ప్రేమ దూరమైన తర్వాత 💔 – 5
నిత్య అన్న మాటలకు అర్జున్ తట్టుకోలేక తన చేతిలోనే ఉన్న గ్లాస్‌ను గట్టిగా పిడికిలితో బంధించాడు……… !! గ్లాస్ పగిలి గాజు పెంకులు దిగి చేతిని చీల్చి రక్తం కారుతున్నా ఆ గాయం కంటే నిత్య అన్న మాటకే అర్జున్ మనసుని ఎక్కువ గాయ పరుస్తున్నాయి……… !! నిత్య వెళ్ళిన వైపే బాధగా చూస్తూ సృష్టి కి కాల్ చేసి జరిగిన విషయాలన్నీ చెప్పాడు అర్జున్ భట్టాచార్య……. !! అర్జున్ చెప్పేది విన్న సృష్టి చిన్నగా నిట్టూర్చి అన్నయ్య నువ్వు పదేపదే తప్పులు చేస్తున్నావు……… !! అసలు నిత్య మీద ఎందుకు హ్యాండ్ రైస్ చేశావు…….?? మిస్టేక్ నీ వైపు ఉన్నప్పుడు తనను పనిష్ చేసే రైట్ నీకు లేదు………. ?? ఏదైనా అవ్వనీ నువ్వు వీలైనంత త్వరగా తనతో నార్మల్‌గా మాట్లాడి నీలో నిత్య మీద ఉన్న ట్రూ లవ్ ని ఎక్స్‌ప్రెస్ చేయి……… !! అంతేగానీ నీ కోపానికి నీ బ్రెయిన్‌ని అప్పగించి మరోసారి నిత్యను నీ లైఫ్ లో నుంచి పర్మనెంట్ గా కోల్పోకు అని అర్జున్ కి అర్థమయ్యేలా చెప్తుంది……… !!
సృష్టి మాటలకు సరే సృష్టి నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఫోన్ కట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు……. !! నెక్స్ట్ డే అర్జున్ భట్టాచార్య తన కంపెనీ ఆఫీస్ వర్క్స్ త్వరత్వరగా ఫినిష్ చేసుకుని మధ్యాహ్నం టైమ్ కి స్కూల్‌కి వచ్చాడు………. !! క్లాస్‌రూమ్‌లో పిల్లలకు చాలా శ్రద్ధగా లెసన్ చెబుతున్న తన భార్య నిత్యను దూరంగా నిలబడి కళ్లనిండా చూసుకున్నాడు అర్జున్ ……… !! తన ముఖంలోని ఆ గంభీరత, కళ్లలోని ఆవేదన అర్జున్ మనసుని మరింత బాధ పెడుతున్నాయి. ……… !! తన క్యాబిన్ కేకే వెళ్లడానికి వెను తిరుగుతుండగా అర్జున్ కి శ్రేయస్ గుర్తొచ్చాడు…….. !! వెంటనే క్లాస్‌రూమ్స్ అన్ని తిరిగి శ్రేయస్ రూం అడిగి తెలుసుకుని తనను తన క్యాబిన్ కి తీసుకెళ్లాడు………. !! శ్రేయస్ చెప్పే ముద్దుముద్దు మాటలతో టైమ్ ఎలా గడిచిపోయిందో అర్జున్‌కు తెలియలేదు……… !! తనే స్వయంగా శ్రేయస్ కి చాక్లెట్ తినిపిస్తూ శ్రేయస్ చెప్పే ముద్దు ముద్దు మాటలు వింటున్నాడు……… !!
అంకుల్ నాకు ఒక మంచి Story చెప్పండి అని శ్రేయస్ క్యూట్ గా అడగడంతో అర్జున్ చిన్నగా నవ్వి………… !! చిన్న కథ చెప్పాడో లేదో శ్రేయస్ అర్జున్ ఒడిలోనే హాయిగా నిద్రలోకి జారుకున్నాడు………. !! నిద్రపోయిన శ్రేయస్ ను ఎంతో ప్రేమగా తన భుజంపై వేసుకుని వీపుపై మెల్లగా తడుతూ రూమ్‌లో అటు ఇటూ తిరుగుతున్నాడు అర్జున్……… !! అంతలో స్కూల్ ఆయా బాబును తీసుకెళ్లడానికి రావడం తో బాబును ఆమెకు ఇవ్వడానికి వెళ్లిన అర్జున్ ………..!! శ్రేయస్ అర్జున్ మెడను గట్టిగా పట్టుకుని నిద్రపోతూ కనిపించాడు………. !! ఆ స్పర్శ అర్జున్‌కు ఏదో తెలియని అనుబంధాన్ని అందించింది……….. !!
దాంతో శ్రేయస్ ను జో కొడుతూ ఇట్స్ ఓకే ఉండనివ్వండి…….. !! నేనే పర్సనల్‌గా తీసుకెళ్లి శ్రేయస్ ను వదిలి పెడతాను అంటూ………!! ఆయాను బాబు పేరెంట్స్ గురించి డీటైల్స్ అడిగాడు………. !! అప్పుడే ఆయ ద్వారా బాబు మదర్ కూడా ఇదే స్కూల్లో టీచర్‌గా వర్క్ చేస్తోందని తెలుస్తుంది……… !!
ఓహో… ఈజ్ ఇట్? అయితే ఈవెనింగ్ వరకు బాబు ఇక్కడే ఉంటాడా……?? ఓకే నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి శ్రేయస్ ను తన దగ్గరే ఉంచుకున్నాడు అర్జున్ ………. !! క్లాస్ ఫినిష్ చేసుకుని తన కొడుకు ఉన్న రూమ్ దగ్గరకు వచ్చిన నిత్యకు అర్జున్ శ్రేయస్ ను తీసుకెళ్లాడని తెలిసి కోపం , భయం తనను చుట్టుముడతాయి ……… !! అర్జున్ కి శ్రేయస్ తన కొడుకే అనే నిజం తెలియదు కదా ………. !! జస్ట్ ఒక స్టూడెంట్ లాగే చూసుకని ఉంటాడు అని తన మనసుకు సర్దిచెప్పుకొని క్లాస్ టైం అవ్వటం తో అక్కడి నుంచి వెళ్లిపోయింది నిత్య…….. !!!
ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఏదో ఒక రీసన్ చెప్పి నిత్యను తన రూమ్‌కి పిలిపించుకుని మాట్లాడటం మొదలుపెట్టాడు అర్జున్…….. !!
మాట్లాడు నిత్య ఇంకెంతకాలం మన మధ్య ఈ డిస్టెన్స్ & ఏం డెసిషన్ తీసుకున్నావు………?? ఎప్పుడు నాతో మన ఇంటికి వస్తున్నావు మన 4 Years ప్రేమ ఇంకా పెండింగ్ లోనే ఉంది………… !! నువ్వు ఒక్క మాట ఎస్ అని చెప్తే చాలు మనం మళ్లీ పాత రోజుల్లాగే సంతోషంగా ఉండొచ్చు …,…. !!! నిత్య అసహనంగా చూస్తూ చూడండి మిస్టర్ అర్జున్ భట్టాచార్య నేను మీకు రిపీటెడ్‌గా చెప్తూనే ఉన్నాను……… !! Please leave me alone ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు………?? నా లైఫ్ లో ఉన్న పీస్ ని పూర్తిగా నాశనం చేయడానికే మళ్లీ వచ్చారా…….??
మీరే వద్దు అని నన్ను పంపించేసిన తర్వాత నేను మళ్ళీ మీ ఇంటికి ఎందుకు వస్తాను……?? నేను చనిపోయినా సరే మీ ఇల్లు అనే ఆ హెల్ కి మళ్లీ తిరిగి రాను & ఆ ఇంట్లో నేను అనుభవించిన అవమానం, కష్టాలు, మెంటల్ & ఫిజికల్ వైలెన్స్ ఆ నరకాన్ని నేను చనిపోయే వరకు మర్చిపోలేను…….. !!
