ప్రేమ దూరమైన తర్వాత 💔 – 4
వాష్‌రూమ్‌లోని మిర్రర్ ముందు నిలబడి టాప్ నుండి వాటర్ తీసుకుని రెండు చేతులతో ముఖంపై నీళ్లు చల్లుకుంది నిత్య……….. !! చల్లటి నీటి చుక్కలు ఆమె మొహాన్ని తాకుతున్నా గుండెల్లో రగులుతున్న మంట మాత్రం చల్లారలేదు……… !! అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ చేతితో నీళ్ళు తుడిచేసుకుంటూ ఛా!! అసలు ఎవరి ఫేస్ అయితే చూడకూడదని అందరినీ అన్నిటినీ వదిలి ఈ ఊరు వచ్చానో ………. !! అదే వ్యక్తి మళ్లీ నా ముందుకు వచ్చాడు అదీ కాకుండా అతను మాట్లాడిన ప్రతి వర్డ్ లోనూ మళ్లీ నా లైఫ్ లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నట్టు క్లియర్ గా కనిపిస్తోంది……….. !! ఇప్పుడు నేనేం చేయాలి? గాడ్ వాట్ షుడ్ ఐ డు ఒక్కసారి అతను నా జీవితంలోకి రాగానే నా ఎంటైర్ ఫ్యామిలీ ని కోల్పోయాను………. !! నా డ్రీమ్స్, నా సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నీ కాలి బూడిదైపోయాయి & ఇప్పుడు మళ్లీ వచ్చాడు………… !! కానీ ఈసారి నా దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదు ఒక్క నా కొడుకు తప్ప వాడిని కూడా నా నుంచి లాగేసుకుంటాడా………. ?? ఆ ఆలోచన రాగానే నిత్య ఒక్కసారిగా కళ్లలో నీళ్లు తిరిగినా వెంటనే దాన్ని బయటకు కనిపించకుండా కంట్రోల్ చేసుకుంటూ…….. !!
లేదు ….లేదు అలా జరగడానికి నేను ఎప్పటికీ ఒప్పుకోను ………. !! అసలు మిస్టేక్ చేసిన అతను అంత పెద్ద క్రైమ్ చేసి కూడా సొసైటీ లో ఒక సక్సెస్ఫుల్ బిసినెస్ మ్యాన్ లా తిరుగుతున్నప్పుడు…….. !! ఏ తప్పూ చేయని నేనెందుకు భయపడాలి? నేనెందుకు పారిపోవాలి? ఐ విల్ ఫేస్ ఇట్ …….. !! అని తనలో తానే అనుకుంటూ బయటకు వచ్చింది నిత్య………. !!
మరో నిత్య తన చేతిని విడిపించుకుని వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయాడు అర్జున్ భట్టాచార్య………… !! అతనికి తెలుసు తన వల్ల ఆమె ఎంత నరకం అనుభవించిందో………… !! నీకు నా మీద ఎంత కోపంగా ఉందో నాకు తెలుసు బుజ్జి నా ఫేస్ కూడా చూడటం నీకు ఇష్టం లేదని నీ కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది……… !! కానీ ఇన్నేళ్ల తర్వాత ఈరోజు నన్ను చూసినప్పుడు కూడా నీ కళ్లలో నా మీద ఎలాంటి ఎమోషన్ కనిపించలేదు కనీసం నా మీద ప్రేమ లేకపోయినా కోపం మాత్రం అలానే ఉండిపోయింది……….. !! నా మిస్టేక్ వల్ల నువ్వు ఎంత పెయిన్ తీసుకున్నావో నాకు తెలుసు ……… !! అందుకే నువ్వు నాకు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను బికాస్ ఐ డెజర్వ్ ఇట్ ………. !! అలా తన ఆలోచనల్లో మునిగి ఉన్న అర్జున్ కళ్లల్లోకి దూరంగా కారిడార్‌లోని బెంచ్ దగ్గర కూర్చుని ఉన్న శ్రేయస్ కనిపించాడు………. !!
అరే ఈ చోటా బాంబ్ ఆరోజు వైజాగ్ బీచ్‌లో చూసిన బాబే కదా ……..!! వీడు మన స్కూల్లోనే చదువుతున్నాడా? వాట్ అ కోయిన్సిడెన్స్ అని అనుకుని చిన్న చిరునవ్వుతో వాడి దగ్గరకు నడిచాడు………. !! పిల్లలతో లోకం మర్చిపోయి ముచ్చట్లు పెడుతూ బాక్స్‌లో ఉన్న టిఫిన్ చాలా నెమ్మదిగా తింటున్న శ్రేయస్ దగ్గరకు వెళ్లాడు అర్జున్……… !!
హాయ్ పుట్టీ అంటూ పక్కనే మోకాళ్లపై కూర్చుని విష్ చేశాడు అర్జున్…….. !!
శ్రేయస్ వెంటనే తన తల తిప్పి అర్జున్ వైపు చూస్తూ………. !! హేయ్ హాయ్ అంకుల్ నేను పుట్టు కాదు ఐ ఆమ్ శ్రేయస్ నన్ను అలా పిలవొద్దు అన్నాడు ముద్దుముద్దుగా……… !!
అచ్చా! ఓకే… ఐ యామ్ వెరీ సారీ బాబా నేను మర్చిపోయి అనేశాను అంటూ ………. !! అర్జున్ చిన్నగా నవ్వి శ్రేయస్ పక్కనే కూర్చుని శ్రేయస్‌ను లేపి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు…….. !! యూ నో వాట్ శ్రేయస్ చిన్న పిల్లలు బ్రేక్ఫాస్ట్ త్వరగా కంప్లీట్ చేయాలి అప్పుడే చాలా స్ట్రాంగ్ అవుతారు లైక్ సూపర్ హీరోస్ లాగా …….. !!
శ్రేయస్ తన చిన్న వేళ్లను అర్జున్ షర్ట్ బటన్‌పై తిప్పుతూ స్ట్రాంగ్ అంటే బాహుబలిలానా అంకుల్…….. ?? అని ఇన్నోసెంట్ గా అడిగిన శ్రేయస్ మాటలకు పక్కనే ఉన్న మిగతా పిల్లలంతా గట్టిగా నవ్వేశారు. ……… !! వీటికి ఇంకా సరిగ్గా మాట్లాడటం రాదు సర్ అన్నీ తప్పులే చెప్తాడు అని ఒక పిల్లాడు నవ్వుతూ అన్నాడు……… !!
దానికి అర్జున్ ఆ పిల్లాడిని కొప్పడుతూ హేయ్ డోంట్ టీజ్ హిమ్……… !! ఎందుకంటే వాడు ఇంకా చాలా చిన్న వాడే కదా హి ఈజ్ సో క్యూట్ అంటూ శ్రేయస్ రెండు బుగ్గలపైనా ఆప్యాయంగా ముద్దు పెట్టాడు……….. !!
దూరంగా పిల్లల క్లాస్‌రూమ్ విండో దగ్గర నిలబడి ఈ సీన్ మొత్తాన్ని చూస్తున్న నిత్య గుండె ఆగినంత పనైంది……….. !! కడుపులో ఎవరో నిప్పులు చల్లినట్టు అనిపించింది అసలు ఎవరితోనూ అంత త్వరగా ఇంటరాక్ట్ అవ్వని శ్రేయస్ ఇన్ఫాక్ట్ స్ట్రేంజర్ ని చూస్తేనే పారిపోయే తన కొడుకు ……….. !! అర్జున్ ఒడిలో అంత కంఫర్టబుల్ గా అంత చనువుగా కూర్చోవడం ఆమెకు అసలు నచ్చలేదు……….. !! ఒక్కసారిగా ఆమె మనసును విపరీతమైన భయం కమ్మేసింది……… !!
మై గాడ్ ఒకవేళ అర్జున్‌కి నిజం తెలిస్తే………?? తనకి నా బిడ్డ కావాలని అర్జున్ అనుకుంటే అప్పుడు నేనేం చేయాలి…….?? అతనికి ఉన్న డబ్బుకి, పవర్‌కి నేను నిలబడగలనా……..?? నో ఐ కాంట్ లాస్ట్ హిమ్ శ్రేయస్ లేకుండా నేను ఉండలేను అని వెంటనే పక్కనే ఉన్న ఆయాను పిలిచి ………. !! లక్ష్మి వెంటనే వెళ్ళి శ్రేయస్‌ను ఇక్కడికి తీసుకురా క్లాస్ టైమ్ అవుతోంది అని చెప్పు అని పంపిస్తుంది………. !! ఆయా అర్జున్ దగ్గరకు వెళ్లి సర్ మేడమ్ వాళ్ల అబ్బాయిని తీసుకురమ్మని చెప్పారు………..!! శ్రేయస్ రా బాబూ మమ్మీ పిలుస్తోంది………. !! అర్జున్‌కు శ్రేయస్ ను తన ఒడి నుంచి కిందకు దించడం అస్సలు ఇష్టం లేదు……… !! ఇద్దరి మధ్య ఏదో తెలియని అటాచ్‌మెంట్ అయినా సరే బలవంతంగా నవ్వుతూ బాబును కింద నిలబెట్టి ……… !! మరోసారి ప్రేమగా నుదుటిపై ముద్దాడాడు శ్రేయస్ కూడా అర్జున్ రెండు బుగ్గలపై ముద్దులు పెట్టి బై బై అంకుల్ ………. !! అని చెప్పి ఆయాతో నడుచుకుంటూ వెళ్లిపోయాడు……….. !! శ్రేయస్ వెళ్తున్న వైపే చూపు తిప్పకుండా చూస్తున్న అర్జున్ ఈ బాబుని చూస్తుంటే నా మనసులో ఎందుకు మా మధ్య ఏదో అటాచ్మెంట్ ఉందన్న ఫీల్ కలుగుతోంది……… ?? ఏదేమైనా ఈ ఊరికి వచ్చాక టూ గుడ్ థింగ్స్ జరిగాయి ఒకటి నా నిత్య మళ్లీ నా కంటపడింది సెకండ్ వన్ ఈ క్యూట్ కిడ్ పరిచయమయ్యాడు……….. !! ఇద్దరూ ఇదే స్కూల్‌లో ఉన్నారు కాబట్టి రోజూ వీళ్లతో టైమ్ స్పెండ్ చేయొచ్చు……… !!
పాపం శ్రేయస్ తన సొంత రక్తమే తన కడుపున పుట్టిన కొడుకే అన్న నిజం అర్జున్ కి తెలియదు…….. !! అందుకే ఆ పసివాడిని చూడగానే తండ్రిగా తన రక్తంలో పుట్టుకొస్తున్న ఆ అవ్యక్తమైన అనురాగాన్ని అతను కేవలం అట్రాక్షన్ అనుకుని పొరబడ్డాడు…….. !! స్టాఫ్ రూమ్‌కి వెళ్లి మరోసారి టీచర్లందరితో మాట్లాడదామని చూసిన అర్జున్‌కు అక్కడ నిత్య కనిపించలేదు దాంతో అతను కాస్త డిజప్పాయింట్ అయ్యాడు……… !! ఇట్స్ ఓకే… ఈరోజుకి ఇలా పారిపోయావు కానీ రేపటి నుంచి ఎవ్రీ డే నువ్వు నన్ను చూడాల్సిందే… నా ముందుకు రావాల్సిందే………… !! అని తన మనసుకు సర్ది చెప్పుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు………… !!
ఈ డెవలప్‌మెంట్స్ అన్నింటినీ గమనిస్తున్న హెడ్ మేడమ్ శ్రేయస్‌తో అర్జున్ అంత క్లోజ్‌గా మాట్లాడటం చూసి మురిసిపోయారు. ………. !! కానీ ఆ అనుబంధం వెనుక ఉన్న భయంకరమైన గతం కానీ శ్రేయస్ నిజానికి అర్జున్ కొడుకే అనే నిజం కానీ ఆమెకు కూడా తెలియదు…….!!
సాయంత్రం ఇంటికి వచ్చిన నిత్య మనసులో అల్లకల్లోలం రేగుతోంది………. !! హాల్లో కూర్చుని ఆలోచనల్లో మునిగిపోయిన ఆమెను మమ్మీ… ఓ మమ్మీ అంటూ పరుగెత్తుకొచ్చి పట్టుకున్నాడు శ్రేయస్……… !!
నిత్య శ్రేయస్ ను దగ్గరకు తీసుకుంటూ………. !! అప్పూ ఈరోజు స్కూల్లో ఒక అంకుల్ ఒడిలో కూర్చుని టిఫిన్ తింటున్నావు కదా ఆయన ఎవరు …….?? ఆయన నీతో ఏం మాట్లాడారు అని అడిగింది………. !!
నాకు కూడా తెలీదు మమ్మీ కానీ ఆ ఒడిలో కూర్చోబెట్టుకున్న అంకుల్ చాలా గుడ్………. !! నన్ను చాలా లవ్ చేశారు & చాక్లెట్ కూడా ఇస్తా అన్నారు అని అమాయకంగా చెప్పాడు శ్రేయస్……… !! ఆ మాటలు విన్న నిత్య గుండెలో ముల్లు గుచ్చుకున్నంత పనైంది……….. !! విధి ఎంత విచిత్రమైనదో కదా తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పెంచుకుంటున్న తన కొడుకు తన సొంత తండ్రినే అంకుల్ అని పిలుస్తున్నాడు……….. !! ఆమె కళ్లల్లో సుడితిరుగుతున్న కన్నీళ్లను లోపలికే అణచుకుంటూ కొడుకును తన ఒడిలో పడుకోబెట్టుకుంది………. !! అప్పూ… నీకు ఆ అంకుల్ ఇష్టమా? లేక నీ మమ్మీ ఇష్టమా …….. ?? అని కొంచెం ఇన్సెక్యూర్ గా అడిగింది…….. !! శ్రేయస్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తన చిన్న చేతులతో నిత్య మెడను చిట్టి చేతులతో చుట్టేస్తూ………. !! నాకు నా మమ్మీనే చాలా ఇష్టం మమ్మీ లేకపోతే నేను ఉండలేను………. !! అని ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు ఆ మాటలతో నిత్య మనసులోని భయం కాస్త తగ్గి, కొద్దిగా రిలీఫ్ ఫీల్ అయింది……… !!
ఇంతలో డోర్ తీసుకుని అక్కడికి రక్ష వచ్చింది…….. !!
ఏంటి నిత్యా… నన్ను స్కూల్లో అలా వదిలేసి వచ్చేశావు………..?? నీ కోసం నేను ఎంత వెతికానో తెలుసా అని అలకగా అడుగుతుంది……. !! హెడేక్‌గా ఉంది రక్షు అందుకే పర్మిషన్ తీసుకుని త్వరగా వచ్చేశాను & ఐ యామ్ సారీ అని సర్దిచెప్పింది నిత్య…….. !!
ఇట్స్ ఓకే వదిలేయ్ కానీ ఈరోజు స్కూల్‌కి వచ్చిన కొత్త ట్రస్టీ అర్జున్ భట్టాచార్య సర్ ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నారో చూశావా………?? వాట్ ఏ పర్సనాలిటీ అసలు ఆ హైట్, ఆ రాయల్ లుక్, ఆ హెయిర్‌స్టైల్ అబోవ్ ఆల్ హిస్ స్మైల్! ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ పర్ఫెక్ట్………. !!! ఇప్పటికే మన స్కూల్లోని అన్ మ్యారీడ్ టీచర్స్ అంతా ఆయన అటెన్షన్ డ్రా చేయడానికి ప్లాన్స్ వేస్తున్నారు తెలుసా …….?? అని రక్ష చాలా ఎగ్జైట్‌మెంట్‌తో చెప్పింది…….. !!
ఆ మాట వినగానే నిత్య గంభీరంగా మారిపోయింది…….. !!
రక్షు… ఎవరు ఏమైనా చేసుకోనివ్వు కానీ నువ్వు మాత్రం ఆ మనిషికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది……… !! అని చాలా స్ట్రిక్ట్‌గా చెప్పింది…….. !!
రక్ష ఆశ్చర్యపోతూ ఎందుకు నిత్య………?? ఆయన అంత చార్మింగ్‌గా, పద్ధతిగా మాట్లాడ్తుంటే నువ్వేంటి అలా అంటున్నావు ………. ??
ల్యాకింగ్ క్యారెక్టర్ రక్ష! లుక్స్ ఒక్కటే ఉంటే సరిపోదు……… !! గుణం కూడా ఇంపార్టెంట్ నీకు అంతకంటే మంచి అబ్బాయి దొరుకుతాడు లే………. !!
అదేంటి నిత్య అంత మాట అనేశావు……..?? ఆయన క్యారెక్టర్ బ్యాడ్ అని నీకెలా తెలుసు ఆయన నీకు పర్సనల్‌గా తెలుసా ఏంటి……..?? ఆయన్ని చూస్తుంటే చాలా జెంటిల్‌మెన్‌లా అనిపిస్తున్నారు …….. !!
జస్ట్ స్టాప్ ఇట్ రక్ష ఒకసారి చెప్పింది విను……… !! ప్రొఫెషనల్‌గా ఉండు అంతకుమించి ఆ మనిషితో పర్సనల్ రిలేషన్స్ వద్దు దట్స్ ఇట్………. !!
నిత్య కోపాన్ని చూసి రక్ష కాస్త వెనక్కి తగ్గి ఓకే ఓకే……!! కూల్ యార్ ఎందుకు అంత హైపర్ అవుతావు……..?? సరే ఆ టాపిక్ వదిలేయ్ లీవ్ ఇట్ అని చెప్పి కాసేపు మాట్లాడి వెళ్లిపోయింది…….. !! ఆ రాత్రంతా నిత్యకు నిద్రపట్టలేదు అర్జున్ మైండ్‌లో ఏం ఉందో నెక్స్ట్ అతను ఎలాంటి మూవ్ తీసుకోబోతున్నాడో అని భయంతో తనకు నిద్ర రాలేదు…….. !! మరుసటి రోజు ఉదయం స్కూల్‌లో అర్జున్ కనపడలేదు దాంతో నిత్య కాస్త రిలీఫ్‌గా ఫీలయ్యింది………… !! కానీ ఆ ప్రశాంతత ఎక్కువ సేపు నిలవలేదు ఎందుకంటే మధ్యాహ్నానికల్లా అర్జున్ కార్ స్కూల్ లోకి వచ్చింది………. !! అతను రాగానే మేనేజ్‌మెంట్‌తో మీటింగ్ పెట్టి టీచర్లందరి టైమ్‌టేబుల్ మార్చాలని ఆర్డర్ వేశాడు……..!! తను స్కూల్‌కి వచ్చే టైమ్‌కి నిత్యకు ఫ్రీ పీరియడ్ ఉండేలా ఆమెతో మాట్లాడటానికి స్కోప్ ఉండేలా స్కెచ్ వేశాడు……… !!
