పెళ్లి చూపులు -8
“ఆయ్ వెళ్లనండి. ఎండాకాలం సెలవులు ఇస్తారు కదా అప్పుడు స్నేహితులు అందరితో కలిసి ఆడుకోవడానికి వెళ్లాను. మా ఊర్లో ఉన్న స్కూలూ.. చాలా పెద్దగా ఉంటుంది” అని చేతులు రెండు చాపి మరి చెప్పింది కానీ అప్పటికి కూడా ఆమె తల పైకెత్తి చూడలేదు తల నేలకే వుంచింది.
‘అబ్బో ఆడుకోవడానికి స్కూల్ కి వెళ్ళిందా అది కూడా సమ్మర్ హాలిడేస్ లో, ఇలాంటి పిల్లతో నాకు పెళ్లి చేయాలి అని మా డాడీ నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చాడా?
కర్మ రా బాబు. ఈ పిల్లలో మా డాడీకి ఏం కనిపించిందో ఏంటో మహాలక్ష్మి బాగా తెలివైన పిల్ల గొప్ప అది ఇది అని చాలా చెప్పాడు, చూస్తుంటే కనీసం ఇంటిలో నుంచి బయటికి కూడా వచ్చినట్లు కనిపించడం లేదు, ఇలాంటి పిల్లతో నేను జీవితాంతం బ్రతకలా అమ్మో అలాంటి బ్రతుకు నాకు వద్దు.
ఎలాగూ ఈ సంబంధం చెడగొట్టమని మా అమ్మకు చెప్పాను కదా తనే ఏదో ఒక ప్లాన్ చేస్తుందిలే’ అని మనసులో అనుకొని ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక అటూ ఇటూ దిక్కులు చూస్తూ ఉన్నాడు వైష్ణవ్
చిన్నగా కళ్ళు మాత్రమే పైకెత్తి తన ఎదురుగా ఉన్న వైష్ణవ్ వైపు చూసింది మహాలక్ష్మి.