New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 9

పెళ్లి చూపులు – 9

పెళ్లి చూపులు -9

 

 

అప్పటివరకు దిక్కులు చూస్తూ అక్కడి నుంచి తప్పించుకోవాలి అని అనుకున్న వైష్ణవ్ అమె చూపుకి అలా అయస్కాంతముల అతుక్కుపోయాడు.

 

అబ్బా ఆ కళ్ళు ఏంటి అయస్కాంతంలా నన్ను తన వైపుకు లాగేస్తున్నాయి. ఇప్పటివరకు నేను ఎంతోమంది అమ్మాయిల ఐస్ చూశాను. కానీ ఈ అమ్మాయి ఐస్ చూస్తుంటే నన్ను ఐస్ లా కలిగించేస్తుందే అని మనసులో అనుకున్నాడు.

 

ఇప్పటివరకు అతను సిరి మహాలక్ష్మి వేషధారణ చూసి, ఆమె మాట్లాడే విధానం చూసి అనుకున్న మాటలు ఏమీ తనకు గుర్తుకు రాలేదు.

 

కనీసం ఎడ్యుకేషన్ కూడా లేదు ఇటువంటి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాడు ఇప్పుడు ఆమె ఓరగా తన వైపు చూస్తుంటే, ఈ చూపు చాలు జీవితాంతం తన కాళ్ళ కింద పడి బ్రతకడానికి అన్నట్లుగా ఆమె వైపు ఆశగా ఏదో మనసులో రేకెత్తిస్తున్న కొత్త పులకింతతో, తను ఉంది నేల మీద కాదు భూలోక స్వర్గంలో, అతిలోక సౌందర్యవతి నా ముందు కూర్చుని నా వైపు చూస్తుందా అన్నట్లుగా అతని ఫేస్ రియాక్షన్స్ మారిపోయాయి.

 

ఐదు నిమిషాలు అయినా ఆమె కళ్ళ వైపే కన్నార్పక చూస్తున్న వైష్ణవ్ ని చూసిన మహాలక్ష్మి ఈ అబ్బాయి ఏంటి నా వైపు ఇలా చూస్తున్నాడు, నేను నచ్చలేదు పెళ్లి చేసుకోను అన్నాడు, మరి ఏదో ఇంటెన్సుగా చూస్తున్నట్లుగా చూస్తున్నాడు. చూపులో తేడా కనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ “యాండీ మీరు నా గురించి  ఆలోచించి చెప్పొద్దు మీ మనసు ఏది చెబితే అదే సెప్పండి. ఏమి ఫికర్ కాకండి” అని అన్నది మహాలక్ష్మి.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue