New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రాక్షసప్రేమ – 3

రాక్షసప్రేమ – 3

రాక్షసప్రేమ
“ఇంకా అనుకోవటానికి ఏముంది నాన్న. 6 నెలల క్రితం నాకు అతడు వద్దు అతనితో జీవితం వద్దు అనుకొని డైవర్స్ కేసు అప్లై చేశాను. అప్పటినుంచి ఇప్పటికీ ఒకే మాట మీద ఉన్నాను. చూద్దాం ఎన్ని రోజులు ఈ కేసుని ఇలా సాగదీస్తూ ఉంటాడో. అతడి పలుకుబడిని ఎంతవరకు ఉపయోగించుకుంటాడో మనం కూడా చూద్దాం. కానీ నేను మాత్రం వెనక్కి తగ్గేది లేదు అతడి జీవితంలోనికి వెళ్ళేది లేదు” అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది సౌర్య. 
“నీ కాన్ఫిడెంట్ చూస్తుంటే నాకు కూడా నమ్మకం కలుగుతుంది శౌర్య, ఇకపైన నీ జీవితం ఎలా ఉండాలి అనేది నువ్వు నిర్ణయించుకో నీకు తోడుగా మేము ఉంటాం” అని అన్నారు భరద్వాజ్..
ఓకే నాన్న అని తన తండ్రి చేతిని పట్టుకుని,
“థాంక్యూ నాన్న మీ సపోర్ట్ నాకు ఇస్తున్నందుకు” అని అన్నది శౌర్య. 
తన కూతురు జీవితంలో ఇప్పటి వరకు జరిగినది ఒక పీడకలలా మర్చిపోయి ఇక పైన ఆనందంగా బ్రతకాలి అని ఒక సగటు తండ్రిలా ఆయన కూడా కోరుకున్నారు.. అందుకే శౌర్య అలా మాట్లాడుతుంటే ఏమీ సమాధానం చెప్పలేక మౌనంగా ఉన్నారు భరద్వాజ్. 
సరే పదండి ఇంటికి వెళ్దాం, అని విరాజిత అన్నది. 
అలా అందరూ కూడా కారులో ఎక్కి కూర్చుంటున్నప్పుడు వాళ్లకి పది అడుగుల దూరంలో ఎదురుగా కార్ కి ఆనుకొని స్టైల్ గా నిలబడి ఉన్న రౌద్ర కనిపించాడు. 
రౌద్రని అక్కడ చూసిన ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా కోపం వచ్చింది. ఆఖరికి రౌద్ర అన్నయ్య  విరాట్ కి కూడా కోపం వచ్చి, ఆ కోపాన్ని ఆపుకోలేక రౌద్రా దగ్గరకు వెళ్లి అతని షర్ట్ కాలర్ పట్టుకుని “ఎందుకురా ఎందుకు ఇలా చేస్తున్నావ్..?” అని అడిగాడు..
రౌద్ర చాలా సింపుల్గా తన షర్ట్ కాలర్ పట్టుకున్న తన అన్నయ్య చేతిని తీసి “నువ్వు నాకు అన్నయ్యవి ఇలా తమ్ముడు షర్ట్ కాలర్ పట్టుకోవచ్చా..! తప్పు కదా..!” అని సర్కాస్టిగ్గా అన్నాడు.
రౌద్ర తన పక్కన ఉన్న అన్నయ్యతో మాట్లాడుతున్నాడు కానీ తన చూపు మాత్రం శౌర్య వైపే ఉంది…
రౌద్ర చూపు ఎక్కడుందో గమనించిన విరాట్ “రేయ్ విడాకులు ఇస్తే తన బ్రతుకు ఏదో తన బ్రతుకుతుంది, ఎందుకురా ఇలా తనకి విడాకులు ఇవ్వకుండా వేధిస్తున్నావ్..  ఒకప్పుడు ప్రేమించాను అన్న ఆ తర్వాత ఎవరూ లేకుండా పెళ్లి చేసుకున్నా తన సంతోషమే నీకు కావాలి అన్న కానీ ఇప్పుడు తను కన్నీళ్లు కారుస్తున్న నీకు జాలి దయ అనేది కలగడం లేదా ప్లీజ్ రా తనని వదిలేయ్” అనే రిక్వెస్ట్ గా అడిగాడు. 