ఇంకా మీరు మాట్లాడేది ఆ 4 ఇయర్స్ ఉన్న లవ్ గురించా…….. ?? అది నిజమైన లవ్ కాదు అర్జున్ కేవలం మీ ఈగో మరియు ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే అని నాకు బాగా తెలుసు…….. !! దానికి నేను మాత్రమే కావాల్సిన అవసరం ఏముంది……??
మీ అగ్రిమెంట్ ప్రకారం నేను ఈ స్కూల్‌ని 2 Years వరకు వదిలి వెళ్లలేను ఐ అగ్రీ కానీ మీతోనే ఉండాలని, మీ మాటలు వినాలని ఎక్కడా రాయలేదు లేదు కదా…….?? So please నా నుంచి వీలైనంత దూరంగా ఉండండి అని సీరియస్ గా చెప్తుంది……. !!
ఆమె మాటలకు అర్జున్ కళ్లలో నీళ్లు తిరిగాయి……. !! ఇట్స్ ఒకే నిత్య నీ కోపం, నీ అసహ్యం అంతా నేను భరిస్తాను……… !! నువ్వు నన్ను వదిలి వెళ్లిన తర్వాత నాకు బ్రతకాలి అనే హోప్ కూడా లేదు………. !! కానీ ఏదో ఒకరోజు నువ్వు నాకు దొరుకుతావనే ఆశ తోనే నేను ఇన్నాళ్లూ బతికాను………. !! ఇప్పుడు నువ్వు నా కళ్ల ముందే ఉన్నావు నీ ప్రేమ కోసం కోసం నేను ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను……… !! నువ్వు నాకు ఇచ్చే ప్రతీ పనిష్మెంట్ కి నేను రెడీ కానీ నేను వద్దు అని మాత్రం అనకు నిత్య అంటూ బాధగా ఆమె చేయి పట్టుకున్నాడు అర్జున్ ……. !!
అర్జున్ చేతిని విసిరికొట్టినట్టు విడిపించుకున్న నిత్య కోపంగా తన వైపు చూస్తూ……. !! Don’t dare to touch me అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి కోపంగా వెళ్లిపోతుంది…….. !!
అలా ఒక నెల రోజులు గడిచిపోయాయి……. !!
ప్రతిరోజూ అర్జున్ మధ్యాహ్నం స్కూల్‌కి రావడం శ్రేయస్ తో కొంతసేపు టైమ్ స్పెండ్ చేయడం……… !! ఏదో ఒక వర్క్ వంకతో నిత్యను తన రూమ్‌కి పిలవడం మళ్లీ తన జీవితంలోకి రమ్మని అడగడం & నిత్య ఎప్పటిలాగే అతనిపై కోపంగా రియాక్ట్ అయి అక్కడి నుంచి వెళ్లిపోవడం………… !! ఇదే డెయిలీ రొటీన్ గా మారిపోయింది …………….. !!
స్కూల్లోని కొంతమంది టీచర్స్ ఇదంతా గమనించడం మొదలుపెట్టారు……… !! తాము ఎంత ట్రై చేసినా మినిమం డిస్టెన్స్ మైంటైన్ చేసే అర్జున్ ……… !! పెళ్లయి ఒక బిడ్డ కూడా ఉన్న నిత్యతో మాత్రం పదేపదే ఎందుకు పర్సనల్ గా మాట్లాడుతున్నాడనే విషయం వాళ్లకు అర్థం కావడం లేదు……… !! అది చూసి కొందరు టీచర్లకు నిత్య మీద జెలస్ స్టార్ట్ అయింది…….. !! ఒకరోజు స్కూల్లో చిన్న స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేశాడు అర్జున్……… !! స్కూల్‌కి మరో రెండు ఎక్స్ట్రా క్లాస్ పెట్టాలనే ప్రపోజల్ పై అందరి ఒపీనియన్స్ తెలుసుకోవడానికి ఆ మీటింగ్ పెట్టాడు…….. !!
అందరూ తమ తమ ఐడియాస్ చెప్తుండగా సైలెంట్‌గా ఒక వైపు కూర్చున్న నిత్య వైపు చూసిన అర్జున్………. !! మిస్ నిత్య మీరు కూడా మీ ఒపినియన్ చెప్పండి & మీరు చాలా టాలెంటెడ్ అని పిల్లలకు ఎంతో ఇష్టమైన టీచర్ అని విన్నాను……… !! పిల్లలకు మరింత కంఫర్టబుల్ గా ఉండేలా మీలాంటి ఎఫిషియెంట్ టీచర్ సలహా ఇస్తే బాగుంటుంది…….. !!
స్కూల్‌కు కొత్త క్లాసెస్ విషయంలో మీ సజెషన్ అని అర్జున్ అంటుండగానే ………. !! నిత్య నోరు విప్పేలోపే పద్మ అనే టీచర్ మాట్లాడుతూ సారీ సర్ తను మిస్ నిత్యా కాదు Mrs. నిత్య…..!! తనకు ఆల్రెడీ పెళ్లయింది అంతే కాదు ఒక కొడుకు కూడా ఉన్నాడు………. !! పాపం తన హస్బెండ్ ఇక్కడ ఉండరు, ఆర్మీలో వర్క్ చేస్తున్నారట అంటూ చాలా వెటకారంగా నవ్వుతూ చెప్తుంది…….. !! పద్మ మాటల్లోని ఇంటెన్షన్ అర్థమైన అర్జున్‌కు అవమానంగా అనిపించింది & అలాగే నిత్య తన మారిటల్ స్టేటస్ గురించి అందరికీ అబద్ధం చెప్పిందా అని నిత్య మీద కోపం వచ్చింది…… !! నాకు దూరంగా ఉండటానికి తన గురించి అబద్ధం చెప్తుందా & దీని గురించి లోతుగా ఎంక్వైరీ చేయాలి అని మనసులో అనుకున్నాడు………. !!
అయినా సరే ఆ క్షణంలో పైకి మాత్రం సిచుయేషన్ ని బ్యాలెన్స్ చేయడానికి నార్మల్‌గానే మాట్లాడాడు…….. !! కానీ సూటీగా చూస్తున్న అర్జున్ చూపులు, గత కొద్దిరోజులుగా అనుభవిస్తున్న వల్ల మెంటల్ స్ట్రెస్ తో నిత్యకు తల తిరగడం మొదలైంది…………. !! దానిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ కుర్చీలో నుంచి లేచి రెండు అడుగులు వేసిందో లేదో ఒక్కసారిగా నిత్య కళ్లు తిరిగి కింద పడిపోయింది……….. !! పక్కనే ఉన్న రక్ష నిత్య ను గట్టిగా పట్టుకుని నిత్య…. నిత్య ఏమైంది నీకు అని కంగారుగా పిలుస్తున్నా నిత్య నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు…….. !! అందరూ టెన్షన్ గా ఏమైంది? ఏమైంది అంటూ నిత్య చుట్టూ చేరారు…….. !! అది చూసిన అర్జున్ కి గుండె ఆగినంత పనైంది అంతే క్షణం ఆలస్యం చేయకుండా నిత్య దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు……..!!
గో బ్యాక్ తనను గాలి ఆడట్లేదు కొంచెం దూరం జరగండి …….. !! అని అందరినీ పక్కకు తోసేసి నిత్యను తన ఒడిలోకి తీసుకుని తన ముఖంపై కొద్దిగా నీళ్లు చల్లి స్పృహలోకి తీసుకురావడానికి ట్రై చేశాడు………. !! కళ్లు తెరవడానికి కష్టపడుతున్న నిత్య ముఖాన్ని ప్రేమగా తడుముతూ…….. !!
రక్షా… పక్కనే ఉన్న హాస్పిటల్ కి వెళ్దాం కమాన్ అని చెప్తూనే ……….. !! నిత్యను తన చేతుల్లోకి తీసుకుని కార్ వైపు వేగంగా ఎత్తుకెళ్లాడు…….. !!
