ప్రేమలో పడితే -9
చిన్నగా నవ్వింది రమ్య.
అప్పుడే గణేష్ వచ్చి “హమ్మయ్య నా పేరు ఇచ్చి వచ్చాను” అని వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ వర్క్ కంటిన్యూ చేశారు..
“సార్ మీరు పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని చెప్పిన రెండు ప్రాజెక్ట్స్ టీమ్ లీడర్స్ ని పిలిచి ఆ విషయం చెప్పమంటారా..?” అని అడిగాడు శ్రీరామ్ పి ఏ గోవర్ధన్..
“వద్దు” అంటూ అందులో ఒక ప్రాజెక్ట్ ఫైల్ తీసి పక్కన పెట్టేసి ఒక్క ప్రాజెక్ట్ ఫైల్ మాత్రమే పిఏ చేతుల్లో పెట్టి “ఈ ఫైల్ మాత్రమే సెలెక్ట్ అయింది అని అనౌన్స్ చేయండి, అలానే నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టు కూడా ఆ టీం కి ఇస్తున్నాం అని అనౌన్స్ చేయండి” అని చెప్పాడు శ్రీరామ్
“కానీ సార్ ఆ ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ గా ఉంది “అని చెప్తుంటే,
ఫస్ట్ చెప్పింది చేయండి అని అన్నాడు శ్రీరామ్.