ప్రేమలో పడితే -18
“పిఏ జాబ్ అంటే ఇలా ఉంటుందా ఇలా కూడా ఊహించుకుంటారా..? ఇప్పటివరకు హై పొజిషన్ కి వెళ్తారు సాలరీ పెరుగుతుంది అని మాత్రమే ఆలోచించాం, కానీ ఫస్ట్ టైం ఇలా ఆలోచించటం నిన్నే చూస్తున్నాను” అని అంటూ రమ్య గణేష్ ఇద్దరు కూడా ఫుడ్ తిన్నారు..
వీళ్ళకి తెలియని విషయం ఏమిటి అంటే రమ్య తో మాట్లాడాలి అని అక్కడికి వచ్చిన శ్రీరామ్ మహాలక్ష్మి మాటల విని ఆగిపోయాడు.
తనకి కూడా పీఏ పోస్ట్ అంటే ఇలా ఉంటుందా అని ఇప్పటివరకు తెలియదు. ఇప్పుడు మహాలక్ష్మి మాటల్లోనే ఎలా ఉంటుంది, ఆమె ఎలా ఇబ్బందిపడుతుంది అనేది అర్థమవ్వటంతో నవ్వుకుంటూ రమ్యతో మాట్లాడకుండానే తన కెబిన్ కి వెళ్ళిపోయాడు.
తిన్న తర్వాత వర్క్ ప్లేస్ కి వెళ్లి గణేష్ రమ్య ఇద్దరు కూర్చుంటే మహాలక్ష్మి తన ప్లేస్ లో కూర్చోకుండా గోవర్ధన్ గారు ఎక్కడ ఉన్నారా అని చూస్తూ ఉంది..
ఏంటే కూర్చోకుండా దిక్కులు చూస్తున్నావ్ అని రమ్య అడిగింది.