New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 1

పెళ్లి చూపులు – 1

పెళ్లి చూపులు 

తెల్లారిందో
తెల్లారిందో  మావో మామ 
అనే రింగ్టోన్ ఫోన్లో ఆగకుండా మోగుతూనే ఉంది.
అబ్బ ఈ టైంలో ఎవరు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు అని విసుగ్గా అనుకుంటూ పక్కకు తిరిగి ఫుల్లుగా దుప్పటి ముసుగేసివే పడుకుంది అమ్మాయి. 
అలా ఒకసారి మోగి ఆగిపోయింది. మరొకసారి కూడా అలానే తెల్లారింది అని మోగుతూ ఉండటంతో ఈరోజు ఏమన్నా కొత్తగా తెల్లారుతుందా..,? ఆ సూర్యుడు రోజు వస్తానే ఉంటాడు. ఆ కోడి రోజు కూస్తూనే ఉంటుంది ఈ ఫోన్ మాత్రం నిద్రపోనివ్వకుండా డిస్టర్బ్ చేస్తూనే ఉంది. ఆ కోడి కూత పెట్టింది అని కోసి కూర వండించాను అమ్మ చేత,
మరి ఈ ఫోన్ ని ఎం చేయాలి అని విసుగ్గా అనుకుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు..
అప్పుడే వంట గదిలో నుంచి “ఎంతసేపటి నుంచి ఫోన్ రింగ్టోన్ వినిపిస్తుంది ఆ ఫోన్ ఎత్తేది ఏమైనా ఉంటుందా..? లేదంటే సైలెంట్ లో పెడతావా..?” అని గట్టిగా అరుపు వినపడటంతో,
అమ్మో అమ్మ అంటూ దుప్పటి ఫుల్లుగా కప్పుకున్నది పక్కకు విసిరేసి ఫోన్ చేతిలోనికి తీసుకొని దానిలో ఉన్న నెంబర్ ఎవరిదో కూడా చూడకుండా లిఫ్ట్ చేసి హలో అన్నది. 
అటువైపు నుండి హలో అని వాయిస్ రావటంతో ఆ వాయిస్ గుర్తుపట్టి ఫోన్ ని చెవి దగ్గర నుంచి కళ్ళ ముందుకు పెట్టుకొని నెంబర్ చూసి “బుద్ధి లేదే నీకు ఇంత ఉదయాన్నే  ఫోన్ చేసి నా మంచి నిద్ర ని, నన్ను డిస్టర్బ్ చేస్తున్నావ్ ,
నీ వల్ల అమ్మ  నన్ను తిట్టింది. పంది దున్నపోతు గాడిద అడ్డ గాడిద నిలువు గాడిద, నన్ను ఇలా నిద్ర డిస్టర్బ్ చేసావు కదా నీకు కూడా రేపు ఇలానే నిద్ర డిస్టర్బ్ చేసే మొగుడు వస్తాడు చూడు, నిద్ర కోసం అల్లాడిపోవాలి కళ్లు ఎర్రగా వాచిపోయినా నీకు మాత్రం నిద్రపోవడానికి వీలు లేకుండా ఉండాలి” అంటూ వరసగా తిట్ల పురాణం మొదలుపెట్టింది.
అటువైపు ఉన్న అమ్మాయి ఆ తిట్ల పురాణం ఎప్పుడు వినడం అలవాటు అయినట్లుగా “సరే సరే అలానే జరుగుతుందిలే కానీ ముందు నేను చెప్పేది విను” అంటూ చాలా నింపాదిగా అన్నది. 
“ఛీ కనీసం నేను కోపంగా అంటున్న కాదు తిడుతున్న కూడా ఏ రియాక్షన్ లేదు, సిగ్గులేని ఫ్రెండ్స్,  ముందు నాకుంటే కదా సిగ్గు నా ఫ్రెండ్స్ గా వాళ్లకు ఉండటానికి” అని తన ఫేస్ ని అద్దంలో చూసుకుని,
నీకేంటి సూపర్ ఉన్నావ్ అనుకొని “చెప్పు అసలు విషయం ఏంటో , ఇంత ఉదయాన్నే నా నిద్ర డిస్టర్బ్ చేస్తూ ఫోన్ చేయాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది” అని నీరసంగా బెడ్ మీద నుంచి కిందకు దిగుతూ అన్నది అమ్మాయి.
“చెప్పేదేంటి ఆల్రెడీ వారం నుంచి నీకు చెప్తూనే ఉన్నా ఇంకా ఇప్పుడు నువ్వు బెడ్ కూడా దిగలేదు ఎప్పుడు వస్తావు మా దగ్గరికి ” అది కోపంగా అన్నది అటువైపు ఉన్న అమ్మాయి.
“ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి నేనేం చేయాలి చెక్కభజన చేయాలా..? లేకపోతే మీరు అమ్మగా మిగిలిన పల్లి చెక్క అమ్మాలా..?” అని అన్నది సిరి సిరిమహాలక్ష్మి. 
“నువ్వు దానికి కరెక్ట్ గా సూట్ అవుతావని మాకు తెలుసులే కానీ ముందు చెప్పేది విను, ఇక్కడ మా ఊరిలో జాతర జరుగుతుంది అని చెప్పాను.
ఈ రోజే లాస్ట్ నిన్న నువ్వు ఊరికి వచ్చావని తెలిసి ఫోన్ చేశాను, వస్తావా రావా అని పిలిచింది కాదు కాదు అది రిక్వెస్ట్ కూడా కాదు ఒక రకంగా ఆర్డరే” అటువైపు ఉన్న సిరి మహాలక్ష్మి ఫ్రెండ్ అయినా కల్పన…
ఏంటి జాతరా అని అప్పుడే పేస్టు బ్రష్ చేతిలోకి తీసుకుంటూ ఉన్నా ఆమె ఒక్కసారిగా వాటిని నేల మీదకు వదిలేస్తూ గట్టిగా అరిచింది. 
ఏంటి ఆ అరుపు అంటూ వంట గదిలో నుంచి సిరి తల్లి అయినా భారతి గట్టిగా అరిచింది.
అబ్బ మా అమ్మవి పాము చెవులు ఎంత చిన్నగా అరిచినా వినపడతాయి ఈ అమ్మలకి అని అనుకుంటూ ఏమీ లేదు అని గబగబా కింద పడ్డ పేస్టు బ్రష్ తీసుకుని నువ్వు చెప్పేది నిజమా అని అడిగింది..
“అబ్బా నిజమనే కదా చెప్తుంది నువ్వు త్వరగా బయలుదేరి వస్తున్నావా లేదా..?  కరెక్ట్ గా ఒక గంటలో నువ్వు ఇక్కడ ఉండాలి.
మీ ఊరు నుంచి మా ఊరికి రావడానికి కరెక్ట్ గా  20 మినిట్స్ పడుతుంది మిగతా 40 నిమిషాలు దయ తలచి నువ్వు రెడీ అవ్వడానికి ఇచ్చాను. కాదు అని రాకుండా వేషాలు వేసావో” అని అటు పక్క నుంచి కల్పన పూర్తిగా కూడా చెప్పలేదు,
“సరే సరే వస్తున్నాను ఇక మరల నేను అన్న మాటలే వినిపించుకోవాలి అని నా చెవులు సిద్ధంగా లేదు. కాబట్టి బాయ్ బాయ్ నేను వాష్ రూమ్ లోనికి దూరిపోతున్నాను” అంటూ ఫోన్ కట్ చేసి బెడ్ మీదకు విసిరేసి తను వాష్ రూమ్ లోనికి దూరిపోయింది. 
పాపం మన సిరి జాతరకు వెళ్లడానికి అడ్డంగా ఏదో ఒకటి రావాలి కదా. అందుకే సిరి తండ్రి అయిన భార్గవ్ గారు సిరి కోసం కరెక్ట్ గా ఆరోజే పెళ్లి వాళ్ళు వస్తున్నారు అని తన భార్యకు చెప్పారు. 
మరి ఈ విషయం సిరికి తెలిస్తే ఎలా రియాక్షన్ ఇస్తుంది
ఇంకా ఉంది ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్.
ఇది చిన్న సింపుల్ స్టోరీ. 
కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ ఇందులో సస్పెన్స్ 0.001% మాత్రమే ఉంటుంది 
చాలా సాఫీగా నెమ్మదిగా సాగిపోతుంది.
కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఎలా ఉంది అనేది మాత్రం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.