అయిదవ భాగం :
రాజ పుత్రిక అయిన పద్మిని దేవి , తన వ్యూహరచన ని మొదలు పెట్టింది. తన భర్త అయిన రతన్ సింగ్ యొక్క ఇద్దరు మంత్రులకు 700 మంది సైనిక బలాన్ని ఇచ్చి , తన వ్యూహరచనతో ఉద్దీన్ ఖిల్జీ పైకి పంపింది. పద్మిని దేవి చెప్పిన వ్యూహాన్ని అనుకున్నట్టుగా అనుసరించారు ఆ ఇద్దరు మంత్రులు. అంతటి గొప్ప వ్యూహ రచన చేసింది కాబట్టే 700 మంది సైన్య బలంతో సుమారు 25 వేల మంది సైన్యాన్ని ఓడించి తన భర్త ని తిరిగి తన రాజ్యానికి తెచ్చుకోగలిగింది రాణి పద్మిని దేవి.