53
మధ్యాహ్నం లంచ్ టైం లో కనకమహాలక్ష్మి బయటికి వచ్చింది. ఆమె లైట్ ఫుడ్ తీసుకుంటుంది వయసు పైబడటంతో,
ఇప్పటికి కూడా తన అత్తయ్యకు తనే వడ్డిస్తుంది లేదంటే కచ్చితంగా ఆ రోజు బడితపూజ అని తనకు తెలుసు అందుకే భయపడి అలా తన అత్తయ్యకు సేవలు చేస్తుంది కానీ శౌర్య అలా చేయడం లేదు అనేది కూడా కనకధార మనసులో ఉంది
కనకమహాలక్ష్మి తింటుంటే ఆమె పక్కనే వచ్చి శౌర్య కూర్చుని ప్లేట్ తీసుకుంటుంటే అది చూసిన కనకధారా కనకమహాలక్ష్మి ఇద్దరికీ కోపం పెరిగిపోయింది. కనకమహాలక్ష్మి కోపంగా కనకధారా వైపు ఒక చూపు చూసింది.
కోడల్ని కంట్రోల్లో పెట్టడం అంటే ఇదేనా అన్నట్లుగా ఆమె చూపులు అర్థం చేసుకున్న కనకధారా “శౌర్య ఏం చేస్తున్నావ్? అమ్మమ్మ గారు ఫస్ట్ తింటున్నారు కదా ఆవిడ తిన్న తర్వాత నువ్వు తినాలి కాసేపు కూడా ఆకలికి ఆగలేదా అంత తొందరేంటి తిండికి గతిలేక ఇక్కడికి వచ్చి తింటున్నట్లు ఉంది” అని అన్నది
“నేను గతిలేక తింటున్నాను, ఏ నీ కొడుకు పెళ్లి చేసుకుని ఇంటికి కోడల్ని తీసుకొని వెళ్తే ఆ కోడలికి ఫుడ్ కూడా పెట్టలేనంత దిక్కుమాలిన స్థితిలో మీరు ఉన్నారా..? తినడానికి కూర్చున్న వాళ్ళని లేపకూడదు అని నీకు తెలియదా..?” అని శౌర్య కూడా ఎదురు తిరిగి సమాధానం చెప్పింది..
“ఏయ్ ఏం మాట్లాడుతున్నావే? ఇప్పటివరకు మా అత్తయ్యకు నేను ఎదురు తిరిగి ఒక్క మాట మాట్లాడలేదు నిన్నకాక మొన్న పెళ్లయి ఈ ఇంటిలో కోడలుగా అడుగుపెట్టిన నువ్వు నీ అత్తయ్యగా నాకు గౌరవం ఇవ్వాల్సింది పోయి ఎదురు తిరిగి మాట్లాడతావా..?” అని కనకధార ఆవేశంతో ఊగిపోయింది..