ప్రేమలో పడితే -16
నువ్వు మాట్లాడొద్దు అన్నట్లుగా శ్రీరామ్ గణేష్ వైపు చేతిని పెట్టి చూపించి “నువ్వు నాకు పీఏగా వర్క్ చేసావా ఓకే..! లేదంటే ఇదిగో ఇందులో ఉన్న కండిషన్స్ ప్రకారం నువ్వు రిజైన్ చేస్తే నీతో పాటు నీ ఫ్రెండ్ ఈ గణేష్ అలానే బయట కూడా ఒక ఫ్రెండ్ ఉన్నట్టు ఉంది కదా నువ్వు ఏది చేసినా భజన చేయడానికి, వీళ్ళిద్దరికీ నేను నేను రిసిగ్నేషన్ లెటర్ ఇస్తాడు నీ ఇష్టం ఆలోచించుకో” అని చెప్పి రిలాక్స్డ్ గా మనసులో నవ్వుకుంటూ చైర్ లో కూర్చున్నాడు. !
గణేష్ భయంగా మహాలక్ష్మి వైపు చూస్తున్నాడు కానీ మహాలక్ష్మి మాత్రం అంతే మౌనంగా తలదించుకుని ఉంది
ఐదు నిమిషాలు అయినా కూడా ఇంకా మహాలక్ష్మి తల ఎత్తి శ్రీరామ్ వైపు చూడకపోవటంతో శ్రీరాం “దీనితో పాటు ఇంకొక కండిషన్ కూడా ఉంది, నువ్వు వీళ్లిద్దరిని జాబ్ లో నుంచి తీసేసిన పర్లేదు నా జాబ్ పోయినా పర్లేదు అని నువ్వు వెళ్ళిపోయావే అనుకో ఈ కంపెనీ రూల్స్ అతిక్రమించవు అని నీ మీద కోర్టులో కేసు వేయవచ్చు, కోర్టు కేసు కాదు అనుకుంటే నువ్వు ఈ కంపెనీకి కోటి రూపాయలు చెల్లించాలి, ఆ తర్వాత నీ ఇష్టం ఆలోచించుకో” అని అన్నాడు..
కోటి రూపాయలా అని గణేష్ గుండె మీద చేతులు వేసుకుంటే, అప్పుడు మహాలక్ష్మి చిన్నగా తల ఎత్తి శ్రీరామ్ వైపు చూసింది.
“ఏంటి సమాధానం కోర్టు కేస్, కోటి రూపాయలు కడతావా..? మీ ఫ్రెండ్స్ జాబ్ తీసేస్తావా..?” అని కన్ను ఎగరేస్తూ అడిగాడు..