తనకి ఊహ తెలిసిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎప్పుడు తనతో తన తల్లి అంత కఠినం గా మాట్లాడింది లేదు…
అలాంటిది ఇప్పుడు ఆఫ్ట్రాల్ ఒక వ్యవసాయం చేసుకునే వాడి కోసం తనతో అంత రాష్ గా, కోపం గా మాట్లాడడం ఆమె కీ అసలు నచ్చలేదు..
హేయ్ మిస్టర్ నువ్వెలా ఉంటావో కూడా నాకు తెలియదు.. నీతో నాకు వ్యక్తిగతం గా ఎలాంటి శత్రుత్వం లేదు..
నువ్వు ఎల వున్న , నువ్వు కనుక వ్యవసాయం కాకుండా వేరే ఏ జాబ్ చేస్తున్న నేను నిన్ను పెళ్ళి చేసుకోవడానికి ఆలోచించే దాన్ని ఏమో..
బట్ ఇప్పుడు ఆ అవకాశమే లేదు.. నీకు నా అంత అందం లేకున్నా నేను ఆలోచించ్చే దాన్ని కాదు.. కానీ నీకు నా అంత చదువు లేదు..
పైగా ఎలాంటి జాబ్ చేయడం లేదు.. చదువు, సంధ్య లేని ఒక పల్లెటూరి వాడిని పెళ్ళి చేసుకునే ఉద్దేశం నాకు అసలు లేదు..