అమెరికాలోని న్యూజెర్సీ తీరం. చలి గాలులు ఒంటిని ఇస్తుంటే, రణ్వీర్ అలియాస్ రానా కళ్లలో రగులుతున్న సెగ ఆ మంచును కూడా కరిగించేలా ఉంది.
తన బిజినెస్ సామ్రాజ్యాన్ని దెబ్బకొట్టి, తన మనుషులను హింసించిన ‘గ్లోబల్ సిండికేట్’ కి అంతిమ తీర్పు ఇచ్చే సమయం వచ్చేసింది.
ఒక పాత షిప్పింగ్ యార్డ్ లో ఉన్న అండర్ గ్రౌండ్ బంకర్. అక్కడ ‘బ్యారన్’ తన 50 మంది ప్రొఫెషనల్ కిల్లర్లతో కలిసి మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.
రణ్వీర్ సామ్రాట్ వస్తున్నాడంట వాడు ఇక్కడికి వస్తే వాడు చూసే చివరి సూర్యోదయం ఇదే అవుతుంది, అని బ్యారన్ నవ్వుతూ అంటుండగానే.. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.
బంకర్ మెయిన్ డోర్ తునాతునకలై గాల్లోకి లేచింది. దట్టమైన పొగ మధ్య నుంచి ఒక నల్లటి నీడ లోపలికి నడుచుకుంటూ వచ్చింది.చేతిలో రెండు భారీ ఆటోమేటిక్ గన్స్, కళ్లలో మృత్యువు.. అది రానా
రానా అడుగు పెట్టడమే ఆలస్యం.. కాల్పులు మొదలయ్యాయి. కానీ రానా వేగం శత్రువుల ఊహకు అందడం లేదు.