రీల్స్ పెళ్ళాం… రొమాంటిక్ మొగుడు – 3
మేము కలిసి ఉండలేం” అని కోర్టులో చెప్పినప్పుడు సుమిత్ కళ్ళలోకి చూసింది.
ఆ కళ్ళలో కోపం లేదు, కేవలం ఓటమి, వేదన మాత్రమే ఉన్నాయి.
అదే మధును ఇంకా ఎక్కువ నరకానికి గురిచేస్తోంది.
సుమిత్ కి సమయానికి తిండి తినడం చేతకాదు, రాత్రివేళ వర్క్ చేస్తూ అలానే సోఫాలో నిద్రపోతాడు, దుప్పటి కప్పేవాళ్ళు లేకపోతే ఉదయానికి జలుబు చేస్తుంది.
” రేపటి నుంచి ఇవన్నీ ఎవరు చూసుకుంటారు ? ” అని ఆలోచిస్తుంటే మధు గొంతు ఎండిపోయింది.
అతనిపై ఉన్నది కోపం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయామన్న వేదన మాత్రమే అని అర్థమవుతోంది.
మంచం మీద ఉన్న పక్కన దిండును గట్టిగా కౌగిలించుకుని, నోటి మీద చేయి పెట్టుకుని, తన ఏడుపు బయట ఉన్న సుమిత్ కి వినిపించకూడదని తపించిపోయింది.
ఆ రాత్రి ఇద్దరికి చాలా భారంగా గడిచింది…ఎవరు తినలేదు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలని అనుకోలేదు.
ఒకే ప్రాణంగా ఒకే బెడ్ మీద దూరం లేని దగ్గరతనంతో ఉండే రెండు మనసులు …. ఈ రోజు రెండు వందల అడుగుల దూరంలో రెండు గదుల్లో ఒంటరిగా మిగిలిపోయాయి.
రాత్రి మొత్తం ఇద్దరికి నిద్ర లేని కారణంగా వెచ్చని సూర్యకిరణాలు మోమును పడుతున్నా లేవలేని స్థితిలో ఉన్న ఆఫీస్ కి వెళ్ళాలి కాబట్టి లేచి వాష్ రూమ్ లోకి వెళ్తాడు.
మరోవైపు మధు కూడా ఉదయాన్నే లేచి భర్తకి అన్ని పనులు దగ్గరుండి చేసి కర్చీఫ్ తో సహా అన్ని అందించి అతనికి క్యారియర్ కట్టి ప్రేమగా టిఫిన్ గోరుముద్దులుగా చేసి తినిపించడం అలవాటైన తను ఇప్పుడు ఈ క్షణం కూడా ఒంటరిగా ఉండలేక వంట గదిలో కుస్తీ పడుతుంది భర్తకి కావాల్సినవి సమకూర్చడానికి.
ఫ్రెష్ అయి ఆఫీస్ బ్యాగ్ తో వచ్చిన సుమిత్ కి వంట గదిలో చీర చెంగుని బొడ్లో దోపుకొని… నుదిటిన పట్టిన చిరుజమటతో… వయ్యారంగా వంపులు తిరిగిన నడుముతో…. కూరలో గరిట పెట్టి తిప్పుతున్న తనని చూడగానే చిలిపి అల్లరి అతని మదిలో రేగుతుంది.
ఆఫీస్ బ్యాగ్ పక్కన పెట్టు నెమ్మదిగా సౌండ్ చేయకుండా వెనుకగా వెళ్లి మధు నడుము చుట్టూ రెండు చేతులతో బిగించి మధు భుజం మీద గడ్డం ఆనించి…
” ఏం చేస్తుంది నా శ్రీమతి గారు !! హాట్ హాట్ గా ఉంది ఇంత హాట్ గా ఉన్న నీ చేతులతో హాట్ కాఫీ ఇస్తే ఇంకా కిక్ ఉంటుంది ” అని అంటాడు చిన్నగా బైట్ చేస్తూ
వెంటనే సుమిత్ చేతులు విడిపించుకుని ముందుకు తిరిగి పక్కనే ఉన్న ఫోన్ స్క్రోల్ చేసి చూపిస్తుంది .
” హాట్ మైండ్ ఉన్న మొగుడు… కాఫీ కూడా హాట్ గా తాగుతాడు !! ఇది మీ జాతకంలో లేక్ కి సంకేతం “.
” ఆ లైన్ చూసిన మరుక్షణం సుమిత్ మూడ్ మారిపోయి ఇవన్నీ నీ దగ్గరే ఉంచుకో నాకు అవసరం లేదు ” సీరియస్ గా చెప్తూ హాల్లోకి వచ్చేస్తాడు.
ఆ సిచువేషన్ ఇప్పుడు మళ్లీ ఆలోచిస్తుంటే అందులో ఏదో క్లూ ఉంది అన్నట్లుగా అతని మనసు చెప్తుంది బట్ అది ఏంటో తెలియడం లేదు.
” టిఫిన్ కాఫీ రెడీగా ఉంది కావలసిన వాళ్లు తినొచ్చు వద్దనుకున్న వాళ్ళు వెళ్లిపోవచ్చు… ” కొట్టినట్లుగా చెప్తూ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి పక్కకి వెళ్ళిపోతుంది మధు
ప్రేమగా మనిషి వడ్డించిన దానికి !! అసలు సంబంధం లేకుండా ముఖం వైపు చూడకుండా పెట్టిన దానికి చాలా తేడా ఉంటుంది !! ఇప్పుడు ఆ ఫీల్ సుమిత్ డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు.
టిఫిన్ చేయకుండానే లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్ కి వెళ్లడే కానీ మనసు ఎక్కడో ఉంది !! దాని పర్యవసానం మేనేజర్ దగ్గర బోనస్ గా నాలుగు తిట్లు.
అరే ఏమైంది రా కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను చాలా డల్ గా ఉంటున్నావ్ ఇంతకు ముందు ఎంతో హుషారుగా ఉండే వాడివి…
మేనేజర్ చెప్పి చెప్పగానే కొన్ని నిమిషాలలోనే వర్క్ చేసి సబ్మిట్ చేసే నువ్వు ఇప్పుడు పరధ్యానంగా ఆలోచిస్తే కూర్చుంటున్నవు ఏమైంది ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు తన కొలీగ్.
మనలో ఉన్న ప్రాబ్లం ఎవరితోనైనా షేర్ చేసుకుంటే చాలా రిలీఫ్ గా ఉంటుందంటారు అదే ఆలోచిస్తూ తనకి మధుకి మధ్య జరిగిన డిస్కషన్ మొత్తం చెప్పగానే షాక్ తో నోరు వెల్లబేట్టి చూస్తాడు.
ఏంటి నీ ముక్కు మీద మచ్చ ఉందని డివోర్స్ ఇస్తుందా ?? ఇదెక్కడ వింత రా బాబు కారు కొనలేదని లేకపోతే తనకు మనీ ఇవ్వలేదని డివోర్స్ ఇచ్చే అమ్మాయిలు చూసాను కానీ ఇలా కూడా ఆలోచించేవాళ్ళు ఉంటారా !!
కానీ నాకెందుకో ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది రా తను ఇంకేదో ప్రాబ్లం వల్ల సఫర్ అవుతుందేమో అది నీకు చెప్పడం లేదేమో ఒకసారి ఆలోచించు.
స్టోరీ కంటిన్యూస్….
మరి ప్రాబ్లం ఎక్కడ.మొదలు ది… మీకు తెలుసా మై డియర్ రీడర్స్… తెలిస్తే కామెంట్ చేయండి
Swipe left/right or tap the sides to turn pages