అంత పెద్ద బిజినస్ మ్యాన్ స్కూల్ ఓనర్ అయిన అర్జున్ భట్టాచార్య ……….. !! ఒక నార్మల్ టీచర్ని అలా చేతుల్లో ఎత్తుకెళ్లడం చూసి అక్కడున్న పద్మ, శృతి వంటి టీచర్లకు అసూయ, ద్వేషం నూరిపోసినట్లయ్యాయి……….. !! హాస్పిటల్లో నిత్యను చెక్ అప్ చేసిన డాక్టర్ తను ఎందుకో బాగా స్ట్రెస్ కి గురవుతున్నారు & ఏదో విషయం గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నట్టుంది……. !! దట్ టూ ప్రాపర్ డైట్ తీసుకోవడం లేదు బాడీ చాలా వీక్ గా ఉంది………. !! కేర్ తీసుకోకపోతే మళ్ళీ పడిపోయే చాన్స్ ఉంది అని తనకు డైట్, మెడిసిన్స్ రాసిచ్చాడు డాక్టర్…….. !!
కొంతసేపటి తర్వాత బెడ్ మీద స్పృహలోకి వచ్చిన నిత్య ………. !! తన పక్కనే ఉన్న రక్షను చూసి రక్షూ ఏమైంది నాకు హెడ్ ఏక్ వచ్చి తల తిరిగినట్టు మాత్రమే గుర్తుంది అంది నీరసంగా…….. !! నిత్య ఎలా ఉంది ఇప్పుడు నీకు……..?? నువ్వు ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోతే మేమంతా ఎంత ప్యానిక్ అయ్యామో తెలుసా ……… ?? అర్జున్ సర్ నిన్ను స్పాట్లో ఉండడం వల్ల నన్ను జాగ్రత్తగా ఎత్తుకుని హాస్పిటల్‌కి తీసుకొచ్చారు……… !! నీ గురించి ఆయన ఎంత వర్రీ అయ్యారో నేను కళ్లారా చూశాను……… !! నువ్వేమో ఆయన చెడ్డవారు అని అంటుంటావు కానీ చూడు ఆపదలో నిన్ను కాపాడింది కూడా ఆయనే అని రక్ష చెప్పింది………. !!
రక్ష చెప్పింది విన్న వెంటనే బెడ్ మీద నుంచి లేచి కూర్చున్న నిత్య ……….. !! ప్లీజ్ రక్ష ఇక చాలు పద వెళ్దాం ఐ యామ్ ఫైన్ నౌ……… !! స్కూల్ టైమ్ కూడా అయిపోతోంది శ్రేయస్ ఒక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు …………. !! సరే నువ్వు కూర్చో నేను వెళ్లేముందు డాక్టర్ దగ్గర డిస్చార్జ్ స్లిప్ బిల్ తీసుకుని వస్తాను అని చెప్పి రక్ష బయటకు వెళ్ళింది…….. !!
రక్ష వెళ్లిన మరుక్షణమే రూమ్‌లోకి వచ్చిన అర్జున్ నిత్య పక్కన కూర్చుని …….. !! ఏంటి నిత్య ఇది ఎందుకిలా అయిపోయావు & ఎందుకు ప్రతీ చిన్న దానికి ఓవర్ థింకింగ్ చేస్తూ నీ హెల్త్ ని స్పాయిల్ చేసుకుంటున్నావు……….?? సరిగ్గా ఫుడ్ ఎందుకు తీసుకోవడం లేదు యు నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నిత్యా……… !! అర్జున్ మాటలు విన్న నిత్య పేలగా నవ్వుతూ సరిగ్గా ఫుడ్ తీసుకోవడమా ………?? అంటే ఎలా అర్జున్ భట్టాచార్య గారూ మీ ఇంట్లో నాకు అలవాటు చేసినట్టుగానా……….?? రోజుకి ఒక్క పూట భోజనం & అది కూడా కారం పొడి కలిపిన నీళ్లతో తినాలా? అలా తింటే నా హెల్త్ బాగుంటుందా………??
మీ ఇంట్లో దొరికే హీనమైన భోజనం కంటే ఇక్కడ నేను కష్టపడి సంపాదించుకునే ఒక్క ముద్ద అయినా ప్రశాంతంగా తింటున్నాను………!! నా లైఫ్‌లోకి మళ్లీ మీరు ఎంటర్ అయినప్పటి నుంచే నాకు ఈ స్ట్రెస్, ఈ నరకం మళ్లీ స్టార్ట్ అయ్యాయి అని నిత్య ఆక్రోశంతో చెప్తుండగానే రక్ష లోపలికి వచ్చింది……. !! రక్షను చూసి నిత్య తన వాయిస్ తగ్గించుకుని బిల్ ఎంత అయింది రక్షా అని అడుగుతుంది…….. !!
అది బిల్ ఆల్రెడీ అర్జున్ సర్ పే చేశారు నిత్యా ……… !! ఎంత అయిందో
తెలుసా అని చెప్పబోతుండగా అర్జున్ అడ్డుకుంటూ ఇట్స్ ఓకే అవన్నీ ఇప్పుడు అనవసరం…….!! పదండి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని చెప్పి వాళ్లను తన కారులో తీసుకుని వచ్చాడు……… !! కారు దిగగానే నిత్య తన హ్యాండ్‌బ్యాగ్ తెరిచి అందులో ఉన్న క్యాష్ తీసి అర్జున్ చేతిలో పెట్టడానికి ట్రై చేస్తూ………. !! ఈరోజు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయించినందుకు థ్యాంక్స్ ఇది మీ బిల్ అమౌంట్ అని చెప్పి వెళ్లబోయింది……… !! అర్జున్ ఆమె చేయి పట్టుకుని ఆ డబ్బును తీసుకోకుండా …….. !! నేను థర్డ్ పర్సన్‌కి ట్రీట్మెంట్ చేయించలేదు నిత్యా ఐ పెయిడ్ ఫర్ మై వైఫ్………!! నా భార్య కోసం ఖర్చు చేయడానికి నాకు పూర్తి హక్కు ఉంది సో ఈ మనీ నాకు అవసరం లేదు అన్నాడు గంభీరంగా…….. !!
నిత్య అతని కళ్లలోకి చూస్తూ చూడండి అర్జున్ ఇప్పుడైతే మీకు నా మీద మోజు ఉంది కాబట్టి అవసరం లేదనిపిస్తుంది…….. !! కానీ కొన్ని రోజుల తర్వాత నేను మీకు వద్దనిపించినప్పుడు నా మీద ఖర్చు చేసిన ప్రతీ ఒక్క రూపాయి గుర్తుచేసి…….. !! నా డబ్బు తిన్నావ్ అని మాటలతో నా గుండెలను గుచ్చుతారు……..!! ఆ రోజు రాకముందే నా అప్పు నేను తీర్చుకోవాలనుకుంటున్నాను అని ఏమాత్రం తగ్గకుండా సీరియస్ గా చెప్తుంది…… !! నిత్య మాటలకు అర్జున్ కళ్లలో నీళ్లు తిరిగాయి నిత్య నువ్వు పాత విషయాలను ఎప్పటికీ మర్చిపోవా ………?? ఇక నన్ను ఎప్పటికీ క్షమించవా అని బాధతో అడిగాడు………. !!
