ప్రేమలో పడితే -12
“నువ్వు విషయం చెప్పు ఎగిరి గంతేయాలో లేదో మేం చెప్తాం” అని గణేష్ రమ్య ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుతూ అన్నారు..
“ముంబై నుంచి చైతన్య వచ్చాడు, టుడేస్ ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటాడంట తెలుసా..!” అని చాలా ఎక్సైట్మెంట్తో చెప్పింది మహాలక్ష్మి.
కరెక్ట్ గా అప్పుడే అటువైపు వచ్చిన శ్రీరామ్ కి మహాలక్ష్మి చెప్పిన మాటలు విని ఆమె వెనకగా ఆగిపోయాడు.
శ్రీరామ్ వచ్చిన విషయం రమ్య గణేష్ ఇద్దరు కూడా చూడలేదు.
“నిజంగానా నిజంగానే చైతన్య ఇక్కడికి వచ్చాడా..? రెండు రోజులు ఇక్కడే ఉంటాడా..?” అని వాళ్ళు చాలా ఆనందంతో ఎగ్జిట్ మెంట్ తో అడిగారు.