New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమలో పడితే – 17

ప్రేమలో పడితే – 17

ప్రేమలో పడితే -17

 

 

మీరు చెప్పిందల్లా నేనెందుకు చేస్తాను అని మనసులో అనుకొని “మీరేం చెప్పారో అప్పుడే మీరే మర్చిపోయారా సార్, ఇంత మతిమరుపు ఉంటే ఇంత పెద్ద కంపెనీని ఎలా రన్ చేయగలరు” అని అమాయకంగా అన్నది మహాలక్ష్మి. 

 

మహాలక్ష్మి అని శ్రీరామ్ పక్కన చేత్తో టేబుల్ మీద గట్టిగా కొట్టి పిలవడంతో, “సారీ సార్ మీరు అలా అడిగేసరికి అన్ని నిజాలు చెప్పాను, ఎందుకు పిలిచారు చెప్పలేదు” అని అడిగింది మహాలక్ష్మి. 

 

“ఈరోజు నా టైం టేబుల్ ఏంటి అనేది మొత్తం గోవర్ధన్ గారు నీకు ఇస్తారు అది చూడు, రేపటి నుంచి నా టైం టేబుల్ మొత్తం నువ్వే ప్రిపేర్ చేయాలి, ఉదయం నేను ఆఫీస్ కి ఎంటరైన మరుక్షణం నువ్వు నాకు చెప్పాలి” అని అన్నాడు శ్రీరామ్.

 

“పేరుకే పెద్ద మేనేజర్ కానీ ఏ టైంలో ఏం చేయాలి అనేది మరొకరు చెబితే కానీ తెలియదు, గుర్తుకు రాదు ఏంటో..!” అని సాగదీస్తూ పైకి శ్రీరామ్కి వినపడే విధంగానే అని సరే సార్ అని అన్నది.

 

ఆమె మాటలకి కోపం పీక్స్ లోకి వెళుతుంటే కంట్రోల్ చేసుకొని ఛాన్స్ దొరికినప్పుడు ఆమెను గుప్పెట్లో పెట్టుకోవాలి అనుకొని “ఇప్పుడు వెళ్లి ఈరోజు ఈవినింగ్ వరకు నా షెడ్యూల్ ప్రిపేర్ చెయ్” అని సీరియస్ గా అన్నాడు..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue