ప్రేమలో పడితే -8
“నువ్వు ఏది చేసినా బాగా ఆలోచించి చేస్తావురా..?” అని పక్కనుండి భవాని తన మేనల్లుడిని మెచ్చుకుంది..
నెక్స్ట్ డే ఆఫీసులో శ్రీరామ్ కి కొత్తగా పిఏగా వర్క్ చేయడానికి పర్సన్ కావాలి. అది కూడా మన ఆఫీసులో వర్క్ చేస్తున్న పర్సన్ టాలెంట్ ఉన్న పర్సన్ ని తీసుకోవాలి అనుకుంటున్నాం. మీలో ఎవరైనా శ్రీరామ్ కి పిఏగా వర్క్ చేయాలి అనుకుంటున్నారా అయితే మీ పేర్లు రాసి మాకు ఇవ్వండి అని ఆఫీసులో అనౌన్స్ చేశారు.
అదంతా విన్న రమ్య తన పక్కన కూర్చొని ఉన్న మహాతో “ఏమే నువ్వు పేరు రాసి ఇవ్వచ్చు కదా, నీకు చాలా టాలెంట్ ఉంది, అంతకుమించి మేనేజర్ కి పిఏ అంటే శాలరీ కూడా పెరుగుతుంది ప్రమోషన్ వచ్చినట్లుగా ఉంటుంది కదా” అని అన్నది