నిత్య ఏమీ మాట్లాడకుండా అర్జున్ చేతిలో అమౌంట్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది…….. !! అదే నైట్ నిద్రపోతున్న నిత్య కి ఆన్ నోన్ నంబర్ నుండి కాల్ రావడం తో అనుమానంగానే కాల్ లిఫ్ట్ చేసింది………. !! హాయ్ నిత్య డిన్నర్ చేశావా? మెడిసిన్స్ వేసుకున్నావా లేదా? చాలా సన్నగా అయిపోయావ్ కాస్త హెల్తీ ఫుడ్ తీసుకోవాలి నువ్వు అంటూ ………. !! అర్జున్ కేరింగ్‌గా మాట్లాడుతుండగానే నిత్య ఏమాత్రం ఆలోచించకుండా కాల్ కట్ చేసి ఆ నంబర్‌ను బ్లాక్ లిస్ట్ లో పడేసి పడుకుంటుంది……. !! నెక్స్ట్ డే స్కూల్‌కి వచ్చిన నిత్య, రక్షలకు స్టాఫ్ రూమ్‌లోని కొందరి టీచర్స్ బిహేవియర్ చాలా ఆడ్ గా అనిపించింది………. !! నిత్య స్వయంగా తనంతట తానుగా గుడ్ మార్నింగ్ అని విష్ చేసినా పద్మ, శృతిలు ముఖం తిప్పుకుని వెళ్ళిపోయారు………. !! లంచ్ బ్రేక్ లో టీచర్స్ కలిసి కూర్చున్నప్పుడు పద్మ కావాలనే మాట్లాడుతూ…….. !! అబ్బా ఎక్కడెక్కడి నుండి వస్తార్రా బాబు ఇలాంటి క్యారెక్టర్ లేని జనాలు ఇన్నాళ్లూ మన స్కూల్లో ఉన్న డిసిప్లిన్, మంచి ఆత్మాస్పియర్ అంతా స్పాయిల్ చేస్తున్నారు…….. !! మనం ఇంకా చూస్తూ ఊరుకుంటే మనకే ప్రమాదం ఐ థింక్ మేనేజ్మెంట్ వాళ్లకు వీళ్ల బిహేవియర్ పై ఒక కంప్లైంట్ ఇవ్వడం బెటర్ …….. !!
అదేంటి పద్మ మేడమ్ ……… !! తను ఆల్రెడీ మేనేజ్మెంట్ని, పెద్దవాళ్లని తన గుప్పిట్లో పెట్టుకున్నట్టుందిగా అని శృతి వెటకారంగా నవ్వుతూ అంటుంది. …… !! కరెక్టే శృతి మేడమ్ మనం ఎంత చెప్పుకున్నా వేస్ట్ ఈ అసహ్యాన్ని రోజూ చూడాల్సి వస్తోంది………… !! ఆ అర్జున్ సర్ మగాడు ఆయన పక్కన ఉంటే ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందని ఈమెకు బుద్ధి ఉండాలి కదా……..?? పెళ్లయి, ఒక కిడ్ ఉండి, హస్బెండ్ బోర్డర్లో కష్టపడుతుంటే………. !! ఇక్కడ రిచ్ పీపుల్ కి ట్రాప్ చేస్తుంది ఈవిడ ఛీ… వాట్ ఎ చీప్ క్యారెక్టర్ అని శృతి అసహ్యకరంగా నవ్వుతుంది……… !!
కొంతమంది టీచర్లు ముసిముసిగా నవ్వితే మరికొందరు గొడవ ఎందుకని సైలెంట్ గా ఉండిపోయారు………. !! ఆ మాటలన్నీ తన గురించే అని అర్థమైన నిత్య కళ్లలో నీళ్లు తిరిగాయి……… !! పక్కనే ఉన్న రక్ష మాత్రం కోపంతో ఒక్కసారిగా చేర్ వెనక్కి తోసి లేచి నిలబడింది…….. !! Just Stop it నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి & మీకు తోచినట్టు, నోటికొచ్చినట్టు మాట్లాడటానికి ఏముంది అక్కడ…….?? నడవలేని లేని నాలుక అని ఎలా పడితే అలా వాగుతారా అని రక్ష గట్టిగా అరిచింది………. !! మేమేం తప్పు మాట్లాడాం రక్షా మేడమ్? స్కూల్ ఎన్విరాన్మెంట్ని ఎవరు పాడు చేస్తున్నారో అందరికీ తెలుసు అని పద్మ సీరియస్ గా అంటుంది…….. !!
నో! మీరు మాట్లాడే ఈ చీప్ మైండ్ సెట్ వల్లే స్కూల్ అట్మాస్ఫియర్ పాడువుతోంది……..!! అసలు మీరు కూడా ఆడవాళ్లే కదా? ఇంకో విమెన్ క్యారెక్టర్ గురించి ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఇలా అసహ్యంగా మాట్లాడటానికి సిగ్గుగా లేదా మీకు …….. ?? అసలు నిత్య ఎం తెలుసని నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు ……… ??
ఫ్యాక్ట్స్ మాట్లాడితే సిగ్గు పడాలా……..?? అర్జున్ భట్టాచార్య సర్ రాగానే నిత్యను ప్రత్యేకంగా పిలవడం, ఈమె ఆయన రూమ్‌కి వెళ్లడం & నిన్న ఈవిడ కిందపడగానే ఆయన సొంత భార్యలా ఎత్తుకుని వెళ్లడం మేమంతా కళ్లారా చూశాం……..!! హ్యూమానిటీ పేరుతో ఇదంతా డ్రామా కాకపోతే ఏంటి అని శృతి కూడా పద్మ కి సపోర్ట్ చేస్తూ నిత్య ను టార్గెట్ చేస్తుంది…….. !!
ఛీ! ఒక మనిషి కళ్లు తిరిగి పడిపోతే హ్యుమానిటీ తో హాస్పిటల్‌కి తీసుకెళ్లడాన్ని కూడా మీరు ఇలాంటి డర్టీ యాంగిల్ లో చూస్తున్నారంటే మీ థింకింగ్ ఎంత దిగజారిందో అర్థమవుతోంది………!! మీకు అంత ప్రాబ్లెమ్ ఉంటే డైరెక్ట్‌గా అర్జున్ భట్టాచార్య సర్ దగ్గరకే వెళ్లి అడగండి………. !! అంత ధైర్యం లేక ఇక్కడ ఒక అమాయకురాలి దగ్గర మీ నోటికి వచ్చింది మాట్లాడుతున్నారా……….. ?? అని రక్ష గట్టిగా వార్నింగ్ ఇచ్చి నిత్య చేయి పట్టుకుని అక్కడి నుంచి బయటకు లాక్కొచ్చింది…….. !! రక్ష తో పాటు వాష్‌రూమ్‌కి వచ్చిన నిత్య రక్షను గట్టిగా కౌగలించుకుని గట్టిగా ఏడ్చేసింది నిత్య…….. !!
ఎవరూ నా వైపు ఫింగర్ పాయింట్ చేయకూడదని నా క్యారెక్టర్ గురించి ఎవరూ తప్పుగా మాట్లాడకూడదని ఇన్నేళ్లుగా ఎంత స్ట్రిక్ట్ గా, ఎంత కష్టపడి బతికానో తెలుసా రక్షూ……… !! ఈరోజు నా హానర్ అంతా స్పాయిల్ అయిపోయింది అని ఏడుస్తున్న నిత్యను రక్ష ఓదార్చింది……… !!
మధ్యాహ్నం వరకు ఎలాంటి క్లాస్ తీసుకోకుండా అర్జున్ కోసం కోపం & ఆవేశంతో ఎదురుచూస్తూ కూర్చుంది నిత్య…………… !!
ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది ఫ్రెండ్స్……?? ❤️
అర్జున్ – నిత్య మధ్య అసలు ఏం జరిగింది అని మీలో ఎవరైనా గెస్ చేశారా…..?? 👀🤔
వాళ్లిద్దరి మధ్య ఉన్న ఈ సీక్రెట్ ఏంటి అనుకుంటున్నారు……..?? 😍
మీ గెస్ ఏంటో కామెంట్లో చెప్పండి… మీ ఊహ ఎంతవరకు కరెక్ట్‌గా ఉందో చూద్దాం…….!! 😜❤️
అలాగే ఈరోజు ఎపిసోడ్లో మీకు బాగా నచ్చిన సీన్ ఏది? మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు? తప్పకుండా కామెంట్ చేయండి………!!💕
మీ ఒక్కో కామెంట్ మాకు ఇంకా మంచి ఎపిసోడ్స్ రాయడానికి చాలా మోటివేషన్ ఇస్తుంది…..!! 🥰✨
Swipe left/right or tap the sides to turn pages