు ఏమి చూడలేదు అన్నట్లుగా వెళ్లిపోవటానికి, పల్లెటూరు ఒక్కరికి తెలిసింది అంటే ఊరంతా టామ్ టామ్ అయిపోతుంది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue