భయపడకు అమ్మ. నా పెళ్లి, నా జీవితం.. ఎవరో వచ్చి నిర్ణయించడం ఏంటి? రేపు వాళ్ళు వచ్చేవరకు చూస్తూ కూర్చోలేను. కాసేపట్లో ప్రణతి వస్తుందన్నాడు మావయ్య. మనకి కొంతైనా నిజం చెప్పగలిగేది ప్రణతి ఒక్కతే! ఆమెను ఒంటరిగా కలిసే అవకాశం చూస్తాను” అంది మహా నిశ్చయంగా.
మహా మాటల్లోని ధైర్యం చూసి సీత కొంత ఊరట చెందినా, మనసు మాత్రం ఏదో ప్రమాదం పొంచివున్నట్లు కలవరపడుతూనే ఉంది.
ఈ విషయం విష్ణు కి తెలుసా..? తెలిస్తే ఎలా రియాక్ట్ అయి ఉంటాడు?? మావయ్య అడగలేక అడిగాడు.. ఇక్కడ కి వచ్చి మమ్మల్ని అడిగే లోపు అత్తయ్య, మావయ్య మధ్య డిస్కషన్ అయ్యే ఉంటుంది.. విష్ణు ఏ విధంగా రియాక్ట్ అవుతాడు.. అసలు ఏం చేస్తున్నాడో.. ఎలా ఆలోచిస్తున్నాడో.. అనుకుంది బాధగా మహా.
* **** *** *** ****
తనగదిలోకి వచ్చి భోజనం ప్లేట్ పెట్టి మౌనం గా వెళ్లిపోతున్న నిర్మల ని చూసి..
వీర్ ఎక్కడ నిర్మల.. అని గంభీరంగా అడిగింది అంజనీ దేవి.