అదే రోజు మధ్యాహ్నం రక్షను ప్రిన్సిపాల్ రూమ్‌కి పిలిపించాడు అర్జున్…….. !! ఆమెతో చాలా ప్రొఫెషనల్‌గా, కేజువల్‌గా మాట్లాడాడు……… !! పాత స్కూల్‌లో మీ ట్రాక్ రికార్డ్ బాగుంది & ఇక్కడ కూడా అదే డెడికేషన్‌తో వర్క్ చేస్తారని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ Miss రక్ష అని చెప్పి……… !! కాసేపు ఆగి బై ద వే మీతో పాటు ఇంకొక టీచర్ జాయిన్ అయ్యారు కదా నిత్య గారు రైట్ ఆమెను కూడా ఒకసారి నా కేబిన్‌కి పంపించండి అని చెప్పాడు……… !!
రక్ష బయటకు రాగానే నిత్య దగ్గరకు వెళ్లి అర్జున్ తనను రమ్మన్నాడు అని చెప్పగానే ఎందుకు రమ్మన్నారు ……… ?? అని అడిగింది…… !! ఏం లేదు నిత్య జస్ట్ పాత స్కూల్ పర్ఫార్మెన్స్ గురించి అడిగారు అంతే………. !! నిన్ను రమ్మంటున్నారు వెళ్లి మాట్లాడు అని అంది రక్ష……… !! తప్పక కేబిన్ దగ్గరకు వెళ్లి లోపలికి తొంగిచూసింది నిత్య……… !! అర్జున్ ను చూడగానే గుండె కొట్టుకోవడం వేగమైంది……… !!
మే ఐ కమ్ ఇన్ సర్ ……..??
అర్జున్ తన చైర్‌లో తిరుగుతూ…….. !! ఎస్… ప్లీజ్ కమ్ ఇన్…… !!
నన్ను రమ్మన్నారట… !! ఏంటి విషయం సర్ అని అడుగుతూ లోపలికి వచ్చి టేబుల్‌కి కొంత దూరంలో నిలబడింది……… !! ఆమె వైపు ప్రేమ, ఆరాధన, పశ్చాత్తాపం కలగలిపిన చూపులతో చూస్తూ అర్జున్ చైర్ వైపు చేయి చూపించాడు…….. !!
కూర్చో బుజ్జి అన్నాడు మెల్లగా……. !!
నిత్య క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతని కళ్లల్లోకి సీరియస్ గా చూస్తూ……. !! ఎక్స్క్యూస్మీ సర్ నా పేరు బుజ్జి కాదు కాల్ మీ నిత్య ప్లీజ్ ప్రొఫెషనల్ స్పేస్‌లో ఉన్నాం నన్ను మిస్సెస్ నిత్య అని పిలిస్తే బెటర్ అని కోపంగా చెప్పింది……… !! అర్జున్ ఆమె సీరియస్‌నెస్‌ని పక్కనపెట్టి డెస్క్ మీద ఉన్న ఆమె జాయినింగ్ డ్యాక్యుమెంట్‌ను చేతిలోకి తీసుకుని చూపిస్తూ…….. !!
దెన్ వాట్ ఈజ్ దిస్? ఇందులో ఉంది ఏంటి…….. ??
చూడండి సర్ ఆ ఐడెంటిటీ డాక్యుమెంట్స్‌లో ఏ పేరు ఉన్నా నాకు అనవసరం……… !! ప్రెజెంట్‌గా సొసైటీలో, నా ప్రొఫెషన్‌లో నేను నిత్యను మాత్రమే అని కోపంగా చెప్పింది……… !! నో నిత్య అది కుదరదు నువ్వు ఎంత దాచాలని చూసినా నువ్వు నా శ్రీజవి! నా బుజ్జి వి! ఈ అప్లికేషన్‌లో నీ ఒరిజినల్ నేమ్ ‘శ్రీజ’ అనే ఉంది కదా……..?? సో మై క్వశ్చన్ ఈజ్ వై దిస్ డిస్టెన్స్ శ్రీమతి శ్రీజ అర్జున్ భట్టాచార్య అని అనగానే…….. !! నిత్య వెంటనే తన అరచేతిని అడ్డంగా పెట్టి వార్నింగ్ ఇస్తున్నట్లుగా స్టాప్ ఇట్ అర్జున్ ఐ యామ్ జస్ట్ శ్రీజ లేదా నిత్య……….. !!
నాకు అర్జున్ భట్టాచార్య అనే పర్సన్‌తో ఎలాంటి రిలేషన్‌షిప్ లేదు హి ఈజ్ ఎ కంప్లీట్ స్ట్రేంజర్ టు మీ …….. !! అర్జున్ తన సీట్ నుంచి లేచి నిత్య ముందుకు వచ్చి ప్లీజ్ బుజ్జి డోంట్ బి సో క్రూయెల్……..!! నన్ను కొట్టు, తిట్టు నీ కోపాన్ని నా మీద చూపించు కానీ ఇలా పరాయివాడిలా మాట్లాడి నా మనసుని చంపేయకు………. !! ఐ నీడ్ యు నాకు నువ్వు మళ్లీ కావాలి మనం పాత రోజుల్లోలా మళ్లీ కలసి ఉందాం ప్లీజ్ అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు………. !! అర్జున్ మాటలు విన్న నిత్య మొహంలో ప్రేమ లేదు కేవలం అసహ్యం, నవ్వు మాత్రమే కనిపించాయి……. !! దాంతో నవ్వుతూ వావ్! ఎంత బాగా మాట్లాడ్తున్నారు సర్! ఎందుకు…?? మీకు బయట ఇంకే కొత్త అమ్మాయి దొరకలేదా లేదా మీ పెద్ద ఇంట్లో పనులు చేయడానికి, మీ అవసరాలు తీర్చడానికి మనుషులు తక్కువయ్యారా……..?? అందుకే మళ్లీ నన్ను వెతుక్కుంటూ వచ్చారా బట్ సారీ సర్ ఇప్పుడు ఆ నిత్య లేదా శ్రీజ పాత పసిపాప కాదు……… !! నాకు కొంచెం బుద్ధి వచ్చింది గతంలో చేసిన తప్పుల వల్ల లైఫ్‌లో పెద్ద లెసన్ నేర్చుకున్నాను……….. !! మళ్లీ అదే పిచ్చి పని చేయను అని కోపంగా చెయ్యి విదిలించుకుంది………. !!
మీ ఈ కలర్‌ఫుల్ అట్రాక్టివ్ వర్డ్స్‌కి మళ్లీ మిమ్మల్ని నమ్మి మీ వెనకాల వచ్చేస్తానని అనుకుంటే……… !! యు ఆర్ కంప్లీట్లీ రాంగ్ దయచేసి ఆ ఇల్యూజన్స్ వదిలేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి……. !! నిత్య మాటలకు అర్జున్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఐ అగ్రీ విత్ యూ నిత్య ఐ యామ్ ఎ డర్టీ క్యారెక్టర్! కానీ ప్లీజ్ గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్…….!! నువ్వు ఏది చెప్తే అది వింటాను ఇక ఎప్పుడూ నీ కళ్లలో నీళ్లు రానివ్వను……… !! ఐ స్వైర్ ఇక ఎప్పుడూ తాగాను & నీకు నచ్చని ఏ ఒక్క పనీ చేయను……… !! నువ్వు నన్ను వదిలేసి వెళ్లాక ఇన్నేళ్లు పిచ్చివాడిలా అయిపోయాను నిత్య……… !!
ఇండియాలో నిన్ను వెతకని సిటీ లేదు నీ నమ్మకాన్ని పోగొట్టుకున్నాను & మన కడుపున పుట్టాల్సిన బిడ్డను కూడా కోల్పోయేలా చేశాను……… !! అన్నీ నా మిస్టేక్సే! నువ్వు నన్ను మర్డర్ చేసినా నేను భరిస్తాను అని బాధతో అన్నాడు……… !! ఆ మాటలు వినగానే నిత్య మైండ్‌లో అంటే… నా కొడుకు బతికే ఉన్నాడనే నిజం, శ్రేయస్ తన సొంత బిడ్డే అనే మ్యాటర్ ఈయనకు అస్సలు తెలీదన్నమాట …….. !! అని మనసులో అనుకుంటూ ఆ నిజం ఎప్పటికీ అతనికి తెలియకూడదని ఫిక్స్ అయ్యింది. ……. !! వెంటనే తన బ్యాగ్‌లోంచి ముందే రాసి తెచ్చుకున్న రేసిగ్నేషన్ లెటర్‌ను తీసి అతని టేబుల్‌పై పెట్టింది……… !! దాన్ని చదివిన అర్జున్ ముఖంలో ఒక్కసారిగా తీవ్రమైన కోపం, ఇన్సెక్యూరిటీ క్లియర్ గా కనిపిస్తాయి……… !! కానీ నిత్య మాత్రం అతని వైపు చూస్తూ రెక్లెస్ గా నవ్వింది ఆమె నవ్వును చూస్తూ అర్జున్ కూడా మెల్లగా నవ్వడం మొదలుపెట్టాడు……… !! ఆ నవ్వు వెనుక ఉన్న అర్థం ఏంటో తెలియక నిత్య క్వశ్చనింగ్‌గా చూసింది……… !!
అప్పుడు అర్జున్ తన డెస్క్ తెరిచి ఆమె జాయిన్ అయినప్పుడు సైన్ చేసిన టూ ఇయర్స్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ తీసి టేబుల్‌పై పెట్టాడు…….!!
రీడ్ దిస్ క్లాజ్ నిత్య ఈ అగ్రిమెంట్ ప్రకారం నువ్వు మినిమం 2 ఇయర్స్ ఈ ఇన్సిట్యూషన్‌లో వర్క్ చేయాలి……….. !! ఒకవేళ మధ్యలో బ్రేక్ చేస్తే యు హావ్ టు పే 20 లాక్స్ కాంపెన్సేషన్ లేదా లీగల్ యాక్షన్ ఫేస్ చేయాలి………. !! ఓన్లీ మేనేజ్‌మెంట్ ఐ మీన్ నాకు మాత్రమే నిన్ను టెర్మినేట్ చేసే రైట్ ఉంది అని అర్జున్ కూల్ గా చెప్తాడు……… !! అంతా చదివిన నిత్య కాళ్లు చేతులు ఆడక అక్కడే ఉన్న చైర్‌లో కూలబడింది…….. !!
అర్జున్ గ్లాస్ వాటర్ ఆమె ముందుకు జరిపాడు ఆ నీళ్లను ఒక్క గుక్కలో తాగేసి కళ్లలో నిప్పులు చెరుగుతూ అర్జున్ వైపు చూసింది………. !!
కంప్లీట్గా లాక్ చేసావ్ కదా నన్ను……… ?? నేను ఉన్న కండిషన్‌లో అంత అమౌంట్ పే చేయలేనని నా పిల్లాడిని తీసుకుని ఇంకో ప్లేస్‌కి పారిపోలేనని మీకు బాగా తెలుసు……… !! ! అందుకే ఈ మైండ్ గేమ్స్ అని మనసులో అనుకుంటూ సైలెంట్ అయిపోయింది…….. !!
అర్జున్ ఆమె పక్కనే మోకాళ్లపై కూర్చుని ఆమె చేతిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ………. !! నిన్ను హర్ట్ చేయాలని నా ఉద్దేశం కాదు బుజ్జి మళ్లీ నిన్ను ఎక్కడ లూజ్ అవుతానో అన్న భయంతోనే ఇది చేశాను……….!! ఐ లవ్ యు సో మచ్ నిత్య అనగానే……… !! ఆ మాట వినగానే నిత్యలో ఇన్నాళ్లూ దాచుకున్న ఆక్రోశం ఒక్కసారిగా బద్దలైంది………. !! ఆమె లేచి నిలబడి అసహ్యంగా చూస్తూ…….. !! లవ్? డోంట్ యూజ్ దట్ వర్డ్ అర్జున్ భట్టాచార్య! మీ ప్రేమేంటో నాకు బాగా ఎక్స్‌పీరియన్స్ అయింది ………. !! ఇన్ని డ్రామాలు, ఈ అగ్రిమెంట్ పొలిటిక్స్ ఎందుకు డైరెక్ట్‌గా ఆఫర్ ఇచ్చేయండి ఎన్ని నైట్స్‌కి? ఎన్ని డేస్‌కి? ఎన్ని మంత్స్‌కి నేను మీకు కావాలి అనగానే అర్జున్ షాక్‌తో ఆమె వైపు చూశాడు…….. !!
నిత్య ఆగకుండా కంటిన్యూ చేస్తూ అప్పుడు ఒక ఇయర్ పాటు లవ్ అనే నేమ్‌తో నన్ను వాడుకున్నారు……… !! ఇప్పుడు క్లియర్‌గా చెప్పండి ఎన్ని రోజులకు నా బాడీ కావాలి మీకు………?? ఎంత రేట్ మాట్లాడారు……… ??
ఆ మాట పూర్తి కాకముందే ఫట్ అనే శబ్దం అర్జున్ చెయ్యి ఆమె చెంపపై బలంగా పడింది………. !! కేబిన్ అంతా ఆ దెబ్బ శబ్దంతో మ్రోగిపోయింది అంత పెద్ద దెబ్బ తగిలినా నిత్య కంటతడి పెట్టలేదు……….. !! ఎర్రబడిన తన చెంపపై చేయి వేసుకుని అతని కళ్లలోకి చూస్తూ హ్మ్ !! మీ చేతిలో దెబ్బలు తినడం నాకేం కొత్త కాదు అర్జున్ హింస, దెబ్బలు, బూతులు ఇవన్నీ నా లైఫ్‌కి ఇంట్రడ్యూస్ చేసిందే మీరు కదా ………. !!
అది వినగానే అర్జున్ చేతులు వణుకుతున్నాయి ఐ యామ్ సారీ బుజ్జి నేను……?
ఎందుకు సర్? అంత కోపం వస్తోంది ……… ?? ఆరోజు నా మొహాన మీరు కొట్టిన వర్డ్స్ ఇప్పుడు నేను మీకు తిప్పి చెప్తున్నాను అంతే గుర్తుందిగా ఆ రాత్రి మీరు అన్న మాటలు అంటూ……… !! నిత్య అతని దగ్గరకు జరిగి అతని కళ్లల్లోకి చూస్తూ నీ మీద నాకేం లవ్ లేదు ఏదో చూడటానికి కలర్‌ఫుల్ గా ఉన్నావు ………. !! మంచి ఫిగర్ అండ్ స్ట్రక్చర్ ఉందని ఆశపడ్డాను & అనుభవించాను ……… !! ఇప్పుడు ఆ మోజు తీరిపోయింది డబ్బులిస్తే బ్రోతల్ హౌస్‌లో కూడా రోజూ సుఖం ఇస్తారు ……… !! అని నా మొహాన డబ్బులు విసిరి కొట్టారు కదా సర్ మీ ఓన్ డైలాగ్స్ ని నేను మీకు రీవైండ్ చేశాను అంతే…….. !! దానికి ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్??
నిత్య అంటున్న ఒక్కో మాటకి అర్జున్ గుండె ఆగినంత పనైంది తను గతం లో చేసిన పాపం అతని ముందుకు వచ్చి నిలబడింది………. !!
నిత్య డోర్ వైపు నడుస్తూ……… !! ఎనీవేస్ ఇంకా ఎన్ని రోజులు నన్ను మీ కీప్‌గా పెట్టుకోవాలనుకుంటున్నారో డిసైడ్ చేసి రేపు రేట్ చెప్పండి సర్ ……… !! అని అసహ్యంగా చూసి కేబిన్ డోర్ గట్టిగా వేసి బయటకు వెళ్లిపోయింది………. !! ఆమె వెళ్లిన వైపే శూన్యంలోకి చూస్తూ అలాగే ఉండిపోయాడు అర్జున్ భట్టాచార్య……. !! అతని కళ్ల నుంచి కన్నీళ్లు కారి చెంపలపై నుంచి కింద పడుతున్నాయి………. !! నాకిలానే అవ్వాలి ఆరోజు రాక్షసుడిలా మారి నేను తన మనసుకి ఎంత నరకం చూపించానో ఈరోజు తను నన్ను ఎంత అసహ్యించుకున్నా తప్పు లేదు…….. !!
అందుకు క్షమించు అని అడిగే అర్హత కూడా నాకు లేదు అని తన కుడిచేతి వైపు చూసుకున్నాడు………. !! ఈ చేతితోనే కదా ఈరోజు మళ్లీ తనపై చెయ్యి చేసుకుంది అనుకుంటూ……… !! టేబుల్ మీద నిత్య తాగి వదిలేసిన గాజు గ్లాస్‌ను తన కుడిచేతితో బలంగా పిడికిలి బిగించి పగలగొట్టాడు…….!! గ్లాస్ ముక్కలు గుచ్చుకుని, పిడికిలి నుంచి రక్తం ధారగా కారుతున్నా ఆ బాధ అతని గుండెల్లో రగులుతున్న మంట ముందు చాలా తక్కువ……….. !! అలాగే రక్తం కారుతున్నా కూర్చుండిపోయాడు అర్జున్ భట్టాచార్య………. !!!
కొత్త కథ మొదలైంది……….!! కొత్త క్యారెక్టర్స్ మీ ముందుకొచ్చారు… కానీ ఈ కథ నిజంగా స్పెషల్ అవ్వాలంటే మీ అభిప్రాయం కూడా ఇందులో ఉండాలి………!! 🥰
మొదటి ఎపిసోడ్ చదివాక మీకు ఏం అనిపించింది……..?? 👀
హీరో క్యారెక్టర్ ఎలా అనిపించింది? హీరోయిన్ మీకు కనెక్ట్ అయ్యిందా? ❤️
కథలో మీకు బాగా నచ్చిన సీన్ ఏది?
ఇక ముందు కథ ఎలా ఉండబోతుందని మీరు ఊహిస్తున్నారు? 🤔✨
మీకు నచ్చిన విషయాలే కాదు… నచ్చని విషయాలు కూడా మాతో చెప్పండి. ఎందుకంటే మీ ఓపెన్ ఫీడ్‌బ్యాక్ వల్లే కథను ఇంకా ఆసక్తికరంగా, ఇంకా మీకు నచ్చేలా తీసుకెళ్లగలం………. !!🫶
మేము కథ రాస్తాం… కానీ ఆ కథకు ప్రాణం పోసేది మీ కామెంట్స్, మీ ప్రేమ, మీ సపోర్ట్……….!!❤️
అందుకే కథ చదివి సైలెంట్‌గా వెళ్లిపోకుండా…
మీ మనసులో ఉన్న ఒక్క మాటైనా కామెంట్‌లో వదిలి వెళ్లండి……….!! 💬🥹
మీ ఒక్క కామెంట్ కోసం కూడా మేము వెయిట్ చేస్తుంటాం……….!!❤️
మరి చెప్పండి… మన కొత్త కథ మీ హృదయానికి ఎంతవరకు చేరుకుంది…….?? ✨
Swipe left/right or tap the sides to turn pages