అప్పటివరకు శౌర్య మీద ఉన్న రౌద్రా చూపు తన అన్నయ్య మీదకు తిప్పి “నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ అన్నయ్య. అసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావ్. నువ్వు నా అన్నయ్యవి నాకు సపోర్ట్ చేయాలి. సరే సపోర్ట్ చేయకపోతే సైలెంట్ గా ఉండాలి కానీ నీ తమ్ముడి కాపురంలో నిప్పులు పోయాలి అని చూస్తావా, 
నీ తమ్ముడు మరదలు ఇద్దరూ విడాకులు తీసుకోవాలి అనుకుంటే వద్దు అని నీ మరదలకు చెప్పి మన ఇంటికి తీసుకొని రావాల్సింది పోయి,
ఇంకా నన్నే విడాకులు ఇవ్వమని అడుగుతున్నావా..? ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా అన్నయ్య.. అయినా నువ్వు నీ భార్యతో కలిసి సంతోషంగా ఉంటే నేను వద్దు అని చెప్తానా..?
నువ్వు అన్నట్లు అప్పుడు తన సంతోషమే కోరుకున్న ఇప్పుడు కూడా నేను తన సంతోషమే కోరుకుంటున్నాను అన్నయ్య అయినా తన కళ్ళల్లో కన్నీళ్లు చూడాలి అని నేనెందుకు కోరుకుంటాను తను నా భార్య. కాకపోతే నేను చెప్పిన మాట వినక ఇంత దూరం తెచ్చుకుంది..
కానీ వదిన మంచిది కాబట్టి నీ మాట వింటుంది కానీ శౌర్య మంచిదే కాస్త మొండిది చెప్తే వింటుంది అర్థం చేసుకుంటుంది ఇప్పుడు కాకపోతే రేపైనా తను నా దగ్గరకు వస్తుంది. కాదు కాదు రావాల్సిందే” అని ఫస్ట్ నార్మల్గా మాట్లాడిన ఆ తర్వాత శౌర్యకి ఇక వేరే దిక్కే లేదు అన్నట్లుగా వంకరగా మాట్లాడాడు. 
“రేయ్ నువ్వు అంత టార్చర్ పెడుతుంటే ఏ ఆడపిల్ల మాత్రం ఆ టార్చర్ ని తట్టుకొని నీ దగ్గర ఉంటుంది రా, నిజ నిజాలు ఏంటో నువ్వు తెలుసుకోకుండా చేసిన పొరపాటు కాదు కాదు కాదు తప్పుకి పాపం శౌర్య బలయింది” అని విరాట్ అంటుంటే 
అప్పటివరకు కార్ కి ఆనుకొని స్టైల్ గా నిలబడ్డ రౌద్ర స్ట్రైట్ గా నిలబడి “తప్పు తప్పు అన్నయ్య అలా మాట్లాడకూడదు. అసలు ఇదంతా జరగటానికి కారణం ఎవరు నువ్వు కాదా. చేసిన తప్పంతా నువ్వు చేసి ఇప్పుడు నన్ను అంటున్నావ్,
నేను నా భార్య సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా..? నువ్వు నీ భార్య సంతోషంగా ఉంటుంటే నేనేమీ కాదు అనటం లేదు కదా, వదిన నువ్వు కలిసి ఉండాలి హ్యాపీగా ఉండాలి అని నేను ఇప్పటికీ ఎప్పటికీ కోరుకుంటాను.. కాబట్టి నువ్వు నా కాపురం విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే బెస్ట్..
ఒకవేళ ఇలా నాకు ఏదైనా సలహా ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు నీ భార్యకు విడాకులు ఇచ్చేసి ఆ తర్వాత నా భార్యకి కూడా నన్ను విడాకులు ఇవ్వమని చెప్పు.. లేదంటే సైలెంట్ గా ఉండు” అని నోటికి జిప్ వేసుకో అన్నట్లుగా సైగ చేసి మరి కోపంగా అన్నాడు…
అప్పటికే విరాట్ మాటలు రౌద్ర కి నచ్చటం లేదు కానీ అది పబ్లిక్ ప్లేస్, ఎక్కువగా ఏదైనా మాట్లాడినా కూడా అల్లరి అవుతారు మీడియా వాళ్ళు ఉంటారు అని కాస్త తగ్గి,   తన ఫీలింగ్స్ అన్ని కూడా ఫేస్ లో కనిపించే విధంగా తన అన్నయ్యకు తెలిసే విధంగా మాట రూపంలో చెప్పాడు లేకపోతే మరో రకంగానే ఉండేది..
“ఒక్కసారి తన వైపు నుండి ఆలోచించరా..!” అని విరాట్ చెప్పాలి అనుకున్నాడు..
కానీ రౌద్ర కోపంగా చూడటంతో ఇక విరాట్ ఏమి మాట్లాడలేక తలదించుకున్నాడు. 
“అయినా ఈ పెరుమాళ్ళ వంశంలో పుట్టి ఇలా ఎలా తలదించుకోగలుగుతున్నారా…! సేమ్ లెస్, నువ్వు ఇలా తలదించుకునే ఒకరి అడుగులకి మడుగులు వత్తుతున్నావు కాబట్టే నీ జీవితం ఇలా ఉంది..
కానీ నేను ఇలా ఎప్పటికీ చేయను. శౌర్య నా భార్య నేను ఎప్పటికీ తనకు విడాకులు ఇచ్చేది లేదు జీవితాంతం తను నా భార్యగా ఉండాల్సిందే.. అది తనకి ఇష్టం ఉన్న లేకపోయినా…;” అని చెప్పి ఇంకా తన వైపే సూటిగా చూస్తున్న శౌర్య వైపు ఒక లుక్ ఇచ్చి కార్లో కూర్చొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రౌద్ర. 
రౌద్ర అక్కడి నుంచి వెళ్ళిపోవటంతో విరాట్ తిరిగి సౌర్య వాళ్ళ దగ్గరకు వచ్చి వెళ్దాం అని అన్నాడు.. 
అంత డల్ గా విరాట్ మాట్లాడటంతో ఖచ్చితంగా అన్నదమ్ముల మధ్య ఏదో సీరియస్ డిస్కషన్ జరిగింది అని అందరికీ అర్థమై విషయం ఏంటి అని ఎవ్వరూ అడగలేదు కారులో కూర్చున్నారు. 
అందరూ మౌనంగా ఉన్నారు, మాట్లాడటానికి వాళ్లకు మాటలు కూడా రావడం లేదు అందరూ బాధలోనే ఉన్నారు. విరాట్ కారు డ్రైవ్ చేస్తున్నాడు 
అలా గంట తర్వాత అందరూ ఇంటికి చేరుకున్నారు.. 
శౌర్య తనకి ఎవరితో మాట్లాడాలి అనిపించకపోవడంతో కారు దిగి వెంటనే తన రూములోనికి వెళ్ళిపోయింది. 
శౌర్య వాళ్ళది త్రిబుల్ బెడ్ రూమ్ ఇల్లు, 
భరద్వాజ్ పూజిత వెళుతున్న శౌర్య వైపు బాధగా చూసారు. 
విరాజిత విరాట్ చేతిని పట్టుకొని “మీ తమ్ముడు ఏమంటున్నాడు విడాకులు ఇస్తాను అని అంటున్నాడా..?” అని ఆశగా అడిగింది..
విరాట్ తలదించుకొని “లేదు వాడి నోటి నుంచి విడాకులు అనే మాట కూడా రావటం లేదు. శౌర్య నా భార్య నా భార్యని నా నుండి దూరం చేయాలి అని చూస్తే ఎవరిని వదిలిపెట్టను అని నాకే వార్నింగ్ ఇస్తున్నాడు ఏం చేయాలో అర్థం కావడం లేదు” అని బాధగా అన్నాడు 
“ఇక శౌర్య జీవితాంతం ఈ బాధ అనుభవించాల్సిందేనా..?” అని అడిగింది విరాజిత. 
“ఏమో తెలియదు చెప్పలేం చూద్దాం, శౌర్య ఎంతవరకు పోరాడుతుందో, రౌద్ర ఎంతవరకు శౌర్య తనకు కావాలి అనే అంటాడో, 
రౌద్రలో మార్పు వస్తే ఓకే కానీ మార్పు రాకపోతే మాత్రం వీళ్ళిద్దరూ కలవటం అసాధ్యం. ఇలా వాయిదాల మీద వాయిదాలు మనం తిరుగుతూనే ఉండాలి తప్ప చేసేది ఏమీ లేదు. అంతా రౌద్రా చేతుల్లోనే ఉంది” అని చెప్పాడు విరాట్…
అలా అందరూ ఇంటికి వచ్చి బాధగా ఎవరి రూమ్ కి వారు వెళ్ళిపోయారు. ఈరోజు కచ్చితంగా కోర్టులో కేసు క్లోజ్ అయిపోతుంది విడాకులు వచ్చేస్తాయి అని అందరు అనుకున్నారు కానీ మరో 10 రోజులు వాయిదా పడటంతో అప్పటివరకు వాళ్ళ మనసులో ఉన్న ఆశలు అన్ని నీరుగారి పోయినట్లుగా అయింది.. 
రౌద్ర చాలా కోపంగా ఆవేశంగా ఇంటికి వెళ్లి తన కోట్ విప్పి సోఫాలో విసిరేసి సింగిల్ సీటర్ సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని వెనక్కి వాలి పైన ఉన్న శాండ్లర్ వైపు చూస్తూ ఉన్నాడు.. 
కిచెన్ లో నుంచి బయటకు వచ్చిన రౌద్ర తల్లి కనకధారా సోఫాలో కూర్చుని ఉన్న రౌద్రాన్ని చూసి “ఎప్పుడు వచ్చావు రా..?” అని అడిగింది..
కనీసం రుద్ర తన తల్లి వైపు కూడా చూడకుండా అంతే పైన ఉన్న శాండ్లర్ వైపే చూస్తూ ఉన్నాడు. 
రౌద్ర వెళ్లిన పని కంప్లీట్ కాలేదు అని రౌద్ర ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో కనకధారా అర్థం చేసుకొని కిచెన్ లోనికి వెళ్లి వాటర్ జ్యూస్ కాఫీ తీసుకొని వచ్చి “రేయ్ ఫస్ట్ వాటర్ జ్యూస్ కాఫీ ఏదో ఒకటి తీసుకుని తాగు మైండ్ ఫ్రెష్ అయ్యిద్ది” అని అన్నది..
కానీ రౌద్ర చాలా కోపంగా తన తల్లి తీసుకొని వచ్చిన ప్లేట్ ని పైకి విసిరి కొట్టి “ఏంటమ్మా ఏంటి అక్కడ అది నా భార్య కాదు నాకు విడాకులు కావాలి అని కోర్టులో కేసు వేసి నన్ను కోర్టు చుట్టూ కుక్కలా తిప్పుతూ ఉంటే ఇక్కడ నేను నువ్వు ఇచ్చే కాఫీ జ్యూస్ తాగుతూ కూర్చోవాలా.. అసలు అది ఏమనుకుంటుంది.. 
కొనసాగుతుంది..