గెస్ట్ హౌస్ గేట్లు తెరుచుకోగానే మైరా కళ్లు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. అప్పటివరకు అది ఒక సాధారణ, పాతబడిన గెస్ట్ హౌస్ లా అనిపించినా,
ఇప్పుడు లోపల దృశ్యం పూర్తిగా మారిపోయింది. ఇషాంత్ తన అసాధారణమైన అభిరుచితో, దాన్ని ఒక మాయా ప్రపంచంలా మార్చేశాడు.
గోడలన్నీ లేత లేవండర్ రంగులో మెరిసిపోతున్నాయి, గాలిలో మల్లెపూల సువాసన, పక్కనే లైటింగ్.. ఇదంతా చూస్తుంటే ఒక కలలో ఉన్నట్లు అనిపించింది.
పాత గెస్ట్ హౌస్లో మైరాకు ఉన్న బాధాకరమైన జ్ఞాపకాలను, చేదు అనుభవాలను తుడిచిపెట్టేయడానికి ఇషాంత్ ప్రతి అంగుళాన్ని కొత్తగా డిజైన్ చేయించాడు.
ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి క్షణం మైరా తన పాత గతాన్ని మర్చిపోయి, ఇషాంత్ సృష్టించిన కొత్త ప్రపంచంలోకి ప్రవేశిస్తోంది.
గృహ ప్రవేశం కోసం ఇషాంత్ ఒక ప్రత్యేకమైన సెటప్ చేశాడు. ఇంటి గుమ్మం దగ్గర మైరా అడుగు పెట్టగానే, పైన ఏర్పాటు చేసిన సెన్సార్ల ద్వారా గులాబీ పూల రేకులు వర్షంలా ఆమెపై కురిశాయి.