కూతురికి ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియక ఇబ్బందిగా చూస్తూ శైలు దగ్గరకి వెళ్లి నాభి మీద ఉన్న చీర కొంగుని కొంచెం జరిపి చూపిస్తూ..” ఇలా కనిపిస్తుంది రా, వియ్యాల వాళ్ళు వస్తారు కదా బాగోదు.. మన ఇంట్లో అయితే పర్వాలేదు.” అని అంది నెమ్మదిగా కౌసల్య.
ఇబ్బందిగా తల్లిని చూస్తూ..” చీర కొంగుని ఇలా ఉంచుకుంటే కనిపించదులే అమ్మ.” అని అంది నెమ్మదిగా శైలు.
“అది మాత్రమే కాదు..” అని అంటూ మెడ మీద వీపు మీద కూడా కనిపిస్తున్న పంటి గట్లని తన ఫోన్లో ఫోటో తీసి కూతురు ముందు పెట్టింది కస్తూరి.
ఇబ్బందిగా పిన్నిని అమ్మని చూసి అక్కడ నుంచి వెళ్లి వాటర్ బాటిల్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి తన రూమ్ లోకి వెళ్ళింది శైలు.