శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో జరిగిన పూజ ముగిసిన మరుసటి రోజు మునసబు గారి ఇల్లంతా డిజే సౌండ్స్, రంగురంగుల ఎల్ఈడీ లైట్లతో ఒక పెద్ద ఈవెంట్ హాల్ లా మారిపోయింది. ఆ రోజే శివ, సాహిత్యల సంగీత్ వేడుక. చుట్టాలంతా కొత్త పట్టు బట్టలు వేసుకుని హాల్లో కుర్చీల్లో డిజైన్గా కూర్చున్నారు. స్టేజ్ మీద ‘సంగీత్ సెలబ్రేషన్స్’ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది.
సాహిత్య ఈ వేడుక కోసం తను మొన్న మాల్లో రెండు లక్షలు పెట్టి కొనుగోలు చేయించిన ఆ బంగారు రంగు డిజైనర్ లెహంగా వేసుకుని, ప్రిన్సెస్ లా స్టేజ్ వెనుక తయారై నిలబడింది. శివ కూడా దానికి మ్యాచింగ్ గా గోల్డ్ అండ్ వైట్ షేర్వాణీ వేసుకుని చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు.