New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమా? ప్రతీకారమా? – 6

ప్రేమా? ప్రతీకారమా? – 6

 

రుద్ర చేతిలో ఉన్న పాత document వైపే చూస్తున్నాడు. అందులో చివరగా ఉన్న సంతకం అతనికి పూర్తిగా కొత్తది. శేఖర్ సంతకం కాదు, తన తండ్రి ప్రతాప్ సంతకం కూడా కాదు. మరి ఐదేళ్ల క్రితం జరిగిన ఆ business dealలో ఈ మూడో వ్యక్తి ఎవరు?

“విక్రమ్… ఈ సంతకం ఎవరిదో తెలుసుకోవాలి. వెంటనే!”

విక్రమ్ ఆ document తీసుకుని పరిశీలించాడు.

“రుద్రా, ఇందులో ఉన్న పేరు స్పష్టంగా లేదు. కానీ సంతకం పక్కన ఒక company seal ఉంది. దాని ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.”

“నాకు పేరు కావాలి విక్రమ్. ఆ రోజు నా తండ్రిని ఎవరు మోసం చేశారో తెలుసుకోవాలి.”

శేఖర్ వెంటనే మధ్యలో మాట్లాడాడు.

“రుద్రా, ఆ document గురించి నీకు తెలిసింది సగం మాత్రమే. దయచేసి నా మాట విను.”

“ఇంకా ఏం వినాలి? ఐదేళ్ల క్రితం నా తండ్రి నిన్ను నమ్మాడు. తన business secrets నీతో పంచుకున్నాడు. కానీ ఆ confidential information బయటకు ఎలా వెళ్లింది? నీ సంతకంతో ఉన్న papers నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ఏదో కొత్త కథ చెబుతున్నావా?”

“నేను ప్రతాప్ గారిని మోసం చేయలేదు రుద్రా!”

రుద్ర కోపంగా నవ్వాడు.

“ఆ మాట ఐదేళ్లుగా వింటూనే ఉన్నాను. కానీ నీ మాటను నమ్మడానికి నా దగ్గర ఒక్క కారణం కూడా లేదు.”

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue