ప్రేమలో పడితే -11
అప్పుడే కాలేజ్ అయిపోయాయి ఫ్రెండ్స్ తో తిరిగి ఇంటి లోపలికి వచ్చిన అద్విక “హాయ్ బావ ఏంటి అందరూ హాల్లోనే మీటింగ్ పెట్టారు..?” అని శ్రీరామ్ దగ్గరకు వచ్చి అతడి చేతిని పట్టుకుని మరి అడిగింది.
“అద్వి నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా బయట నుంచి వచ్చిన వెంటనే నన్ను పట్టుకోవద్దు అని, రూమ్ లోనికి వెళ్లి ఫ్రెష్ ఏ రా పో” అని చెప్పటంతో,
ఓకే బావ అని నవ్వుతూ అద్విక తన రూములోనికి వెళ్ళిపోయింది.
మహాలక్ష్మి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చింది అని శ్రీహరి కూడా లైబ్రరీ క్లోజ్ చేస్తుంటే అప్పుడే ఒక అబ్బాయి అక్కడికి వచ్చి “హాయ్ అంకుల్ బాగున్నారా..?” అని అక్కడికి వచ్చి అడిగాడు..
ఈ టైంలో ఇక్కడికి ఎవరు వచ్చింది అని తల వెనక్కి తిప్పి చూసిన శ్రీహరికి అక్కడ చైతన్య కనిపించాడు.