“రియా… నువ్విక్కడ ఏం చేస్తున్నావ్?!”
ఆదిత్య గొంతులో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది.
రియా మాత్రం నవ్వుతూ అతని దగ్గరకు వచ్చింది.
“సర్‌ప్రైజ్! నిన్ను చూడాలని వచ్చాను.”
మేఘన ఇద్దరి వైపు చూస్తూ నిలబడింది.
“ఆదిత్య, మీ ఫియాన్సీ వచ్చారు. నేను లోపలికి వెళ్తాను.”
ఆమె వెళ్లబోతుండగా ఆదిత్య చేయి పట్టుకున్నాడు.
“ఒక్క నిమిషం. రియా, నువ్వు మేఘనతో ఏమన్నావ్?”
“నిజమే చెప్పాను కదా! మన పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడుతున్నారు.”
“రియా! మన పెళ్లి గురించి ఎవరు మాట్లాడారు? మనం ఎప్పుడూ అలాంటి నిర్ణయం తీసుకోలేదు.”
మేఘన అక్కడే ఆగిపోయింది.