పెళ్లి చూపులు – 2
పెళ్లి చూపులు-2
“సరే సరే వస్తున్నాను ఇక మరల నేను అన్న మాటలే వినిపించుకోవాలి అని నా చెవులు సిద్ధంగా లేదు, కాబట్టి బాయ్ బాయ్ నేను వాష్ రూమ్ లోనికి దూరిపోతున్నాను” అంటూ ఫోన్ కట్ చేసి బెడ్ మీదకు విసిరేసి తను వాష్ రూమ్ లోనికి దూరిపోయింది సిరిమహాలక్ష్మీ.
దొంగ మొహాలు కరెక్ట్ గా వన్ అవర్ మాత్రమే టైం ఇచ్చాయి, లేటుగా వెళితే నా పని ఇక అంతే, ఆటాడిస్తాయి కాబట్టి త్వరగా వెళ్లాలి అని చాలా స్పీడ్ గా తల స్నానం చేసి బయటకు వచ్చింది.
ఎంత స్పీడ్ గా తలస్నానం చేసి బయటకు రావాలి అనుకున్న అప్పటికే టైం అరగంట గడిచిపోయింది ఎందుకంటే తాన హెయిర్ నడుము కిందకి పొడుగ్గా ఉంటుంది. అంత పెద్ద వాలు జడకి స్నానం చేపించాలి అంటే టైం పడుతుంది కదా..!
అబ్బా అప్పటికే అరగంట అయిపోయిందే అని అనుకుంటూ ఫ్యాన్ కింద తన హెయిర్ ఆరబెట్టుకోవడానికి ట్రై చేసింది. కానీ అప్పుడే కరెంట్ కూడా పోయింది తన అదృష్టం కొద్ది,
అబ్బా ఈ పాడు కరెంట్ కూడా ఇప్పుడే పోవాలా అని కాసేపు ఆ కరెంట్ ని తిట్టుకొని ఇక చేసేది ఏమీ లేక టవల్తో తల తుడుచుకుంటూ ఉంది.
అప్పుడే ఫోన్ మాట్లాడుతూ ఇంటి లోపలికి వచ్చిన భార్గవ్ గారు అవునా ఓకే అలాగే అని అంటూ హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నారు..
ఆయన కోసం భారతి కాఫీ తీసుకొని వచ్చి ఇవ్వటంతో ఫోన్ కట్ చేసి ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్పు తీసుకుంటూ “ఈరోజు మన అమ్మాయిని చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు” అని అన్నారు.
ఆమె ఫేస్ లో ఆనందం బాధ ఏమీ లేదు న్యూట్రల్ గా చూసింది.
“ఏంటి అలా చూస్తున్నావ్..?” అని ఆయన అడిగితే “ఏమోనండి, మన అమ్మాయికి ఈ సంబంధం సెట్ అవుతుందా..?” అని డౌట్ గా ఉంది అని ఒక రకమైన బాధ నిండిన గొంతుతో అడిగింది.
“నువ్వేమీ కంగారు పడొద్దు ఈ సంబంధం కచ్చితంగా కుదురుతుంది ఇక మన అమ్మాయికి పెళ్లి చేయడమే మిగిలింది” అని ఆయన కాఫీ తాగడం కంప్లీట్ చేసి ఆమె చేతిలో కప్పు పెడుతూ చాలా నమ్మకంగా చెప్పారు.
“సరే మీరంతా నమ్మకంగా చెప్తున్నారు కదా మన అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయితే నాకు ఆనందమే” అంటూ “నేను ఇప్పుడే వెళ్లి ఈ విషయం దానికి చెప్పి రెడీ అవ్వమని అంటాను” అని అనడంతో,
” సరే సరే త్వరగా కానివ్వండి, వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారు అంట, మనకే లేటుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది మరో అరగంటలో ఇక్కడికి వచ్చేస్తారు అసలే మీరు లేడీస్ త్వరగా కాదు” అని ఆయన నవ్వుతూ రూమ్ లోనికి వెళ్లారు..
ఇప్పుడు ఈ విషయం దానికి చెబితే నా మీద అంత ఎత్తున లెగుస్తుంది ఎలా చెప్పాలి దీనికి? వాళ్లేమో అరగంటలో వస్తున్నారు అని అన్నారు ఈయన.
ఇది అరగంటలో రెడీ అయ్యి కూర్చుంటుందా..? ఇది తల స్నానం చేసి బయటకు వచ్చేసరికి గంట పడుతుంది అని అనుకుంటూ సిరి రూంలోనికి ఎంటర్ అయ్యారు.
అప్పుడే సిరి తల ఎలా ఆరబెట్టుకోవాలో అర్థం కాక రూమ్ అంత అటు ఇటు గజిబిజిగా తిరుగుతూ ఉండడం గమనించింది భారతి..
దీనికి ఏమైంది ఇలా తిరుగుతుంది అని అయోమయంగా అనుకుంటూ “ఏంటే పిచ్చి గాని పట్టిందా రూమ్ అంతా అలా తిరిగేస్తున్నావ్..?” అని అడిగింది భారతి..
“అబ్బా అమ్మా నన్ను ఇప్పుడు నువ్వు ఏం కదిలించదు, నేను చాలా స్పీడ్ గా రెడీ అవ్వాలి నాకు టైం లేదు” అని తన తల్లిని పట్టించుకోకుండా అటు ఇటు తిరిగింది..
త్వరగా రెడీ అవ్వాలి అంటే ఈయన నాకు చెప్పక ముందే దీనికి చెప్పారా పెళ్లి వాళ్ళు వస్తున్నారు అని అంటే దీనికి ఇష్టమేనా ఇప్పుడు స్పీడ్ గా రెడీ అవ్వాలి అంటుంది, ఎదైయితేనేమి ఇది ఒప్పుకుంది అదే చాలు నాకు అని అనుకుంటూ “నాకు చాలా హ్యాపీగా ఉంది” అంటూ సిరి చేతిలో ఉన్న టవల్ భారతి తీసుకొని ఆ టవల్తో సిరి తలను తుడుస్తూ అన్నది..
“నేను జాతరకు వెళుతుంటే నీకెందుకు హ్యాపీగా ఉంటుంది” అని అయోమయంగా అడిగింది మహాలక్ష్మి. నిజానికి తను జాతరకు వెళితే కచ్చితంగా తన తల్లి వెనక చీపురు పట్టుకొని పరిగెడుతుంది అని తనకు తెలుసు. అందుకే తన తల్లికి చెప్పకుండా వెళ్లాలి అని అనుకొని ప్రిపేర్ అవుతుంది కానీ ఇప్పుడు తన తల్లి తన రెడీ అవుతుంటే ముందే తెలిసి ఆనందంగా ఉంది అంటుంది ఏమో అని మిస్ కమ్యూనికేషన్ తో అలా అడిగేసింది..
అప్పటివరకు పెళ్లిచూపులు కోసం రెడీ అవుతుంది ఏమో అని అనుకున్న భారతి ఇప్పుడు జాతర కోసం అనేసరికి నడుం మీద రెండు చేతులు పెట్టుకొని కోపంగా చూసింది సిరివైపు
“అమ్మ ఏంటే ఇప్పటివరకు నవ్వుతూ చూసి ఇప్పుడు ఇలా కోపంగా చూస్తున్నావు అమ్మోరిలాగా, అసలు ఏం జరిగింది..? నువ్వే కదా నీకు చాలా ఆనందంగా ఉంది అన్నావ్, ఇంకా నన్ను జాతరకు పంపించడానికి నా దగ్గరకు వచ్చావ్ ఏమో అనుకున్నాను. నా ఫ్రెండ్స్ నీకు ఫోన్ చేసి చెప్పడంతో, అంటే నా ఫ్రెండ్స్ మీకు ఫోన్ చేసి చెప్పలేదా..? నేనే తొందరపడి వాగేసానా..?” అని నాలుకరిస్తుంది.
“అమ్మ నువ్వు ఇలా చూడకే నాకు భయం వేస్తుంది” అని మరింత భయం నటిస్తే ముడుచుకుపోయినట్టుగా ఫేస్ ముడుచుకుంది సిరి.
“చాలు చాలు నీ వేషాలు జాతర జీతర అన్ని కట్టిపెట్టేసి ఇదిగో ఈ పట్టు చీర కట్టుకొని రెడీ అవ్వు” అంటూ కబోర్డ్ లో ఉన్న పట్టుచీర తీసి సిరి చేతుల్లో పెట్టింది.
“అమ్మా పట్టుచీర కట్టుకుని జాతరకు వెళితే బాగోదేమో అందుకే నేను లంగా వోని వేసుకొని వెళ్తాను చాలా బాగుంటుంది అలానే నా ఫ్రెండ్స్ కూడా లంగా వోని వేసుకోమని చెప్పారు ప్లీజ్ అమ్మ “అని తన తల్లి గడ్డం పట్టుకుని బ్రతిమలాడింది
“లేదు ఈరోజు నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారంట నువ్వు పట్టు చీరలో రెడీ అయ్యి బయటకురా, లేదు అంటే..;” అని వేలు చూపించింది భారతి.
“అమ్మా ఏంటే ఇది నా ఆనందానికి అడ్డుకట్ట” అని నాటకంగా అన్నది సిరి.
“ఇప్పుడు నువ్వు రెడీ అవ్వకపోతే అప్పుడు మీ నాన్న ఆనందానికి అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది. నువ్వే ఆలోచించుకో” అని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చింది భారతి.
ఇంకా ఉంది.
ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్.
ఇప్పుడు సిరి పెళ్లిచూపులుకి రెడీ అవుతుందా లేదా
నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో
అబ్బాయి ఏంటమ్మా ఈ ఊరు చూడు ఈ గుంతలు కారు అరగంట నుంచి ఇక్కడెక్కడే తిరుగుతున్నట్లుగా ఉంది నా నడుము పట్టేసింది అని అన్నాడు సిరిని చూడడానికి వస్తున్న పెళ్లి కొడుకు.
ఈ ఊరే ఇలా ఉంది ఇక అమ్మాయి ఎలా ఉంటుందో పల్లెటూరు బైతులా ఉంటుందేమో అని అనుకున్నాడు.
Swipe left/right or tap the sides to turn pages