విశాలంగా ఉన్న ఆ గది లో మూడు వైపులా సిమెంట్ గోడలు అందమైన పెయింట్ తో వివిధ వర్ణచిత్రాలతో అలరారు తుంటే ఒక వైపు గ్లాస్ వాల్ లోంచి ఎగసిపడుతున్న సముద్రమే అద్భుత మైన జీవ చిత్రంలా కనబడుతుంది.
గది మధ్యలో వేసున్న టేబుల్ పై ఉన్న లాప్టాప్ వైపు తీక్షణంగా చూస్తున్నాడు వీర్.
అతని ముందు తల దించుకుని నిలబడ్డాడు ఒక 50 ఏళ్ళ వ్యక్తి. అతడు కంపెనీ అకౌంట్స్ చూసే వ్యక్తి.. పేరు శంకర్ బాబు.అతడు సన్నగా వణుకు తున్నాడు.
వీర్ లాప్టాప్ నుంచి దృష్టి మరల్చి.. షేమ్ ఆన్ యు.. ఇలా చేస్తారని అనుకోలేదు.. నేను ఇప్పుడే మిమ్మల్ని ఫైర్ చేయొచ్చు.. కానీ మీరు మా డాడ్ కి స్నేహితులని ఆయన మిమ్మల్ని నమ్మారు.. దానికి ఫలితం గా ఇదా మీరు చేసేది.. అన్నాడు కోపంగా.
సారీ వీర్.. ఏదో.. ఆశపడ్డాను.. పెద్ద వయసు.. దయచేసి క్షమించు.. అన్నాడు అతడు.
50 లక్షల రూపాయలు తేడా వచ్చింది.. అదీ ఈ ఇయర్.. సాగర్ నగర్ లో ఖరీదైన విల్లా కొన్నారట కదా.. ఇలా కొట్టేసిన డబ్బు తోనా.. ఇటుక ఇటుక లోను మీరు అవినీతిగా సంపాదించిన సొమ్మే ఉందా.. కోపం గా అడిగాడు వీర్.